కంటెంట్‌కు వెళ్లండి

Idolatry గురించి బైబిల్ వచనాలు

447 వచనాలు · 205 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. వారు తమ రాజ్య పరిపాలనలోను మీరు వారికిచ్చిన విశాలమైన సారవంతమైన దేశంలో మీరు వారిపట్ల చేసిన గొప్ప మేలులు అనుభవిస్తూ కూడా వారు మిమ్మల్ని సేవించలేదు, తమ దుష్టత్వాన్ని విడిచి మీ వైపు తిరగలేదు.

  2. “ఇదిగో ఈ రోజు మేము బానిసలుగా ఉన్నాము, దాని ఫలాలను తిని దానిలో ఉన్న మంచి వాటన్నిటిని అనుభవించమని మా పూర్వికులకు మీరిచ్చిన దేశంలో మేము బానిసలుగా ఉన్నాము.

  3. మా పాపాల కారణంగా దాని అపారమైన పంటంతా మీరు మామీద నియమించిన రాజులు అనుభవిస్తున్నారు. తమకు ఇష్టం వచ్చినట్లు మా శరీరాల మీద మా పశువులమీద అధికారం చెలాయిస్తున్నారు. మేము చాలా శ్రమ అనుభవిస్తున్నాము.

  4. వారి క్షేత్రాలతో దేవునికి కోపం తెప్పించారు; వారు విగ్రహాలను పెట్టుకుని ఆయనకు రోషం పుట్టించారు.

  5. దేవుడు వారి కేకలు విన్నప్పుడు, ఆయన ఆగ్రహించారు; ఆయన ఇశ్రాయేలును పూర్తిగా త్రోసివేశారు.

  6. షిలోహు ప్రత్యక్ష గుడారాన్ని, మనుష్యుల మధ్య ఆయన వేసుకున్న గుడారాన్ని విడిచిపెట్టారు.

  7. ఆయన తన బలానికి సూచనగా ఉన్న మందసాన్ని బందీఖానాకు, తన వైభవాన్ని శత్రువుల చేతికి అప్పగించారు.

  8. ఆయన తన ప్రజలను ఖడ్గానికి అప్పగించారు; ఆయన తన వారసత్వం మీద ఆగ్రహించారు.

  9. అగ్ని వారి యువకులను దహించివేసింది, వారి యువతులకు పెళ్ళి పాటలు లేవు;

  10. వారి యాజకులు ఖడ్గానికి అప్పగించబడ్డారు వారి విధవరాండ్రు ఏడవలేకపోయారు.

  11. యెహోవా నాశనం చేస్తానన్న జాతులను వీరు విడిచిపెట్టారు.

  12. ఇతర జనాంగాలలో కలిసిపోయి, వారి జీవిత విధానాలు నేర్చుకున్నారు.

  13. వారి విగ్రహాలను పూజించారు. అవే వారికి ఉరి అయ్యాయి.

  14. తమ కుమారులను, కుమార్తెలను దయ్యానికి బలి ఇచ్చారు.

  15. నిరపరాధుల రక్తం, తమ కుమారుల రక్తం, కుమార్తెల రక్తం వారు చిందించారు. కనాను దేశపు విగ్రహాలకు తమ సొంత పిల్లల్ని బలి ఇచ్చారు. ఈ రక్తపాతం చేత దేశమంతా అపవిత్రమైనది.

  16. వారు తమ దుష్ట క్రియల చేత అపవిత్రులయ్యారు; విగ్రహాల మీద వారికి గల ప్రేమ యెహోవా దృష్టిలో వ్యభిచారము చేశారు.

  17. యెహోవా కోపం వారి మీదికి వచ్చింది, తన వారసత్వం తన ప్రజలు అయినా వారంటే ఆయనకు అసహ్యం వేసింది.

  18. ఇతర దేశాలకు వారిని అప్పగించాడు. అయినా వారి మీద ప్రభుత్వం చేశారు.

  19. శత్రువులే వారిని అణగద్రొక్కారు వారి చేతి క్రింద తల వొగ్గారు.

  20. అయితే వారి విగ్రహాలు వెండి బంగారాలు, అవి మనుష్యుల చేతిపనులు.

  21. వాటికి నోళ్ళున్నాయి, కాని మాట్లాడలేవు, కళ్లున్నాయి, కాని చూడలేవు.

  22. వాటికి చెవులున్నాయి, కాని వినలేవు, ముక్కులున్నాయి, కాని వాసన చూడలేవు.

  23. వారికి చేతులు ఉన్నాయి, కానీ అనుభూతి చెందవు, పాదాలున్నాయి, కాని నడవలేవు, కనీసం వాటి గొంతులతో శబ్దం చేయలేవు.

  24. వాటిని తయారుచేసేవారు, వాటిని నమ్మేవారు వాటి లాగే ఉంటారు.

  25. దేశాల విగ్రహాలు వెండి బంగారాలు, అవి మనుష్యుల చేతిపనులు.