Skip to content

Oppression గురించి బైబిల్ వచనాలు

86 వచనాలు · 8 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఇశ్రాయేలీయుల మొర నాకు చేరింది, ఈజిప్టువారు వారినెలా అణచివేస్తున్నారో నేను చూశాను.

  2. “మీరు ఈజిప్టు దేశంలో విదేశీయులుగా ఉన్నారు; కాబట్టి విదేశీయులను బాధించకూడదు, అణగద్రొక్కకూడదు.

  3. “విధవరాలిని గాని తండ్రిలేనివారిని గాని బాధపెట్టకూడదు.

  4. మీరు వారిని వేధించడం వలన వారు నాకు మొరపెడితే, నేను ఖచ్చితంగా వారి మొర వింటాను.

  5. నా కోపం రగులుకొని నేను మిమ్మల్ని కత్తితో చంపుతాను; అప్పుడు మీ భార్యలు విధవరాళ్లు అవుతారు మీ పిల్లలు తండ్రిలేనివారవుతారు.

  6. బానిసలు మిమ్మల్ని ఆశ్రయిస్తే, వారిని వారి యజమానికి అప్పగించవద్దు.

  7. వారిని మీ మధ్య వారికి ఇష్టమైనట్లు, వారు ఎంచుకున్న పట్టణంలో నివసింపనివ్వండి. వారిని అణచివేయవద్దు.

  8. మీ తోటి ఇశ్రాయేలీయులలో గాని మీ పట్టణాల్లో నివసిస్తున్న విదేశీయులలో గాని పేదవారై అవసరంలో ఉన్న కూలివారిని బాధించవద్దు.

  9. ప్రతిరోజు సూర్యాస్తమయానికి ముందు వారి వేతనాలు చెల్లించండి, ఎందుకంటే వారు పేదవారు దానిని లెక్కిస్తున్నారు. లేకపోతే వారు మీకు వ్యతిరేకంగా యెహోవాకు మొర పెట్టవచ్చు, అప్పుడు మీరు దోషులుగా పరిగణించబడతారు.

  10. మనం మన పూర్వికుల దేవుడైన యెహోవాకు మొరపెట్టుకున్నాము. యెహోవా మన మొర విని, మన బాధ, ప్రయాస, మనకు కలిగిన హింసను చూశారు.

  11. యెహోవా ఇశ్రాయేలుపై కోపం వచ్చి, వారిని దోచుకునేవారి చేతికి అప్పగించారు. ఆయన వారి చుట్టూ ఉన్న శత్రువుల చేతికి వారిని అమ్మివేశారు, వారు ఆ శత్రువుల ఎదుట నిలువలేకపోయారు.

  12. అతడు యువకులు ఇచ్చిన సలహా ప్రకారం, “నా తండ్రి మీ కాడిని బరువుగా చేశాడు; నేను మరి ఎక్కువ బరువుగా చేస్తాను. నా తండ్రి కొరడాలతో శిక్షించాడు; నేను తేళ్లతో శిక్షిస్తాను” అని అన్నాడు.

  13. “దుష్టులైన మనుష్యులకు దేవుడు ఇచ్చే భాగం; సర్వశక్తుని నుండి వారు పొందే వారసత్వం:

  14. వారికి ఎంతమంది పిల్లలున్నా, ఖడ్గం వారి గతి; వారి సంతతికి కడుపునిండా తిండి దొరకదు.

  15. వారికి మిగిలిన వారు తెగులుచేత పాతిపెట్టబడతారు, వారి విధవరాండ్రు వారి కోసం రోదించరు.

  16. దుమ్ము పోగుచేసినట్లు వెండిని పోగుచేసినా మట్టివలె బట్టలను కుప్పగా వేసినా

  17. వారు పోగుచేసిన వాటిని నీతిమంతులు ధరిస్తారు, నిర్దోషులు వారి వెండిని పంచుకుంటారు.

  18. వారు కట్టుకునే ఇల్లు పురుగుల గూడులా, కావలివారు వేసుకునే గుడిసెలా ఉంటాయి.

  19. వారు ధనవంతులుగా పడుకుంటారు, కాని వారు మేల్కొన్నప్పుడు వారి సంపద అంతా పోయిందని వారు కనుగొంటారు.

  20. భీభత్సం వారిని వరదలా ముంచెత్తుతుంది; తుఫాను రాత్రివేళ వారిని లాక్కుని పోతుంది.

  21. తూర్పు గాలి వారిని తీసుకెళ్తే, వారిక ఉండరు; అది వారి స్థలం నుండి వారిని తుడిచివేస్తుంది.

  22. వారు దాని శక్తి నుండి తలక్రిందులుగా పారిపోతున్నప్పుడు అది దయ లేకుండా వారికి వ్యతిరేకంగా తిరుగుతుంది.

  23. అది ఎగతాళి చేస్తూ చప్పట్లు కొడుతుంది వారి స్థలం నుండి వారిని ఊదివేస్తుంది.”

  24. అణచివేయబడిన వారికి యెహోవా ఆశ్రయం, కష్ట సమయాల్లో బలమైన కోట.

  25. యెహోవా, మీరు బాధపడేవారి కోరిక విన్నారు; మీరు వారి ప్రార్థనను ఆలకించి వారిని ప్రోత్సహిస్తారు.