Skip to content

God గురించి బైబిల్ వచనాలు

662 వచనాలు · 46 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఆకాశం భూమి గతించిపోతాయి గాని నా మాటలు ఏమాత్రం గతించవు.

  2. కాని ఒకవేళ ఆ సేవకుడు చెడ్డవాడైతే, ‘నా యజమాని తిరిగి రావడం ఆలస్యం చేస్తున్నాడు’ అని తన మనస్సులో అనుకుని,

  3. తన తోటి సేవకులను కొట్టడం మొదలుపెట్టి త్రాగుబోతులతో కలిసి తిని త్రాగుతూ ఉంటాడు.

  4. అతడు ఊహించని రోజున ఊహించని సమయంలో ఆ సేవకుని యజమాని వస్తాడు.

  5. అతడు వాన్ని ముక్కలుగా నరికి వేషధారులతో అతనికి చోటు ఇస్తాడు, అక్కడ ఏడ్వడం పండ్లు కొరకడం ఉంటాయి.

  6. ఆయన అబ్రాహాముకు అతని సంతతివారికి నిత్యం దయ కలిగి ఉండాలని జ్ఞాపకం చేసుకొంటూ, మన పితరులకు వాగ్దానం చేసినట్లు, తన సేవకుడైన ఇశ్రాయేలుకు సహాయం చేశారు.”

  7. As he spake to our fathers, to Abraham, and to his seed for ever.

  8. “ఇశ్రాయేలు దేవుడైన ప్రభువు స్తుతింపబడును గాక, ఎందుకంటే ఆయన తన ప్రజలను దర్శించి వారిని విమోచించారు.

  9. దేవుడు ముందుగానే తన పవిత్ర ప్రవక్తల ద్వారా పలికించినట్లు, తన సేవకుడైన దావీదు వంశంలో మన కోసం రక్షణ కొమ్మును మొలిపించారు.

  10. As he spake by the mouth of his holy prophets, which have been since the world began:

  11. మన పితరులకు దయ చూపడానికి తన పరిశుద్ధ నిబంధనను జ్ఞాపకం చేసుకోవడానికి:

  12. మన తండ్రియైన అబ్రాహాముకు ప్రమాణం చేసినట్లుగా,

  13. తర్వాత ఆయన ఈ ఉపమానం చెప్పారు: “ఒక మనుష్యుడు తన ద్రాక్షతోటలో ఒక అంజూర చెట్టును పెంచుతున్నాడు, అతడు వెళ్లి పండ్ల కోసం ఆ చెట్టును చూశాడు కాని ఏమి దొరకలేదు.

  14. కాబట్టి అతడు తోటమాలితో, ‘ఇదిగో మూడేళ్ళ నుండి నేను ఈ అంజూర చెట్టు పండ్ల కోసం వచ్చి చూస్తున్నాను గాని ఇంతవరకు ఏమి దొరకలేదు. దీనిని నరికివేయి! దీని వల్ల భూసారం ఎందుకు వృధా అవ్వాలి?’ అని అన్నాడు.

  15. “అయితే ఆ తోటమాలి, ‘అయ్యా, ఇంకొక సంవత్సరం దానిని ఉండనివ్వండి, నేను దాని చుట్టూ త్రవ్వి, ఎరువు వేసి చూస్తాను.

  16. ఒకవేళ అది పండ్లు ఇస్తే సరి, లేకపోతే నరికించండి’ అన్నాడు.”

  17. “మీలో ఎవనికైనా వంద గొర్రెలు ఉండి, వాటిలో ఒకటి తప్పిపోతే అతడు తొంభై తొమ్మిది గొర్రెలను అరణ్యంలో వదిలేసి, తప్పిపోయిన ఆ ఒక్క గొర్రె దొరికే వరకు వెదకడా?

  18. అది దొరికినప్పుడు అతడు సంతోషంతో దానిని తన భుజం మీద వేసుకుని,

  19. ఇంటికి వెళ్లి, తన స్నేహితులను తన పొరుగువారిని పిలిచి, ‘నేను పోగొట్టుకున్న నా గొర్రె దొరికింది, రండి నాతో కలిసి సంతోషించండి’ అని అంటాడు.

  20. అదే విధంగా, పశ్చాత్తాపం అవసరంలేని తొంభై తొమ్మిది నీతిమంతుల కంటే, పశ్చాత్తాపపడిన ఒక పాపిని బట్టి పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగుతుంది అని నేను మీతో చెప్తున్నాను” అన్నారు.

  21. యేసు ఇంకా మాట్లాడుతూ: “ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులున్నారు.

  22. వారిలో చిన్నవాడు తన తండ్రితో, ‘నాన్నా, ఆస్తిలో నాకు రావలసిన భాగం నాకు ఇవ్వు’ అని అడిగాడు. కాబట్టి తండ్రి తన ఆస్తిని వారిద్దరికి పంచి ఇచ్చాడు.

  23. “కొన్ని రోజుల్లోనే, ఆ చిన్నకుమారుడు తన దగ్గర ఉన్నదంతా పోగుచేసుకుని, సుదూర దేశానికి బయలుదేరాడు అక్కడ తన ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ తన సంపదను విచ్చలవిడిగా ఖర్చు చేశాడు.

  24. అతడు అంతా ఖర్చు చేసిన సమయంలోనే, ఆ దేశంలో తీవ్రమైన కరువు రావడం వలన అతనికి ఇబ్బందులు మొదలయ్యాయి.

  25. కాబట్టి అతడు ఆ దేశస్థులలో ఒకని పొలంలో పందులను మేపే పనిలో చేరాడు.