కంటెంట్‌కు వెళ్లండి

David

968 వచనాలు · 40 కుటుంబ సభ్యులు

David ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. దావీదు శ్రేష్ఠమైన కీర్తన. నా దేవా, నేను మిమ్మల్ని ఆశ్రయించాను, నన్ను కాపాడండి.

  2. దావీదు ప్రార్థన. యెహోవా, న్యాయమైన నా మనవి వినండి; నా మొర ఆలకించండి. నా ప్రార్థన వినండి అది మోసపూరితమైన పెదవుల నుండి రాలేదు.

  3. సంగీత దర్శకునికి. యెహోవా దావీదును శత్రువులందరి చేతి నుండి సౌలు చేతి నుండి విడిపించినప్పుడు అతడు పాడిన పాట. యెహోవా సేవకుడైన దావీదు కీర్తన. యెహోవా నా బలమా, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను.

  4. ఆయన తన రాజుకు ఘన విజయాలు ఇస్తారు; ఆయన తన అభిషిక్తుడైన దావీదుకు అతని సంతానానికి, తన మారని ప్రేమను చూపిస్తారు.

  5. సంగీత దర్శకునికి. దావీదు కీర్తన. ఆకాశాలు దేవుని మహిమను ప్రకటిస్తున్నాయి; అంతరిక్షం ఆయన చేతిపనిని చాటుతుంది.

  6. సంగీత దర్శకునికి. దావీదు కీర్తన. కష్టకాలంలో యెహోవా మీకు జవాబిచ్చును గాక; యాకోబు దేవుని నామం మిమ్మల్ని కాపాడును గాక.

  7. సంగీత దర్శకునికి. దావీదు కీర్తన. యెహోవా! మీ బలంలోనే రాజు ఆనందిస్తాడు. మీ రక్షణను బట్టి అతడు ఎంతో సంతోషిస్తాడు!

  8. సంగీత దర్శకునికి. “ఉదయకాలపు జింక పిల్ల” అనే రాగం మీద పాడదగినది. దావీదు కీర్తన నా దేవా, నా దేవా! నన్ను ఎందుకు విడిచిపెట్టారు? నన్ను రక్షించకుండ ఎందుకంత దూరంగా ఉన్నారు, వేదనతో కూడిన నా మొరలకు ఎందుకు దూరంగా ఉన్నారు?

  9. దావీదు కీర్తన యెహోవా నా కాపరి, నాకు ఏ కొరత లేదు.

  10. దావీదు కీర్తన. భూమి, దానిలో ఉండే సమస్తం, లోకం, దానిలో నివసించేవారు యెహోవా సొత్తు.

  11. దావీదు కీర్తన. యెహోవా, నా దేవా, నేను మీపై నమ్మిక ఉంచాను.

  12. దావీదు కీర్తన. యెహోవా, నేను నిందారహితునిగా జీవించాను, నాకు న్యాయం తీర్చండి; నేను ఏ సందేహం లేకుండ యెహోవాను నమ్మాను.

  13. దావీదు కీర్తన. యెహోవాయే నాకు వెలుగు నా రక్షణ నేను ఎవరికి భయపడతాను? దేవుడే నా జీవితానికి బలమైన కోట నేను ఎవరికి భయపడతాను?

  14. దావీదు కీర్తన. యెహోవా, నేను మీకు మొరపెట్టుకుంటున్నాను; మీరు నా కొండయై ఉన్నారు, నా మొరను నిర్లక్ష్యం చేయకండి. ఒకవేళ మీరు మౌనంగా ఉంటే, నేను గుంటలోకి దిగిపోయే వారిలా అవుతాను.

  15. దావీదు కీర్తన. దేవ కుమారులారా, యెహోవాకు ఆపాదించండి, మహిమను బలాన్ని యెహోవాకు ఆపాదించండి.

  16. దేవాలయ ప్రతిష్ఠ కొరకైన పాట; దావీదు కీర్తన. యెహోవా, నేను మిమ్మల్ని ఘనపరుస్తాను, ఎందుకంటే నా శత్రువులు నాపై విజయం సాధించకుండ మీరు నన్ను పైకి లేవనెత్తారు.

  17. ప్రధాన గాయకునికి. దావీదు కీర్తన. యెహోవా, నేను మీలో ఆశ్రయం పొందాను; నన్ను ఎప్పటికీ సిగ్గుపడనీయకండి; మీ నీతిని బట్టి నన్ను విడిపించండి.

  18. దావీదు ధ్యానకీర్తన. తమ పాపాలు క్షమించబడినవారు తమ పాపాలు పరిహరించబడినవారు ధన్యులు.

  19. అబీమెలెకు ఎదుట వెర్రి వానిలా ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తర్వాత దావీదు వ్రాసిన కీర్తన. నేను అన్ని వేళలా యెహోవాను కీర్తిస్తాను; ఆయన స్తుతి నిత్యం నా పెదవులపై ఉంటుంది.

  20. దావీదు కీర్తన. యెహోవా, నాతో వాదించే వారితో వాదించండి; నాతో పోరాడే వారితో పోరాడండి.

  21. సంగీత దర్శకునికి. యెహోవా సేవకుడైన దావీదు కీర్తన. దుష్టుల పాప స్వభావాన్ని గురించి నా హృదయంలో నేను దేవుని నుండి వర్తమానం పొందుకున్నాను; వారి కళ్లలో దేవుని భయం లేదు.

  22. దావీదు కీర్తన. దుష్టులను బట్టి బాధపడకు తప్పు చేసేవారిని చూసి అసూయపడకు;

  23. దావీదు దేవునికి విన్నవించుకున్న కీర్తన యెహోవా, మీ కోపంలో నన్ను గద్దించకండి ఉగ్రతలో నన్ను శిక్షించకండి.

  24. సంగీత దర్శకుడైన యెదూతూనుకు. దావీదు కీర్తన. నేను, “నేను నా నాలుకతో పాపం చేయకుండా ఉండడానికి నా మార్గాలను సరిచూసుకుంటాను; దుష్టులు నా దగ్గర ఉన్నప్పుడు నా నోటికి చిక్కం పెట్టుకుంటాను” అని అన్నాను.

  25. సంగీత దర్శకునికి. దావీదు కీర్తన. యెహోవా కోసం ఓర్పుతో ఎదురుచూశాను; ఆయన నా వైపు తిరిగి నా మొరను ఆలకించారు.