Syria గురించి బైబిల్ వచనాలు: Prophecies concerning
Prophecies concerning గురించి వచనాలు
ఎందుకంటే అరాము రాజధాని దమస్కు. దమస్కు రాజు రెజీను మాత్రమే. అరవై అయిదు సంవత్సరాలు కాకముందే ఎఫ్రాయిం ఒక జాతిగా ఉండకుండా నాశనం అయిపోతుంది.
ఎఫ్రాయిముకు సమరయ రాజధాని, సమరయకు రెమల్యా కుమారుడు రాజు. మీరు మీ విశ్వాసంలో స్థిరంగా ఉండకపోతే మీరు క్షేమంగా ఉండలేరు.”
యెహోవా ఆహాజుతో మరలా మాట్లాడుతూ,
“నీ దేవుడైన యెహోవాను ఒక సూచన అడుగు. అది పాతాళమంత లోతైనా సరే, ఆకాశమంత ఎత్తైనా సరే” అన్నారు.
అయితే ఆహాజు, “నేను అడగను, యెహోవాను పరీక్షించను” అన్నాడు.
అప్పుడు యెషయా, “దావీదు కుటుంబమా! వినండి. మనుష్యుల ఓపికను పరీక్షించడం సరిపోదని, నా దేవుని ఓపికను కూడా పరీక్షిస్తున్నారా?
కాబట్టి, ప్రభువే స్వయంగా మీకు ఒక సూచన ఇస్తారు: ఇదిగో ఒక కన్య గర్భం ధరించి ఒక కుమారుని కని, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడతారు.
తప్పును తిరస్కరించి, సరియైనది ఎంచుకోవడం తెలిసినప్పుడు అతడు పెరుగు, తేనె తింటాడు.
ఎందుకంటే తప్పును తిరస్కరించి సరియైనది ఎంచుకునే తెలివి ఆ బాలునికి రాకముందు నిన్ను భయపెట్టే ఆ ఇద్దరు రాజుల దేశాలు పాడుచేయబడతాయి.
ఆ పిల్లవాడు నాన్న అమ్మ అని పిలువకముందే, అష్షూరు రాజు దమస్కు సంపదని సమరయ దోపుడుసొమ్మును ఎత్తుకుని పోతాడు.”
యెహోవా నాతో మరలా ఇలా మాట్లాడారు:
“ఈ ప్రజలు మెల్లగా పారే షిలోహు నీటిని వద్దు అని, రెజీను గురించి, రెమల్యా కుమారుని గురించి సంతోషిస్తున్నారు,
కాబట్టి ప్రభువు భయంకరమైన యూఫ్రటీసు నది వరద నీటిని అనగా అష్షూరు రాజును, అతని బలగమంతటిని వారి మీదికి రప్పించబోతున్నారు. అవి దాని కాలువలన్నిటి నుండి ఉప్పొంగి దాని ఒడ్డులన్నిటి మీది నుండి ప్రవహిస్తాయి.
దమస్కుకు వ్యతిరేకంగా ప్రవచనం: “చూడండి, దమస్కు ఒక పట్టణంగా ఇక ఉండదు, కాని అది శిథిలాల కుప్పగా మారుతుంది.
అరోయేరు పట్టణాలు నిర్జనమవుతాయి అవి గొర్రెల మందలకు వదిలేయబడతాయి, ఎవరి భయం లేకుండా అవి అక్కడ పడుకుంటాయి.
ఎఫ్రాయిములో నుండి కోటగల పట్టణం మాయమవుతుంది, దమస్కు రాజ్యాధికారాన్ని కోల్పోతుంది; ఇశ్రాయేలీయుల ప్రభావానికి జరిగినట్లు అరాములో మిగిలినవారికి జరుగుతుంది” అని సైన్యాల యెహోవా తెలియజేస్తున్నారు.
నేను ఉత్తర రాజ్యాల జనాంగాలన్నిటిని పిలిపించబోతున్నాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు. “వారి రాజులు వచ్చి తమ సింహాసనాలను యెరూషలేము గుమ్మాల్లో ఏర్పరచుకుంటారు; వారు దాని చుట్టుప్రక్కల ఉన్న ప్రాకారాలన్నింటి మీద అలాగే యూదా పట్టణాలన్నింటి మీద దాడి చేస్తారు.
దమస్కు గురించి: “హమాతు, అర్పదు చెడువార్త విని భయంతో క్రుంగిపోయారు. వారు హృదయంలో కలవరపడ్డారు, నెమ్మది లేని సముద్రంలా ఆందోళన పడుతున్నారు.
దమస్కు బలహీనమైపోయింది, పారిపోవడానికి అది వెనుకకు తిరిగింది, భయం దాన్ని పట్టుకుంది; ప్రసవ వేదనలో ఉన్న స్త్రీలా దానికి వేదన, బాధ కలిగాయి.
పేరు పొందిన పట్టణం, నేను ఆనందించే పట్టణం ఎందుకు వదల్లేదు?
నిశ్చయంగా, దాని యువకులు వీధుల్లో కూలిపోతారు; ఆ రోజున దాని సైనికులందరూ మూగబోతారు,” అని సైన్యాల యెహోవా ప్రకటించారు.
“నేను దమస్కు గోడలకు నిప్పు పెడతాను; అది బెన్-హదదు కోటలను దహించివేస్తుంది.”
యెహోవా ఇలా చెప్తున్నారు: “దమస్కు చేసిన మూడు పాపాల గురించి, దాని నాలుగు పాపాల గురించి నేను దానిని తప్పకుండా శిక్షిస్తాను. ఎందుకంటే అది గిలాదును ఇనుప పనిముట్లతో నూర్చింది.
నేను హజాయేలు ఇంటి మీదికి అగ్నిని పంపుతాను, అది బెన్-హదదు కోటలను దగ్ధం చేస్తుంది.
దమస్కు ద్వారాన్ని విరగ్గొడతాను; ఆవెను లోయలో ఉన్న రాజును నాశనం చేస్తాను అతడు బేత్-ఏదెనులో రాజదండం పట్టుకున్నవాడు. అరాము ప్రజలు కీరుకు బందీలుగా వెళ్తారు” అని యెహోవా చెప్తున్నారు.