కంటెంట్‌కు వెళ్లండి

Michael

5 వచనాలు

"Michael" కోసం వెతకండి

Michael ను ప్రస్తావించే వచనాలు

  1. అయితే, పర్షియా రాజ్యాధిపతి ఇరవై ఒక రోజులు నన్ను ఎదిరించాడు. నేను పర్షియా రాజు ఎదుట ఉండిపోవలసి వచ్చింది కాబట్టి ప్రముఖ దేవదూతల్లో ఒకడైన మిఖాయేలు నాకు సహాయం చేయడానికి వచ్చాడు.

  2. అయితే ముందు సత్య గ్రంథంలో వ్రాయబడింది ఏంటో నీకు చెప్తాను. (వాళ్ళను ఎదిరించడానికి మీ అధిపతియైన మిఖాయేలు తప్ప ఎవరూ నా పక్షంగా నిలువరు.

  3. “ఆ సమయంలో నీ ప్రజలను కాపాడే గొప్ప అధిపతి మిఖాయేలు వస్తాడు. అప్పుడు దేశాల పుట్టుక నుండి ఎప్పుడు సంభవించని ఆపద కాలం వస్తుంది. అయితే ఆ సమయంలో, నీ ప్రజల్లో ఎవరి పేర్లు గ్రంథంలో వ్రాయబడి ఉంటాయో వారు రక్షింపబడతారు.

  4. మోషే శరీరం గురించి సాతానుతో తనకు వచ్చిన తగాదాలో, దేవదూతల్లో ప్రధానుడైన మిఖాయేలు కూడ సాతానును అవమానకరమైన మాటలతో నిందించలేదు కాని కేవలం, “ప్రభువు నిన్ను గద్దించును గాక!” అని మాత్రమే అన్నాడు.

  5. అప్పుడు పరలోకంలో యుద్ధం జరిగింది. మిఖాయేలు, అతని దూతలు ఆ మహాఘటసర్పంతో యుద్ధం చేశారు. ఆ మహా ఘటసర్పం దాని సైన్యం కూడా యుద్ధంలో పోరాడాయి.