Heresy గురించి బైబిల్ వచనాలు
ముఖ్య బైబిల్ వచనాలు
వారు వారిని న్యాయాధికారుల దగ్గరకు తెచ్చి, “ఈ మనుష్యులు యూదులు, రోమీయులమైన మనం అంగీకరించని ఆచారాలను ప్రకటిస్తూ,
మన పట్టణంలో కలహాలను రేపుతున్నారు” అని చెప్పారు.
వారు నాపై చేసిన ఫిర్యాదు నిజమని వారే నిరూపించలేరు.
ఏది ఏమైనా, మతశాఖకు చెందినదని పిలువబడుతున్న ఈ మార్గాన్ని వెంబడించేవానిగా, నేను మన పూర్వికుల దేవునినే ఆరాధిస్తున్నానని ఒప్పుకుంటాను. నేను ధర్మశాస్త్రాన్ని ప్రవక్తల గ్రంథాల్లో వ్రాసిన ప్రకారం అన్నిటిని నమ్ముతున్నాను.
అలాగే నీతిమంతులకు దుర్మార్గులకు పునరుత్థానం ఉందని వీరికున్న నిరీక్షణనే నేను కూడా కలిగి ఉన్నాను.
కాబట్టి నా మనస్సాక్షిని దేవుడు మనిషి ముందు స్పష్టంగా ఉంచడానికి నేనెల్లప్పుడు ప్రయాసపడుతున్నాను.
విభజనలు కలిగించేవారిని మొదటిసారి గద్దించు, రెండవసారి హెచ్చరించు. ఆ తర్వాత వారిని వదిలేయి.
అలాంటివారు చెడిపోయినవారు, పాపాత్ములు; వారు తమను తామే నిందించుకుంటారని నీకు ఖచ్చితంగా తెలుసు.
ఎవరైనా ఈ బోధను తీసుకురాకుండా మీ దగ్గరకు వస్తే, వారిని మీ ఇంట్లోకి తీసుకెళ్లవద్దు రమ్మనవద్దు.
వారిని రమ్మని ఆహ్వానించేవారు వారి చెడుపనులలో భాగం పంచుకొంటారు.
ప్రియ మిత్రులారా, మనందరం పాలుపంచుకొనే రక్షణ గురించి మీకు వ్రాయాలని చాలా ఆశించాను, కాని దేవుని పరిశుద్ధ ప్రజలకు ఒక్కసారే ఇవ్వబడిన విశ్వాసం కోసం మీరు పోరాడుతూనే ఉండాలని, మిమ్మల్ని ప్రోత్సహించడానికి, వేడుకోడానికి నేను వ్రాస్తున్నాను.
ఎవరి గురించి తీర్పు చాలా కాలం క్రితమే వ్రాయబడిందో వారు రహస్యంగా మీ మధ్యలో చొరబడ్డారు. వారు వ్యభిచారంలో జీవించడానికి మన దేవుని కృపను దుర్వినియోగం చేస్తూ, మన ఏకైక సర్వాధికారియైన ప్రభువగు యేసు క్రీస్తును తిరస్కరించిన భక్తిహీనులు.
మీకు ఇవన్నీ తెలిసినప్పటికీ, ఇశ్రాయేలు ప్రజలను ప్రభువు ఒక్కసారే ఈజిప్టు దేశం నుండి విడిపించారు, కాని తర్వాత విశ్వసించని వారిని ఆయన నాశనం చేశారనే విషయం నీకు జ్ఞాపకం చేయాలని అనుకుంటున్నాను.
తమకు అప్పగించిన అధికారాన్ని నిలుపుకోలేక, తమ నివాసాలను విడిచిన దేవదూతలను గుర్తుచేసుకోండి. వారిని ఆయన మహాదినాన తీర్పు తీర్చడానికి కటిక చీకటిలో, శాశ్వతమైన గొలుసులతో బంధించి ఉంచారు.
అదే విధంగా, సొదొమ, గొమొర్రాలు ఆ చుట్టుప్రక్కల పట్టణ ప్రజలు లైంగిక దుర్నీతికి పాల్పడ్డారు, ప్రకృతి విరుద్ధమైన వ్యామోహానికి లోనయ్యారు. ఆ ప్రజలు నిత్యాగ్ని శిక్షను అనుభవించబోయే వారికి ఒక ఉదాహరణగా ఉన్నారు.
అదే విధంగా, ఈ భక్తిహీనులు తమ కలల ప్రభావం వలన తమ శరీరాలను మలినం చేసుకుంటారు, అధికారులను తృణీకరిస్తారు, పరలోక సంబంధులను దూషిస్తారు.
మోషే శరీరం గురించి సాతానుతో తనకు వచ్చిన తగాదాలో, దేవదూతల్లో ప్రధానుడైన మిఖాయేలు కూడ సాతానును అవమానకరమైన మాటలతో నిందించలేదు కాని కేవలం, “ప్రభువు నిన్ను గద్దించును గాక!” అని మాత్రమే అన్నాడు.
అయినా ఈ ప్రజలు తాము గ్రహించలేని వాటిని దూషిస్తారు, అంతేకాక తెలివిలేని జంతువులు చేసినట్లు, వారు వేటిని సహజసిద్ధంగా గ్రహిస్తారో, అవే వారిని నాశనం చేస్తాయి.
వారికి శ్రమ! వారు కయీను త్రోవను అనుసరించారు; లాభం పొందాలని బిలాములా తప్పు మార్గాల్లో పరుగెత్తారు; కోరహులా తిరుగుబాటు చేయడం వలన నాశనం చేయబడ్డారు.
వీరు మీ ప్రేమ విందుల్లో, వినోదాలలో సిగ్గువిడిచి తింటూ, త్రాగుతూ మాయని మచ్చలుగా ఉన్నారు, వారు కేవలం తమను తాము పోషించుకునే కాపరుల్లా ఉన్నారు. వారు గాలికి కొట్టుకుపోయే, వాన కురవని మబ్బుల వంటివారు. ఆకురాలు కాలంలో, ఫలాలులేకుండా పెల్లగింపబడి రెండు సార్లు చనిపోయిన చెట్లవంటివారు.
వారు తమ సిగ్గును నురుగులా కనబడేలా చేసే సముద్రపు భయంకరమైన అలల వంటివారు. వారు నిలకడలేని నక్షత్రాల వంటివారు. వారి కోసం కటిక చీకటి నిరంతరం భద్రం చేయబడి ఉంది.
ఆదాము నుండి ఏడవ తరం వాడైన హనోకు వారి గురించి ఇలా ప్రవచించాడు: “చూడండి, వేవేలకొలది తన పరిశుద్ధ జనంతో ప్రభువు వస్తారు.
అందరికి తీర్పు తీర్చడానికి, వారి భక్తిహీనతలో వారు చేసిన దుష్ట కార్యాలను, భక్తిహీనులైన పాపులు ఆయనకు వ్యతిరేకంగా పలికిన ధిక్కారపు మాటలను వారందరిచేత ఒప్పింపజేస్తారు.”
వారు ఎల్లప్పుడు సణుగుతూ ఇతరులలో తప్పులు వెదుకుతారు; వారు తమ చెడు కోరికలనే అనుసరిస్తారు; వారు తమ గురించి తామే పొగడుకొంటారు, స్వలాభం కోసం ఇతరులను పొగడ్తలతో ముంచెత్తుతారు.