Skip to content

Oppression గురించి బైబిల్ వచనాలు

86 వచనాలు · 8 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. తండ్రిలేనివారిని అణచివేయబడిన వారిని మీరు రక్షిస్తారు, అప్పుడు మానవులెవ్వరు ఎన్నడు భయాన్ని కలిగించరు.

  2. “దీనులు దోపిడికి గురవుతున్నారు, అవసరంలో ఉన్నవారు మూల్గుతున్నారు కనుక, నేను ఇప్పుడే లేచి దుర్భాషలాడే వారి నుండి నేను వారిని రక్షిస్తాను” అని యెహోవా అంటున్నారు.

  3. From the wicked that oppress me, from my deadly enemies, who compass me about.

  4. మీ ముఖాన్ని మా నుండి ఎందుకు దాచుకుంటున్నారు? నా బాధను నా హింసను మరచిపోయారా?

  5. బలాత్కారాన్ని నమ్ముకోకండి దోపిడీలు చేసి ధనవంతులై విర్రవీగకండి. ధనం ఎక్కువైనా సరే, దాని మీద మనస్సు పెట్టకండి.

  6. ప్రజల్లో బాధపడుతున్నవారిని ఆయన రక్షించును గాక అవసరతలో ఉన్న వారి పిల్లలను రక్షించును గాక; బాధించేవారిని త్రొక్కివేయును గాక.

  7. ఆయన వారిని అణచివేత నుండి హింస నుండి విడిపిస్తారు, ఎందుకంటే ఆయన దృష్టిలో వారి రక్తం విలువైనది.

  8. నలిగినవారిని మరల అపకీర్తి పాలు కానివ్వకండి. బీదలు అవసరతలో ఉన్న ఈ ప్రజలు మీ నామం స్తుతించుదురు గాక.

  9. అణగారిన వారికందరికి యెహోవా నీతిని న్యాయాన్ని జరిగిస్తారు.

  10. నేను నీతియుక్తమైనది న్యాయమైనది చేశాను; నన్ను బాధించేవారికి నన్ను వదిలేయకండి.

  11. నేను మీ కట్టడలకు లోబడేలా, మనుష్యుల దౌర్జన్యం నుండి విడిపించండి.

  12. హింసాత్మకమైనవారిని అసూయ పడకు, వారి మార్గాల్లో వేటిని నీవు ఎంచుకోవద్దు.

  13. పేదవాని బాధపెట్టేవారు వాని సృష్టికర్తను నిందించేవారు, బీదలను కనికరించేవారు ఆయనను ఘనపరిచేవారు.

  14. లాభము పొందాలని పేదవారికి అన్యాయం చేసేవారికి ధనవంతులకు బహుమానాలు ఇచ్చేవానికి నష్టమే కలుగుతుంది.

  15. పేదవారు కదా అని పేదవారిని పీడించవద్దు అవసరతలో ఉన్నవారిని ఆవరణంలో అణచివేయవద్దు,

  16. పేదలను హింసించే ఒక పేదవాడు పంటను తుడిచిపెట్టుకుపోయే వర్షం లాంటివాడు.

  17. భూమి మీద ఉండకుండా వారు పేదవారిని మ్రింగుదురు మనుష్యుల్లో బీదలు లేకుండా నశింపజేయుదురు కత్తి వంటి పళ్ళును, కత్తుల వంటి దవడ పళ్ళును గలవారి తరము కలదు.

  18. సూర్యుని క్రింద జరుగుతున్న అణచివేతనంతటిని నేను చూశాను: సూర్యుని క్రింద అణగారిన వారి కన్నీటిని నేను చూశాను, కాబట్టి వారిని ఆదరించేవారెవరూ లేరు; బాధపెట్టేవారు బలవంతులు, వారిని ఆదరించేవారెవరూ లేరు.

  19. ఒక ప్రాంతంలో పేదలను అణచివేయడం, న్యాయాన్ని హక్కులను పాటించకపోవడం లాంటివి నీవు చూస్తే ఆశ్చర్యపడవద్దు; ఎందుకంటే ఒక అధికారి మీద పైఅధికారులు ఉంటారు, వారందరిపైన ఉన్నతాధికారులు ఉంటారు.

  20. అన్యాయం జ్ఞానంగల వానిని మూర్ఖునిగా మారుస్తుంది, లంచం హృదయాన్ని పాడుచేస్తుంది.

  21. సరియైనది చేయడం నేర్చుకోండి; న్యాయాన్ని వెదకండి. అణచివేయబడుతున్న వారి పక్షాన ఉండండి. తండ్రిలేనివారికి న్యాయం తీర్చండి. విధవరాలి పక్షాన వాదించండి.

  22. చోటు మిగులకుండ మీరు మాత్రమే దేశంలో నివసించేలా ఇంటికి ఇల్లు, పొలానికి పొలం కలుపుకునేవారికి శ్రమ.

  23. నీతిగా నడుచుకుంటూ నిజాయితీగా మాట్లాడేవారు, అవినీతి వలన వచ్చే లాభాన్ని విడిచిపెట్టి తమ చేతులతో లంచం తీసుకోకుండ, హత్య చేయాలనే కుట్రలు వినబడకుండ చెవులు మూసుకుని చెడుతనం చూడకుండ కళ్లు మూసుకునేవారు,

  24. వారు ఉన్నత స్థలాల్లో నివసిస్తారు, పర్వతాల కోటలు వారికి ఆశ్రయంగా ఉంటాయి. వారికి ఆహారం దొరుకుతుంది, వారికి నీళ్లు శాశ్వతంగా ఉంటాయి.

  25. కొంగలా చిన్న పిట్టలా నేను కిచకిచ అరిచాను, దుఃఖపడే పావురంలా మూలిగాను ఆకాశాల వైపు చూసి నా కళ్లు అలసిపోయాయి. నేను బెదిరిపోయాను; ప్రభువా, నాకు సహాయం చేయండి.”