కంటెంట్‌కు వెళ్లండి

The Tribe Of Judah గురించి బైబిల్ వచనాలు

84 వచనాలు · 42 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. పశ్చిమ సరిహద్దు మధ్యధరా సముద్ర తీరప్రాంతము.

  2. యూదా గోత్రం వారు తమ తోటి ఇశ్రాయేలీయులైన షిమ్యోను గోత్రం వారితో, “మాకు కేటాయించబడిన భూభాగంలో ఉన్న కనానీయులతో యుద్ధానికి మాతో పాటు రండి. అలాగే మీతో పాటు మేము కూడా మీ భూభాగం కోసం వస్తాం” అన్నారు. కాబట్టి షిమ్యోనీయులు వారితో వెళ్లారు.

  3. యూదా దాడి చేసినప్పుడు యెహోవా కనానీయులను, పెరిజ్జీయులను వారి చేతికి అప్పగించారు; వారు బెజెకు దగ్గర పదివేలమంది పురుషులను హతం చేశారు.

  4. వారు బెజెకు దగ్గర రాజైనా అదోని-బెజెకును చూసి అతనితో యుద్ధం చేసి కనానీయులను, పెరిజ్జీయులను ఓడించారు.

  5. అదోని-బెజెకు పారిపోయినప్పుడు వారు అతన్ని తరిమి పట్టుకుని అతని కాలు చేతుల బొటన వ్రేళ్ళను కోసివేశారు.

  6. అప్పుడు రాజైన అదోని-బెజెకు, “ఇలా కాలు చేతుల బొటన వ్రేళ్ళు కోయబడిన డెబ్బైమంది రాజులు నా బల్లక్రింద పడిన ముక్కలు ఏరుకునేవారు. నేను వారికి చేసిన దానికి దేవుడు నాకు తగిన ప్రతిఫలమిచ్చారు” అని అన్నాడు. వారు అతన్ని యెరూషలేముకు తీసుకువచ్చారు, అతడక్కడ చనిపోయాడు.

  7. యూదా వారు యెరూషలేము మీద దాడి చేసి దానిని పట్టుకుని అక్కడి ప్రజలను ఖడ్గంతో చంపి, వారు పట్టణాన్ని కాల్చివేశారు.

  8. ఆ తర్వాత యూదా వారు కొండ సీమలో, దక్షిణ దేశంలో, పశ్చిమ కొండ దిగువ ప్రాంతంలో ఉన్న కనానీయులతో పోరాడటానికి వెళ్లారు.

  9. వారు గతంలో కిర్యత్-అర్బా అని పిలువబడిన హెబ్రోనులో ఉన్న కనానీయుల మీదికి వెళ్లి షేషయి అహీమాను తల్మయి అనే వారిని ఓడించారు.

  10. అక్కడినుండి వారు గతంలో కిర్యత్-సెఫెరు అని పిలువబడిన దెబీరులో నివసిస్తున్న ప్రజల మీద దాడి చేశారు.

  11. కాలేబు, “కిర్యత్-సెఫెరు మీద దాడి చేసి స్వాధీనపరచుకున్న వ్యక్తికి నా కుమార్తె అక్సాను ఇచ్చి పెళ్ళి చేస్తాను” అని అన్నాడు.

  12. కాలేబు సోదరుడూ కెనజు కుమారుడైన ఒత్నీయేలు దానిని స్వాధీనపరచుకున్నాడు; కాబట్టి కాలేబు తన కుమార్తె అక్సాను అతనికిచ్చి పెళ్ళి చేశాడు.

  13. ఒక రోజు ఆమె ఒత్నీయేలు దగ్గరకు వచ్చి తన తండ్రిని ఒక పొలం అడగమని అతన్ని కోరింది. ఆమె తన గాడిదను దిగినప్పుడు కాలేబు, “నేను నీకేమి చేయాలి?” అని ఆమెను అడిగాడు.

