కంటెంట్‌కు వెళ్లండి

Meteorology and Celestial Phenomena గురించి బైబిల్ వచనాలు

191 వచనాలు · 2 కోణాలు

"Meteorology and Celestial Phenomena" కోసం వెతకండి

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. భూమి మీద ఏ పొద కనిపించలేదు, మొక్క మొలవలేదు, ఎందుకంటే యెహోవా దేవుడు భూమి మీద వాన కురిపించలేదు, భూమిని సేద్యం చేయడానికి నరులు లేరు,

  2. అయితే భూమిలో నుండి నీటిబుగ్గలు వచ్చి అంతా పారుతూ నేలను తడిపేవి.

  3. అప్పుడు ఇస్సాకు అతనికి జవాబిస్తూ ఇలా అన్నాడు, “నీ నివాసం సారవంతమైన భూమికి దూరంగా, పైనున్న ఆకాశం యొక్క మంచుకు దూరంగా ఉంటుంది.

  4. ఆయన సూర్యుని ఉదయించవద్దని ఆజ్ఞాపిస్తే సూర్యుడు ఉదయించడు. ఆయన నక్షత్రాల కాంతిని కనబడకుండ చేస్తారు.

  5. శూన్యమండలంపైన ఉత్తరాన ఆకాశాలను ఆయన విశాలపరిచారు; శూన్యంలో భూమిని వేలాడదీసారు.

  6. ఆయన తన మేఘాలలో నీళ్లను బంధించారు అయినా వాటి బరువుకు మేఘాలు చినిగిపోవు.

  7. ఆయన గద్దింపుకు ఆకాశాల స్తంభాలు కంపిస్తాయి.

  8. భీభత్సం వారిని వరదలా ముంచెత్తుతుంది; తుఫాను రాత్రివేళ వారిని లాక్కుని పోతుంది.

  9. తూర్పు గాలి వారిని తీసుకెళ్తే, వారిక ఉండరు; అది వారి స్థలం నుండి వారిని తుడిచివేస్తుంది.

  10. ఎందుకంటే ఆయన భూమి అంచుల వరకు చూస్తున్నారు ఆకాశాల క్రింద ఉన్న ప్రతిదీ ఆయన చూస్తున్నారు.

  11. ఆయన గాలి ప్రభావాన్ని స్థాపించినప్పుడు జలములను కొలిచినప్పుడు,

  12. వర్షపాతానికి శాసనాన్ని విధించినప్పుడు ఉరుములతో కూడిన మెరుపులకు దారిని ఏర్పరచినప్పుడు,

  13. అప్పుడు ఆయన జ్ఞానం వైపు చూశాడు దానిని అంచనా వేశాడు; ఆయన దానిని ధృవీకరించారు పరీక్షించారు.

  14. నా వేర్లు నీటిని తాకుతాయి, నా కొమ్మల మీద రాత్రంతా మంచు కురుస్తుంది.

  15. “అతడు నీటి బిందువులను పైకి తీసుకుంటారు, అవే ప్రవాహాలకు వర్షంలాగా కురుస్తుంది;

  16. మేఘాలు వాటి తేమను కురిపిస్తాయి మనుష్యులపై అవి సమృద్ధిగా వర్షాలు కురిపిస్తాయి.

  17. ఆయన మేఘాలను ఎలా వ్యాపింప చేస్తారో ఆయన ఆవరణం నుండి ఎలా ఉరుము వస్తుందో ఎవరు గ్రహించగలరు?

  18. ఆయన మెరుపులను తన చుట్టూ ఎలా వ్యాపింప చేస్తారో అవి సముద్ర అడుగుభాగాన్ని ఎలా కప్పివేసారో చూడండి.

  19. వీటిని బట్టి ఆయన ప్రజలకు తీర్పు తీరుస్తారు సమృద్ధిగా ఆహారం ఇస్తారు.

  20. ఆయన తన చేతులతో మెరుపులను పట్టుకుని గురికి తగలాలని వాటికి ఆజ్ఞాపిస్తారు.

  21. ఉరుము రాబోయే తుఫానును ప్రకటిస్తుంది; పశువులకు కూడ దాని రాకడ తెలుస్తుంది.

  22. ఆయన మంచుతో, ‘భూమిపై పడు’ వాన జల్లుతో, ‘కుండపోత వర్షంగా కురువు’ అని ఆజ్ఞాపిస్తారు.

  23. తద్వార మనుష్యులందరు ఆయన కార్యాన్ని తెలుసుకుంటారు, ఆయన ప్రజలందరినీ తమ ప్రయాసం నుండి విరమింపజేస్తారు.

  24. జంతువులు వాటి గుహల్లోకి వెళ్లి వాటిలో దాక్కుని అక్కడే నివసిస్తాయి.

  25. తుఫాను దాని స్థానం నుండి బయటకు వస్తుంది, వీచే గాలుల నుండి చలి వస్తుంది.