కంటెంట్‌కు వెళ్లండి

Idolatry గురించి బైబిల్ వచనాలు: Dreadful judgments which end in death

11 వచనాలు · 205 కోణాలు

Dreadful judgments which end in death గురించి వచనాలు

  1. అప్పుడు యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది:

  2. “ఈ స్థలంలో నీవు పెళ్ళి చేసుకుని కుమారులు, కూతుళ్లు కనకూడదు.”

  3. ఈ దేశంలో పుట్టిన కుమారులు కుమార్తెల గురించి వారి తల్లుల గురించి వారి తండ్రుల గురించి యెహోవా ఇలా అంటున్నారు:

  4. “వారు ప్రాణాంతకమైన వ్యాధులతో చనిపోతారు. వారి కోసం ఎవరు దుఃఖించరు, వారిని పాతిపెట్టరు, వారి శవాలు నేలమీద పడి ఉన్న పెంటలా ఉంటాయి. వారు ఖడ్గంతో, కరువుతో నశిస్తారు, వారి శవాలు పక్షులకు అడవి జంతువులకు ఆహారంగా ఉంటాయి.”

  5. యెహోవా ఇలా అంటున్నారు: “చనిపోయిన దుఃఖంతో ఉన్న ఇంటికి వెళ్లవద్దు; దుఃఖించడానికీ, సానుభూతి చూపడానికి వెళ్లవద్దు, ఎందుకంటే నేను ఈ ప్రజల నుండి నా సమాధానాన్ని, నా ప్రేమను, నా జాలి వదిలేశాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

  6. “ఈ దేశంలో గొప్పవారు చిన్నవారు అందరు చనిపోతారు. వారు పాతిపెట్టబడరు, వారి కోసం ఎవరు దుఃఖించరు, చనిపోయినవారి కోసం ఎవరూ తమను తాము కోసుకోరు, తల క్షౌరం చేయించుకోరు.

  7. చనిపోయినవారి కోసం దుఃఖించేవారిని ఓదార్చడానికి ఎవరూ ఆహారం ఇవ్వరు కనీసం తండ్రి తల్లి చనిపోయినా సరే వారిని ఓదార్చేలా త్రాగడానికి ఏమీ ఇవ్వరు.

  8. “విందు జరుగుతున్న ఇంట్లోకి వెళ్లి తినడానికి, త్రాగడానికి కూర్చోవద్దు.

  9. ఎందుకంటే ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: మీ కళ్లముందు, మీ రోజుల్లో నేను ఈ స్థలంలో ఆనంద, సంతోష ధ్వనులను, వధూవరుల స్వరాలను అంతం చేస్తాను.

  10. “నీవు ఈ సంగతులను ఈ ప్రజలకు చెప్పినప్పుడు, ‘యెహోవా మనపై ఇంత పెద్ద విపత్తును ఎందుకు విధించారు? మేము చేసిన తప్పేంటి? మన దేవుడైన యెహోవాకు విరోధంగా మనం ఏమి పాపం చేశాం?’

  11. అప్పుడు వారితో ఇలా చెప్పు, ‘మీ పూర్వికులు నన్ను విడిచిపెట్టి, ఇతర దేవుళ్ళను అనుసరించి, వారిని సేవిస్తూ, ఆరాధించారు. వారు నన్ను విడిచిపెట్టారు నా ధర్మశాస్త్రాన్ని పాటించలేదని యెహోవా ప్రకటిస్తున్నారు.