కంటెంట్‌కు వెళ్లండి

Syria గురించి బైబిల్ వచనాలు: Its history in connection with the Macedonia empire

40 వచనాలు · 61 కోణాలు

Its history in connection with the Macedonia empire గురించి వచనాలు

  1. కొన్ని సంవత్సరాలకు వారిద్దరు మిత్రులవుతారు. అంతేగాక దక్షిణ రాజు కుమార్తె ఉత్తర రాజుతో సంబంధాలు సరిచేయడానికి అతని దగ్గరకు వెళ్తుంది, కాని ఆమె అతని మీద తన ప్రభావాన్ని నిలుపుకోదు, అతడు, అతని అధికారం నిలువదు. ఆ రోజుల్లో ఆమె, ఆమె రాజ అంగరక్షకులు, ఆమె తండ్రి, ఆమెకు సహాయపడినవాడు తృణీకరించబడతారు.

  2. “ఆమె కుటుంబ వంశం నుండి ఆమెకు బదులు ఒకడు లేస్తాడు. అతడు ఉత్తరాది రాజు యొక్క బలగాలపై దాడి చేసి అతని కోటలో చొరబడతాడు; అతడు వారి మీద యుద్ధం చేసి గెలుస్తాడు.

  3. అతడు వారి దేవుళ్ళను, వారి పోతవిగ్రహాలను, వారి విలువైన వెండి బంగారు వస్తువులను పట్టుకుని ఈజిప్టుకు తీసుకెళ్తాడు. కొన్ని సంవత్సరాలు అతడు ఉత్తరాది రాజును ఒంటరిగా వదిలేస్తాడు.

  4. తర్వాత ఉత్తరాది రాజు దక్షిణాది రాజు దేశంలోకి దండెత్తి వస్తాడు కాని, తిరిగి స్వదేశానికి వెళ్లిపోతాడు.

  5. అతని కుమారులు యుద్ధానికి సిద్ధపడి, గొప్ప సైన్యాన్ని సమకూరుస్తారు, అది ఆగలేని వరదలా ముందుకు వస్తూ, అతని కోట వరకు యుద్ధాన్ని తీసుకెళ్తుంది.

  6. “అప్పుడు దక్షిణాది రాజు కోపంతో గొప్ప సైన్యాన్ని పురికొల్పిన ఉత్తరాది రాజు మీదికి దండెత్తి వస్తాడు, వారిని ఓడిస్తాడు.

  7. ఆ సైన్యాన్ని పట్టుకెళ్లిన తర్వాత, దక్షిణాది రాజు గర్వంతో నిండి, వేలమందిని చంపేస్తాడు, అయినా అతని విజయం నిలువదు.

  8. ఎందుకంటే ఉత్తరాది రాజు మరో సైన్యాన్ని సిద్ధం చేస్తాడు, అది ముందున్న దానికంటే గొప్పది; కొన్ని సంవత్సరాల తర్వాత, పూర్తిగా సిద్ధం చేయబడిన మహా సైన్యంతో అతడు తిరిగి వస్తాడు.

  9. “ఆ రోజుల్లో చాలామంది దక్షిణాది రాజు మీదికి లేస్తారు. నీ సొంత ప్రజల్లో హింసాత్మకమైన వారు దర్శనం నెరవేర్పులో భాగంగా తిరగబడతారు, కాని విఫలమవుతారు.

  10. తర్వాత ఉత్తరాది రాజు వచ్చి ముట్టడి దిబ్బలను వేసి, కోటగల పట్టణాన్ని చెరగా పట్టుకుంటాడు. దక్షిణాది బలగాలకు ఎదుర్కొనే శక్తి ఉండదు; వారి యొక్క బలమైన సైన్యానికి కూడా ఎదుర్కొనే బలం ఉండదు.

  11. ఉత్తరాది రాజు తనకు ఇష్టం వచ్చినట్టు చేస్తాడు; అతన్ని ఎదిరించే సామర్థ్యం ఎవరికీ లేదు. అతడు సుందరమైన దేశంలో తనను తాను స్థిరపరచుకుంటాడు, దానిని నాశనం చేసే శక్తి అతనికి ఉంది.

  12. అతడు తన రాజ్యమంతటి బలంతో వచ్చి దక్షిణాది రాజుతో ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అతని రాజ్యాన్ని పడగొట్టడానికి ఒక కుమార్తెను ఇచ్చి పెళ్ళి చేస్తాడు, కాని అతని ప్రణాళికలు విజయవంతం కావు, అవేవి అతనికి సహాయపడవు.

