Idolatry గురించి బైబిల్ వచనాలు: Often mixed up, with God's worship
Often mixed up, with God's worship గురించి వచనాలు
మోషే పర్వతం దిగిరావడానికి ఆలస్యం చేయడం చూసిన ప్రజలు అహరోను చుట్టూ గుమికూడి, అతనితో, “ఈజిప్టులో నుండి మమ్మల్ని బయటకు తీసుకువచ్చిన ఈ మోషే అనే వానికి ఏమి జరిగిందో మాకు తెలియదు కాబట్టి నీవు వచ్చి మాకు ముందు నడవడానికి మాకు దేవుళ్ళను తయారుచేయి” అని అన్నారు.
అందుకు అహరోను, “అయితే మీ భార్యలు మీ కుమారులు మీ కుమార్తెలు ధరించిన బంగారు చెవికమ్మలు తీసి నా దగ్గరకు తీసుకురండి” అని చెప్పాడు.
కాబట్టి ప్రజలందరు తమ చెవికమ్మలు తీసి అహరోను దగ్గరకు తెచ్చారు.
అతడు వారు తనకు ఇచ్చిన వాటిని తీసుకుని ఒక సాధనంతో దూడ రూపంలో పోతపోసి ఒక విగ్రహం తయారుచేశాడు. అప్పుడు వారు, “ఓ ఇశ్రాయేలూ, ఈజిప్టులో నుండి మిమ్మల్ని బయటకు రప్పించిన మీ దేవుళ్ళు వీరే” అని అన్నారు.
అహరోను ఇది చూసి ఆ దూడ ఎదుట ఒక బలిపీఠం కట్టించి, “రేపు యెహోవాకు పండుగ జరుగుతుంది” అని ప్రకటించాడు.