- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa AD 95
The Revelation
John's vision on Patmos unveils the cosmic victory of the Lamb over evil and the final restoration of all creation.
ఈ కాలపు వచనాలు
- ప్రకటన 9:8సుమారు క్రీ.శ. 96
వాటి తలవెంట్రుకలు స్త్రీల తలవెంట్రుకల్లా ఉన్నాయి. వాటి పళ్ళు సింహపు కోరల్లా ఉన్నాయి.
- ప్రకటన 9:9సుమారు క్రీ.శ. 96
వాటి ఛాతీ ఇనుప కవచంలా ఉంది. వాటి రెక్కల ధ్వని యుద్ధానికి పరుగెత్తే అనేక గుర్రాల రథాల ధ్వనిలా ఉంది.
- ప్రకటన 9:10సుమారు క్రీ.శ. 96
వాటికి తేళ్ళ తోకల వంటి తోకలు ఉన్నాయి. అవి అయిదు నెలల వరకు తమ తోకలతో మనుష్యులకు హాని చేసే అధికారాన్ని కలిగి ఉన్నాయి.
- ప్రకటన 9:11సుమారు క్రీ.శ. 96
అగాధాన్ని పాలించే దూత వాటికి రాజుగా ఉన్నాడు. వాడి పేరు హెబ్రీ భాషలో అబద్దోను. గ్రీకు భాషలో అపొల్యోను అనగా నాశనం చేసేవాడు అని అర్థము.
- ప్రకటన 9:12సుమారు క్రీ.శ. 96
మొదటి శ్రమ గతించిపోయింది. ఇదిగో, ఇంకా రెండు శ్రమలు రానున్నాయి.
- ప్రకటన 9:13సుమారు క్రీ.శ. 96
ఆరో దూత బూర ఊదినప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్న బంగారు బలిపీఠపు నాలుగు కొమ్ముల నుండి ఒక స్వరం నాకు వినిపించింది.
- ప్రకటన 9:14సుమారు క్రీ.శ. 96
ఆ స్వరం బూర ఊదిన ఆరో దేవదూతతో, “యూఫ్రటీసు అనే మహా నది దగ్గర బంధించబడి ఉన్న నలుగురు దూతలను విడిపించు” అని చెప్పడం విన్నాను.
- ప్రకటన 9:15సుమారు క్రీ.శ. 96
అయితే ఆ సంవత్సరం, ఆ నెల, ఆ రోజు, ఆ గంట కోసం సిద్ధం చేయబడిన ఆ నలుగురు దూతలు మనుష్యుల్లో మూడవ భాగాన్ని చంపడానికి విడుదల చేయబడ్డారు.
- ప్రకటన 9:16సుమారు క్రీ.శ. 96
స్వారీ చేసేవారి సైన్యం లెక్క ఇరవై కోట్లు. వారి సంఖ్య ఇంత అని నేను విన్నాను.
- ప్రకటన 9:17సుమారు క్రీ.శ. 96
నా దర్శనంలో ఆ గుర్రాలు, వాటిపై స్వారీ చేసేవారు ఇలా ఉన్నారు; నిప్పులాంటి ఎరుపురంగు, ముదురు నీలం రంగు, గంధకం లాంటి పసుపురంగు కవచాలను వారు తమ ఛాతీ మీద ధరించి ఉండడం నేను చూశాను. ఆ గుర్రాల తలలు సింహపు తలల్లా కనిపించాయి. వాటి నోటి నుండి అగ్ని, పొగ, గంధకం బయలుదేరాయి.
- ప్రకటన 9:18సుమారు క్రీ.శ. 96
వాటి నోళ్ల నుండి వచ్చిన అగ్ని, పొగ, గంధకాల వలన మూడు తెగుళ్ళు మనుష్యుల్లో మూడవ భాగం చంపేశాయి.
- ప్రకటన 9:19సుమారు క్రీ.శ. 96
ఆ గుర్రాల శక్తి వాటి నోటిలో వాటి తోకలలో ఉంది. వాటి తోకలు పాముల్లా తలలు కలిగి మనుష్యులను గాయపర్చేవిగా ఉన్నాయి.
- ప్రకటన 9:20సుమారు క్రీ.శ. 96
ఈ తెగుళ్ళ చేత బాధించబడి చావకుండ మిగిలిన ప్రజలు బంగారు, వెండి, ఇత్తడి, రాయి, కొయ్యలతో తయారుచేసుకొన్న విగ్రహాలను, దయ్యాలను పూజచేయడం మానలేదు. ఆ విగ్రహాలు చూడలేవు, వినలేవు, నడవలేవు. అయినా అవి కేవలం తమ చేతి పని అని వారు గ్రహించలేదు. వాటిని దేవునిగా పూజించడం తప్పు అని పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరుగలేదు.
