కంటెంట్‌కు వెళ్లండి

Genealogy గురించి బైబిల్ వచనాలు

114 వచనాలు · 8 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. హారాను, తన తండ్రి తెరహు బ్రతికి ఉన్నప్పుడే, కల్దీయుల ఊరు అనే పట్టణంలో, తన జన్మస్థలంలో చనిపోయాడు.

  2. అబ్రాము, నాహోరు ఇద్దరు కూడా పెళ్ళిళ్ళు చేసుకున్నారు. అబ్రాము భార్యపేరు శారాయి, నాహోరు భార్యపేరు మిల్కా; ఈమె మిల్కాకును ఇస్కాకును తండ్రియైన హారాను కుమార్తె.

  3. శారాయి గొడ్రాలు, ఆమెకు పిల్లలు కలుగలేదు.

  4. తెరహు తన కుమారుడైన అబ్రామును, తన మనవడు, హారాను కుమారుడైన లోతును, తన కోడలైన అబ్రాము భార్య శారాయిని తీసుకుని కల్దీయుల ఊరు నుండి కనానుకు ప్రయాణమయ్యాడు. కాని దారిలో వారు హారానుకు వచ్చి అక్కడే స్థిరపడ్డారు.

  5. తెరహు 205 సంవత్సరాలు జీవించి హారానులో చనిపోయాడు.

  6. ఇది పెరెసు వంశావళి: పెరెసు కుమారుడు హెస్రోను

  7. హెస్రోను కుమారుడు రాము. రాము కుమారుడు అమ్మీనాదాబు,

  8. అమ్మీనాదాబు కుమారుడు నయస్సోను. నయస్సోను కుమారుడు శల్మాను.

  9. శల్మాను కుమారుడు బోయజు, బోయజు కుమారుడు ఓబేదు.

  10. ఓబేదు కుమారుడు యెష్షయి. యెష్షయి కుమారుడు దావీదు.

  11. ఆదాము, షేతు, ఎనోషు,

  12. కేయినాను, మహలలేలు, యెరెదు,

  13. హనోకు, మెతూషెల, లెమెకు, నోవహు.

  14. నోవహు కుమారులు: షేము, హాము, యాపెతు.

  15. యాపెతు కుమారులు: గోమెరు, మాగోగు, మాదయి, యవాను, తుబాలు, మెషెకు, తీరసు.

  16. గోమెరు కుమారులు: అష్కెనజు, రీఫతు, తోగర్మా.

  17. యవాను కుమారులు: ఎలీషా, తర్షీషు, కిత్తీము, దోదానీము.

  18. హాము కుమారులు: కూషు, ఈజిప్టు, పూతు, కనాను.

  19. కూషు కుమారులు: సెబా, హవీలా, సబ్తా, రాయమా, సబ్తెకా. రాయమా కుమారులు: షేబ, దేదాను.

  20. కూషు నిమ్రోదుకు తండ్రి, ఇతడు భూమిపై మొదటి బలమైన యోధుడు అయ్యాడు.

  21. ఈజిప్టు కుమారులు: లూదీయులు, అనామీయులు, లెహాబీయులు, నఫ్తుహీయులు,

  22. పత్రూసీయులు, కస్లూహీయులు (వీరినుండి ఫిలిష్తీయులు వచ్చారు) కఫ్తోరీయులు.

  23. కనాను కుమారులు: మొదటి కుమారుడగు సీదోను, హిత్తీయులు,

  24. యెబూసీయులు, అమోరీయులు, గిర్గాషీయులు,

  25. హివ్వీయులు, అర్కీయులు, సీనీయులు,