కంటెంట్‌కు వెళ్లండి

Prayer గురించి బైబిల్ వచనాలు

720 వచనాలు · 120 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఇది చేసింది మీ హస్తమేనని, యెహోవాయే చేశారని వారికి తెలియనివ్వండి.

  2. వారు నన్ను శపించినప్పుడు మీరు నన్ను దీవిస్తారు; వారు నాపై దాడి చేసినప్పుడు వారు అవమానానికి గురవుతారు, కాని మీ సేవకుడు సంతోషించును గాక.

  3. నా మీద నేరం మోపేవారు అవమానాన్ని వస్త్రంగా ధరించుదురు గాక ఒక వస్త్రంలో అయినట్టుగా సిగ్గుతో చుట్టబడతారు.

  4. వారి పిల్లలు భూమిపై బలవంతులుగా ఉంటారు; యథార్థవంతుల తరం దీవించబడుతుంది.

  5. మాకు కాదు, యెహోవా, మాకు కాదు, మీ మారని ప్రేమ, నమ్మకత్వాన్ని బట్టి, మీ నామానికే మహిమ కలగాలి.

  6. “వారి దేవుడు ఎక్కడ?” అని జనులు ఎందుకు అంటున్నారు?

  7. నేను యెహోవాను ప్రేమిస్తాను, ఎందుకంటే ఆయన నా స్వరం విన్నారు; కరుణ కోసం నేను పెట్టిన మొరను ఆయన విన్నారు.

  8. ఆయన తన చెవిని నా వైపు త్రిప్పారు కాబట్టి, నేను ప్రాణంతో ఉన్నంత వరకు ఆయనకు మొరపెడుతుంటాను.

  9. అప్పుడు నేను యెహోవా నామమున మొరపెట్టాను: “యెహోవా, నన్ను రక్షించండి!”

  10. నేను ఇరుకులో ఉండి యెహోవాకు మొరపెట్టాను; ఆయన నాకు జవాబిచ్చి నన్ను విశాల స్థలంలోకి తెచ్చారు.

  11. మీరు నాకు జవాబిచ్చారు, కాబట్టి నేను మీకు కృతజ్ఞతలు చెల్లిస్తాను; మీరు నాకు రక్షణ అయ్యారు.

  12. నా జీవిత పరిస్థితులను మీకు వివరించాను, మీరు నాకు జవాబిచ్చారు; మీ శాసనాలు నాకు బోధించండి.

  13. మీ సేవకునిపట్ల మీ మాటను నెరవేర్చండి, తద్వారా ప్రజలు మిమ్మల్ని ఘనపరుస్తారు.

  14. అప్పుడు నన్ను నిందించే వారెవరికైనా నేను సమాధానం చెప్పగలను, ఎందుకంటే మీ మాట మీద నాకు నమ్మకము.

  15. మీ సత్య వాక్యాన్ని ఎప్పుడూ నా నోటి నుండి తీసివేయకండి, ఎందుకంటే నేను మీ న్యాయవిధులలో నా నిరీక్షణ ఉంచాను.

  16. మీ సేవకునికి మీరిచ్చిన మాట జ్ఞాపకం చేసుకోండి, ఎందుకంటే మీరు నాకు నిరీక్షణ కలిగించారు.

  17. నేను నా హృదయపూర్వకంగా మీ దయ కోసం వెదికాను; మీ వాగ్దానం మేరకు నా మీద దయచూపండి.

  18. మీ హస్తములు నన్ను నిర్మించి నన్ను రూపించాయి; మీ ఆజ్ఞలను నేర్చుకునేలా నాకు గ్రహింపును ఇవ్వండి.

  19. కారణం లేకుండా నాకు అన్యాయం చేసినందుకు అహంకారులు అవమానపరచబడుదురు గాక; కాని నేను మీ కట్టడలను ధ్యానిస్తాను.

  20. మీ సేవకుడు ఎన్నాళ్ళు బ్రతుకుతాడు? నన్ను హింసించేవారిని మీరు ఎప్పుడు శిక్షిస్తారు?

  21. నేను మీ వాడను, నన్ను రక్షించండి; నేను మీ కట్టడలను వెదికాను.

  22. మీ వాగ్దానం ప్రకారం నన్నాదుకోండి, నేను బ్రతుకుతాను; నా నిరీక్షణను బద్దలు కానివ్వకండి.

  23. మీ మారని ప్రేమకు తగినట్టుగా మీ సేవకునితో వ్యవహరించండి అలాగే మీ శాసనాలు నాకు బోధించండి.

  24. యెహోవా, నా హృదయమంతటితో నేను మొరపెడుతున్నాను; నాకు జవాబివ్వండి, నేను మీ శాసనాలకు లోబడతాను.

  25. నేను మీకు మొరపెడతాను; నన్ను రక్షించండి నేను మీ శాసనాలను పాటిస్తాను.