- ప్రకటన 9:21సుమారు క్రీ.శ. 96
వారు చేసే హత్యలు, మంత్రపు ప్రయోగాలు, లైంగిక దుర్నీతి, దొంగతనం అనేవి తప్పు అని గ్రహించి పశ్చాత్తాపపడి వాటిని విడిచిపెట్టి దేవుని వైపు తిరుగలేదు.
- ప్రకటన 10:1సుమారు క్రీ.శ. 96
బలమైన మరొక దేవదూత మేఘాన్ని ధరించుకొని, తన తలమీద వానవిల్లు కలిగి పరలోకం నుండి దిగి రావడం నేను చూశాను. ఆ దేవదూత ముఖం సూర్యునిలా, కాళ్లు అగ్ని స్తంభాల్లా ఉన్నాయి.
- ప్రకటన 10:2సుమారు క్రీ.శ. 96
అతడు తెరిచి ఉన్న ఒక చిన్న గ్రంథపుచుట్టను తన చేతిలో పట్టుకుని తన కుడికాలు సముద్రం మీద, ఎడమకాలు భూమి మీద పెట్టి,
- ప్రకటన 10:3సుమారు క్రీ.శ. 96
సింహగర్జన వంటి పెద్ద కేక వేశాడు. అతడు కేక వేసినప్పుడు ఏడు ఉరుములు తిరిగి గర్జించాయి.
- ప్రకటన 10:4సుమారు క్రీ.శ. 96
ఆ ఏడు ఉరుముల గర్జనలను విన్న నేను వాటి గురించి వ్రాయబోయాను; కానీ పరలోకం నుండి ఒక స్వరం నాతో, “ఈ గర్జనలను గురించి వ్రాయకు, ఏడు ఉరుములు పలికిన సంగతులకు ముద్రవేసి వాటిని రహస్యంగా ఉంచాలి” అని చెప్పడం విన్నాను.
- ప్రకటన 10:5సుమారు క్రీ.శ. 96
అప్పుడు సముద్రం మీద, భూమి మీద నిలబడి ఉన్నట్లు నేను చూసిన ఆ దేవదూత తన కుడిచేతిని ఆకాశం వైపు ఎత్తాడు.
- ప్రకటన 10:6సుమారు క్రీ.శ. 96
ఆ తర్వాత అతడు ఎల్లకాలం జీవిస్తూ పరలోకాన్ని దానిలో ఉన్నవాటన్నిటిని, భూమిని దానిలో ఉన్నవాటన్నిటిని, సముద్రాన్ని దానిలో ఉన్నవాటన్నిటిని సృజించినవాని తోడు నేను ప్రమాణం చేసి చెప్తున్నాను, “ఇక ఏ ఆలస్యం ఉండదు!
- ప్రకటన 10:7సుమారు క్రీ.శ. 96
కాని ఏడవ దూత తన బూరను ఊదబోయే సమయంలో, దేవుడు తన సేవకులైన ప్రవక్తలకు ముందే తెలిపిన విధంగా దేవుని మర్మం నెరవేరుతుంది” అని చెప్పాడు.
- ప్రకటన 10:8సుమారు క్రీ.శ. 96
అప్పుడు పరలోకం నుండి నాతో మాట్లాడిన స్వరం మళ్ళీ నాతో, “వెళ్లు, సముద్రం మీద భూమి మీద నిలబడి ఉన్న దేవదూత చేతిలో తెరిచి ఉన్న ఆ చిన్న గ్రంథపుచుట్టను తీసుకో” అని చెప్పడం విన్నాను.
- ప్రకటన 10:9సుమారు క్రీ.శ. 96
కాబట్టి నేను ఆ దేవదూత దగ్గరకు వెళ్లి ఆ చిన్న గ్రంథపుచుట్టను నాకు ఇవ్వమని అడిగాను. అప్పుడు అతడు నాతో, “దీనిని తీసుకుని తిను, ఇది నీ కడుపుకు చేదుగా ఉంటుంది కాని నీ నోటికి తేనెలా తియ్యగా ఉంటుంది” అని చెప్పాడు.
- ప్రకటన 10:10సుమారు క్రీ.శ. 96
అప్పుడు నేను ఆ చిన్న గ్రంథపుచుట్టను ఆ దేవదూత చేతిలో నుండి తీసుకుని తినగా అది నా నోటికి తేనెలా తియ్యగా ఉంది కాని నేను దాన్ని తిన్న తర్వాత నా కడుపులో చేదుగా మారింది.
- ప్రకటన 10:11సుమారు క్రీ.శ. 96
అప్పుడు ఆయన నాతో, “నీవు అనేక ప్రజలు, దేశాలు, రాజులు, వివిధ భాషలు మాట్లాడేవారి గురించి మళ్ళీ ప్రవచించాలి” అని చెప్పాడు.