Syria గురించి బైబిల్ వచనాలు: Heard the secrets of, from Elisha
Heard the secrets of, from Elisha గురించి వచనాలు
అరాము రాజు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేస్తూ ఉన్నాడు. అతడు తన అధికారులతో చర్చించిన తర్వాత, “నేను ఫలాన స్థలాల్లో నా శిబిరాన్ని ఏర్పాటు చేస్తాను” అన్నాడు.
దైవజనుడు ఇశ్రాయేలు రాజుకు సందేశం పంపి, “ఫలాన స్థలానికి వెళ్లవద్దు, ఎందుకంటే అక్కడ అరామీయులు తమ బలగాలను ఉంచారు” అని తెలియజేశాడు.
కాబట్టి ఇశ్రాయేలు రాజు దైవజనుడు చెప్పిన స్థలానికి మనుషులను పంపి అది నిజమని తెలుసుకున్నాడు. ఎలీషా పదే పదే రాజును హెచ్చరించగా అతడు అలాంటి ప్రదేశాల్లో జాగ్రత్త వహించాడు.
ఇది అరాము రాజుకు కోపం కలిగించింది. అతడు తన అధికారులను పిలిపించి, “నాకు చెప్పండి! ఎవరు మనలో ఇశ్రాయేలు రాజు పక్షాన ఉన్నారు?” అని అడిగాడు.
“మాలో ఎవరు లేరు, నా ప్రభువా, కానీ ఇశ్రాయేలులో ఉన్న ఎలీషా ప్రవక్త మీరు మీ పడకగదిలో మాట్లాడే మాటలను ఇశ్రాయేలు రాజుకు చెప్తాడు” అని అతని అధికారులలో ఒకడు చెప్పాడు.