కంటెంట్‌కు వెళ్లండి

Prayer గురించి బైబిల్ వచనాలు

720 వచనాలు · 120 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఎందుకంటే ఆయన ఇత్తడి ద్వారాలను పగలగొడతారు ఇనుప గడియలను విరగ్గొడతారు.

  2. కొందరు తమ తిరుగుబాటు మార్గాల ద్వారా మూర్ఖులయ్యారు వారి దోషాల వల్ల బాధలు అనుభవించారు.

  3. వారు ఆహారాన్ని అసహ్యించుకున్నారు మరణ ద్వారాల దగ్గరకు వచ్చారు.

  4. అప్పుడు వారు తమ ఆపదలో యెహోవాకు మొరపెట్టారు, ఆయన వారిని వారి బాధ నుండి రక్షించారు.

  5. తన వాక్కును పంపి దేవుడు వారిని స్వస్థపరిచాడు.

  6. మీరు ప్రేమించేవారు విడిపించబడేలా, మీ కుడిచేతితో మమ్మల్ని రక్షించి మాకు సాయం చేయండి.

  7. తీర్పు సమయంలో అతడు దోషిగా వెల్లడి కావాలి, అప్పుడు అతని ప్రార్థనలు పాపంగా లెక్కించబడతాయి.

  8. అతని పిల్లలు తండ్రిలేనివారు కావాలి, అతని భార్య విధవరాలు అవ్వాలి.

  9. అతని పిల్లలు బిక్షకులై తిరుగుదురు గాక, వారు పాడుబడిన నివాసాల తోలివేయబడుదురు గాక.

  10. అప్పిచ్చేవాడు అతని దగ్గర ఉన్నవన్నీ స్వాధీనం చేసుకోవాలి; అపరిచితులు అతని కష్టార్జితాన్ని దోచుకోవాలి.

  11. అతని మీద ఎవరు దయ చూపకూడదు, తన తండ్రిలేని పిల్లలపై ఎవరికీ కనికరం చూపకూడదు.

  12. అతని వంశం అంతరించాలి, వచ్చేతరం నుండి వారి పేర్లు తుడిచివేయబడాలి.

  13. అతని పూర్వికుల దోషాలు యెహోవా మరువకూడదు, అతని తల్లి పాపాన్ని దేవుడు ఎన్నటికి తుడిచివేయకూడదు.

  14. వారి పాపాలన్నీ ఎప్పుడూ యెహోవా ఎదుట ఉండాలి, తద్వార భూమి మీద నుండి అతని పిల్లల జ్ఞాపకాన్ని ఆయన తుడిచివేస్తారు.

  15. దయ చూపించాలని అతడు ఎప్పుడూ అనుకోలేదు; కాని అతడు నలిగినవారిని పేదవారిని వేధించాడు ధైర్యము కోల్పోయిన వారిని హతమార్చాడు.

  16. శపించటం అతనికి ఇష్టం కాబట్టి అది అతని మీదికే వచ్చింది. అతడు ఎవరినీ ఆశీర్వదించాలని కోరలేదు కాబట్టి అతడు ఆశీర్వాదాన్ని అనుభవించలేదు.

  17. అతడు శాపాన్ని వస్త్రంగా ధరించాడు; అది నీరులా అతని కడుపులోకి, నూనెలా అతని ఎముకల్లోకి చొచ్చుకు పోయింది.

  18. అది అతని చుట్టూ చుట్టబడిన వస్త్రంలా, అది నడుము దట్టిలా నిత్యం అతని చుట్టూ ఉండును గాక.

  19. నా మీద నేరం మోపేవారికి నా గురించి చెడుగా మాట్లాడేవారికి, యెహోవా వారికి జీతం చెల్లించును గాక.

  20. అయితే, ప్రభువైన యెహోవా, మీ నామ ఘనత కోసం నాకు సహాయం చేయండి; శ్రేష్ఠమైన మీ మారని ప్రేమను బట్టి, నన్ను విడుదలచేయండి.

  21. ఎందుకంటే నేను దీనుడను అవసరతలో ఉన్నవాడను, నా హృదయం నాలో గాయపడి ఉంది.

  22. నేను సాయంత్రం నీడలా మసకబారుతున్నాను; మిడతలా నేను దులిపివేయబడ్డాను.

  23. ఉపవాసాలు ఉండి నా మోకాళ్లు వణికిపోతున్నాయి; నేను అస్థిపంజరంలా అయ్యాను.

  24. నా మీద నేరం మోపేవారికి నేను ఎగతాళి హాస్యాస్పదం అయ్యాను; వారు నన్ను చూసినప్పుడు, వారు వెటకారంగా వారి తలలాడిస్తారు.

  25. యెహోవా, నా దేవా! నాకు సాయం చేయండి; మీ మారని ప్రేమను బట్టి నన్ను కాపాడండి.