Idolatry గురించి బైబిల్ వచనాలు: Judicial death
Judicial death గురించి వచనాలు
ఒకవేళ మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చే పట్టణాల్లో దేనిలోనైనా మీ మధ్య నివసిస్తున్న పురుషుడు గాని స్త్రీ గాని మీ దేవుడైన యెహోవా నిబంధన మీరి ఆయన దృష్టిలో చెడును చేస్తూ,
నా ఆజ్ఞకు వ్యతిరేకంగా ఇతర దేవుళ్ళను సేవించి, వాటికి గాని ఆకాశంలో ఉండే సూర్యచంద్ర నక్షత్రాలకు గాని నమస్కరిస్తూ ఉంటే,
ఆ విషయం మీ దృష్టికి తీసుకురాబడితే, మీరు దానిని క్షుణ్ణంగా పరిశోధించాలి. ఒకవేళ అది నిజమై, ఆ అసహ్యకరమైన విషయం ఇశ్రాయేలులో జరిగిందని నిరూపించబడితే,
ఆ దుర్మార్గం చేసిన పురుషుని గాని స్త్రీని గాని మీ పట్టణ ద్వారం దగ్గరకు తీసుకెళ్లి వారిని రాళ్లతో కొట్టి చంపాలి.