  13. తర్వాత అతడు తన దృష్టి సముద్ర తీరాల మీద పెట్టి చాలా పట్టణాలను జయిస్తాడు, కాని అతడు కలిగించిన అవమానాన్ని ఒక సైన్యాధిపతి తుదముట్టించి ఆ అవమానం అతనికే కలిగిస్తాడు.

  14. దీని తర్వాత, అతడు తన దేశ కోటల వైపు తిరుగుతాడు, కాని మరెన్నడు కనిపించకుండా, తడబడి పడిపోతాడు.

  15. “అతని వారసుడు రాజ వైభవాన్ని నిర్వహించడానికి పన్ను వసూలు చేసేవాన్ని పంపిస్తాడు, అయితే అతడు నాశనమవుతాడు, అయినా ఎవరి కోపం వల్ల లేదా యుద్ధం వల్ల కాదు.

  16. “అతని తర్వాత రాజ్య గౌరవం దక్కని నీచమైన వ్యక్తి అధికారంలోకి వస్తాడు. ప్రజలు సురక్షితంగా ఉన్నామని అనుకున్నప్పుడు, అతడు రాజ్యాన్ని ఆక్రమించుకుంటాడు, కాని కుట్రతో ఆక్రమించుకుంటాడు.

  17. అప్పుడు అతని ఎదుట ఉప్పొంగే సైన్యం కొట్టుకుపోతుంది; అది, దాని నిబంధన అధికారి నాశనమవుతారు.

  18. అతనితో సంధి చేసుకున్న తర్వాత అతడు కపటంగా వ్యవహరిస్తాడు, తనతో ఉన్న కొంతమంది ప్రజలతో మాత్రమే అధికారంలోకి వస్తాడు.

  19. ధనికమైన ప్రాంతాలు సురక్షితంగా ఉన్నామని భావించినప్పుడు, అతడు వాటిని ఆక్రమించి, తన పితరులు, తన పూర్వికులు సంపాదించలేనిది సంపాదిస్తాడు. అతడు దోపుడుసొమ్మును, కొల్లగొట్టిన సొమ్మును, ధనాన్ని తన అనుచరులకు పంచిపెడతాడు. కోటలు పడగొట్టడానికి కుట్ర చేస్తాడు, కాని కొంతకాలం మట్టుకే.

  20. “గొప్ప సైన్యంతో అతడు దక్షిణాది రాజు మీద తన బలాన్ని, ధైర్యాన్ని సమకూరుస్తాడు. దక్షిణాది రాజు చాల శక్తివంతమైన పెద్ద సైన్యం సమకూర్చుకొని యుద్ధం చేస్తాడు, కాని అతనికి విరుద్ధంగా వేసిన కుట్రలను బట్టి అతడు నిలువలేకపోతాడు.

  21. రాజు భోజనం తినేవారు, అతన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తారు; అతని సైన్యం తుడిచివేయబడుతుంది, ఎంతోమంది యుద్ధంలో కూలిపోతారు.

  22. ఆ ఇద్దరు రాజులు కీడును ఉద్దేశిస్తూ, ఒకే బల్ల దగ్గర కూర్చుని ఒకనితో ఒకడు అబద్ధాలు చెప్పుకుంటారు, కాని అది నిష్ప్రయోజనం, ఎందుకంటే అంతం దాని నిర్ణీత కాలంలో వస్తుంది.

  23. ఉత్తరాది రాజు గొప్ప ఐశ్వర్యంతో తన స్వదేశానికి తిరిగి వస్తాడు, అయితే అతని హృదయం పరిశుద్ధ నిబంధనకు విరుద్ధంగా ఉంటుంది. దానికి విరుద్ధంగా కార్యం చేసి, తర్వాత తన స్వదేశానికి వెళ్లిపోతాడు.

  24. “నిర్ణీత కాలంలో అతడు దక్షిణాది ప్రాంతం మీద మళ్ళీ దాడి చేస్తాడు, అయితే ఈసారి మునుపటి ఫలితానికి భిన్నంగా ఉంటుంది.

  25. కిత్తీము అనగా పశ్చిమ తీర ప్రాంతాల ఓడలు అతన్ని వ్యతిరేకిస్తాయి, అతడు ధైర్యం కోల్పోతాడు. అప్పుడు అతడు తన దేశానికి తిరిగివెళ్లి, పరిశుద్ధ నిబంధనకు వ్యతిరేకంగా తన కోపాన్ని చూపిస్తాడు. అతడు తిరిగివెళ్లి పరిశుద్ధ నిబంధనను విడిచిపెట్టినవారి పట్ల దయ చూపిస్తాడు.