  14. ఆమె జవాబిస్తూ, “నాకు ప్రత్యేక దీవెన కావాలి. నీవు నాకు దక్షిణం దేశంలో భూమి ఇచ్చావు, ఇప్పుడు నీటి ఊటలు కూడా ఇవ్వు” అని అన్నది. కాబట్టి కాలేబు ఆమెకు ఎగువ, దిగువ నీటి మడుగులను ఇచ్చాడు.

  15. కెనీయుడైన మోషే మామ యూదా ప్రజలతో ఖర్జూర చెట్ల పట్టణంలో నుండి అరాదు దక్షిణ దిక్కులోని యూదా ఎడారికి వెళ్లి అక్కడ ఉన్నవారితో నివసించారు.

  16. తర్వాత యూదా వారు తమ తోటి ఇశ్రాయేలీయులైన షిమ్యోనీయులతో వెళ్లి జెఫతులో నివసిస్తున్న కనానీయులపై దాడి చేసి, పట్టణాన్ని పూర్తిగా నాశనం చేశారు. కాబట్టి ఆ పట్టణానికి హోర్మా అని పేరు పెట్టారు.

  17. యూదా వారు గాజాను అష్కెలోనును ఎక్రోనును ఈ పట్టణాల చుట్టూ ఉన్న ప్రదేశాలతో పాటు పట్టుకున్నారు.

  18. యెహోవా యూదా మనుష్యులతో ఉన్నారు కాబట్టి వారు కొండ సీమను స్వాధీనం చేసుకున్నారు, కానీ మైదాన ప్రాంతాల్లో ఉన్న వారి దగ్గర ఇనుప రథాలు ఉండినందుకు వారిని తరుమలేకపోయారు.

  19. మోషే వాగ్దానం చేసినట్లు కాలేబుకు హెబ్రోను ఇవ్వబడింది, అతడు అనాకు యొక్క ముగ్గురు కుమారులను తరిమేశాడు.

  20. అప్పుడు ఆ సంగతి విన్న రాజైన దావీదు యాజకులైన సాదోకు అబ్యాతారులకు ఇలా కబురు పంపించాడు: “ ‘ఇశ్రాయేలు వారందరూ మాట్లాడుకుంటున్న విషయం రాజభవనంలో ఉన్న రాజుకు చేరింది. మరి రాజును తన భవనానికి తీసుకురావడానికి మీరెందుకు ఆలస్యం చేస్తున్నారు?

  21. మీరు నా సోదరులు నా రక్త సంబంధులు! రాజును తిరిగి తీసుకురావడానికి మీరెందుకు ఆలస్యం చేస్తున్నారు?’ అని యూదా పెద్దలను అడగండి.

  22. తర్వాత అమాశాతో, ‘నీవు నాకు రక్త సంబంధివి కదా! యోవాబు స్థానంలో నిన్ను నా సేనాధిపతిగా నేను చేయకపోతే దేవుడు నన్ను తీవ్రంగా శిక్షిస్తాడు’ అని చెప్పండి” అన్నాడు.

  23. అతడు వెళ్లి యూదావారందరు ఒక్క మాట మీద ఉండేలా వారందరి హృదయాలను గెలుచుకున్నాడు. అప్పుడు వారు, “మీరు మీ సైన్యం తిరిగి రండి” అని రాజుకు కబురు పంపించారు.

  24. రాజు తిరిగి రావడానికి బయలుదేరి యొర్దాను ఒడ్డుకు చేరుకున్నాడు. యూదా వారు రాజును కలవడానికి, రాజును నది ఇవతలికి తీసుకురావడానికి గిల్గాలుకు వచ్చారు.

  25. అప్పుడు ఇశ్రాయేలు వారందరూ రాజైన దావీదు దగ్గరకు వచ్చి అతనితో, “మా సహోదరులైన యూదా వారు రాజును ఎత్తుకెళ్లి, నిన్ను నీ ఇంటివారిని నీ సేవకులను యొర్దాను ఇవతలకు ఎందుకు తీసుకువచ్చారు?” అని అడిగారు.