కంటెంట్‌కు వెళ్లండి

Syria గురించి బైబిల్ వచనాలు: Sent Joab against the armies of, hired by the Ammonites

9 వచనాలు · 61 కోణాలు

"Syria" కోసం వెతకండి

Sent Joab against the armies of, hired by the Ammonites గురించి వచనాలు

  1. దావీదుకు తాము కోపం తెప్పించామని అమ్మోనీయులు గ్రహించి, బేత్-రెహోబు నుండి సోబా నుండి 20,000 మంది అరామీయుల కాల్బలాన్ని, అలాగే మయకా రాజును, అతని నుండి 1,000 మంది సైనికులను, టోబు నుండి 12,000 మంది సైనికులను కిరాయికి తీసుకున్నారు.

  2. ఇది విన్న దావీదు యోవాబును యుద్ధ సైనికులందరితో సహా పంపించాడు.

  3. అమ్మోనీయులు బయటకు వచ్చి తమ పట్టణ ద్వారం దగ్గర యుద్ధ పంక్తులు తీర్చారు. సోబా, రెహోబు నుండి వచ్చిన అరామీయులు, అలాగే టోబు, మయకా నుండి వచ్చినవారు విడివిడిగా పొలాల్లో ఉన్నారు.

  4. యోవాబు తన ముందు వెనుకా యుద్ధ పంక్తులు ఉండడం చూశాడు; ఇశ్రాయేలులో కొందరు అత్యుత్తమ దళాలను ఎంపికచేసి, వారిని అరామీయులకు ఎదురుగా మోహరించాడు.

  5. మిగిలిన వారిని తన సోదరుడైన అబీషై ఆధీనంలో ఉంచి వారిని అమ్మోనీయులకు ఎదురుగా మోహరించాడు.

  6. యోవాబు, “అరామీయులను ఎదుర్కోవడం నాకు కష్టమైనప్పుడు నన్ను రక్షించడానికి నీవు రావాలి. అమ్మోనీయులను ఎదుర్కోవడం నీకు కష్టమైనప్పుడు నిన్ను రక్షించడానికి నేను వస్తాను.

  7. ధైర్యంగా ఉండు. మన ప్రజల కోసం, మన దేవుని పట్టణాల కోసం ధైర్యంగా పోరాడదాం. యెహోవా తన దృష్టికి ఏది మంచిదో అది చేస్తారు” అని అబీషైతో చెప్పాడు.

  8. అప్పుడు యోవాబు అతనితో ఉన్న దళాలు అరామీయులతో యుద్ధం చేయడానికి ముందుకు వెళ్లగా, అతన్ని ఎదుర్కోలేక వారు పారిపోయారు.

  9. అరామీయులు పారిపోయారని గ్రహించిన అమ్మోనీయులు అబీషై ఎదుట నుండి పారిపోయి పట్టణంలోకి వెళ్లారు. అమ్మోనీయులతో పోరాటం మాని యోవాబు యెరూషలేముకు తిరిగి వచ్చాడు.