Skip to content

Man గురించి బైబిల్ వచనాలు

106 వచనాలు · 114 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఆదాము వంశావళి యొక్క జాబితా ఇదే. దేవుడు మనుష్యజాతిని సృష్టించినప్పుడు వారిని దేవుని పోలికలో చేశారు.

  2. ఆయన వారిని పురుషునిగాను స్త్రీగాను సృజించారు. ఆయన వారిని ఆశీర్వదించి వారికి “మనుష్యజాతి” అని పేరు పెట్టారు.

  3. భూలోకంలో ఉన్న అన్ని రకాల జంతువులు, ఆకాశంలోని అన్ని రకాల పక్షులు, నేల మీద తిరిగే ప్రతీ జీవి, సముద్రంలో ఉన్న అన్ని చేపలు మీకు భయపడతాయి భీతి చెందుతాయి; అవి మీ చేతికి అప్పగించబడ్డాయి.

  4. జీవిస్తూ తిరిగే ప్రతిదీ మీకు ఆహారం అవుతుంది. పచ్చని మొక్కలను నేను మీకు ఇచ్చినట్టుగా ఇప్పుడు అన్నిటిని మీకు ఇస్తున్నాను.

  5. దేవుడు తన సేవకులనే నమ్మనప్పుడు, తన దూతల్లోనే లోపాలను కనుగొన్నప్పుడు,

  6. మట్టి ఇళ్ళలో నివసిస్తూ, దుమ్ములో పునాదులు గలవారిని, చిమ్మెట కన్నా సులువుగా చితికిపోయేవారిని ఇంకెలా చూస్తారో!

  7. ఉదయం నుండి సాయంకాలం వరకు ఉన్నవారు ముక్కలుగా చేయబడి, గుర్తింపు పొందకుండానే శాశ్వతంగా నాశనమవుతారు.

  8. వారి డేరా తాడు తెంపివేయబడుతుంది, జ్ఞానం లేకుండానే వారు చనిపోతారు.’

  9. నేను దేవునితో ఇలా అంటాను: నన్ను దోషిగా భావించకండి, కాని నా మీద మీకున్న ఆరోపణలు నాకు చెప్పండి.

  10. నన్ను హింసించడం, మీ చేతిపనిని త్రోసివేయడం, దుర్మార్గుల ప్రణాళికలను చూసి సంతోషించడం మీకు ఇష్టమా?

  11. “మీ చేతులు నన్ను రూపొందించి తయారుచేశాయి. ఇప్పుడు మీరు నన్ను తిరిగి నాశనం చేస్తారా?

  12. బంకమట్టిలా నన్ను రూపొందించారని జ్ఞాపకం చేసుకోండి, ఇప్పుడు నన్ను తిరిగి మట్టిలా మారుస్తారా?

  13. పాలు పోసినట్లు మీరు నన్ను పోయలేదా, జున్నుగడ్డ పేరబెట్టినట్లు నన్ను చేయలేదా,

  14. చర్మంతో మాంసంతో నన్ను కప్పి ఎముకలు నరాలతో కలిపి అల్లలేదా?

  15. “ఒక మనిషి దేవునికేమైనా ప్రయోజనం చేయగలడా? ఒక జ్ఞానియైన వ్యక్తైనా సరే ఆయనకు ప్రయోజనం చేయగలడా?

  16. నీవు నీతిమంతుడవైతే సర్వశక్తిమంతునికి కలిగే ఆనందమేమిటి? నీ మార్గాలు నిందలేనివైతే ఆయనకు వచ్చే లాభం ఏమిటి?

  17. “నీకున్న భయభక్తులను బట్టి ఆయన నిన్ను గద్దిస్తారా? దేవుడు నిన్ను తీర్పులోకి తెస్తారా?

  18. నీ దుష్టత్వం గొప్పది కాదా? నీ పాపాలు అంతులేనివి కావా?

  19. అలాంటప్పుడు దేవుని ఎదుట ఎలా నీతిమంతుడు కాగలడు? అలాంటప్పుడు స్త్రీకి పుట్టిన ఒకడు ఎలా పవిత్రుడు కాగలడు?

  20. ఒకవేళ దేవుని దృష్టిలో చంద్రుడు కాంతివంతుడు కానప్పుడు; నక్షత్రాలు పవిత్రమైనవి కానప్పుడు.

  21. పురుగువంటి మనుష్యుడు క్రిమివంటి మనుష్యుడు ఆయన దృష్టిలో పవిత్రుడు కాలేడు కదా!”

  22. “ఇది న్యాయమని నీవనుకుంటున్నావా? ‘నా నీతి దేవుని నీతి కన్నా గొప్పది.’

  23. అయితే, నా పాపం వలన నాకు లాభమేంటి? ‘పాపం చేయకపోవడం వలన నేను పొందేదేంటి?’ అని నీవు అడుగుతున్నావు.

  24. “నేను నీ స్నేహితులకు నీకు జవాబు చెప్పాలనుకుంటున్నాను.

  25. ఆకాశం వైపు తేరి చూడండి; మీకన్నా ఎంతో ఎత్తుగా ఉన్న మేఘాల వైపు చూడండి.