- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1380–1050 BC
The Judges & Ruth
Israel cycles through rebellion, oppression, and rescue under charismatic leaders—culminating in Ruth's faithful love story.
ఈ కాలపు వచనాలు
- న్యాయాధిపతులు 4:11సుమారు క్రీ.పూ. 1285
కెనీయుడైన హెబెరు మోషే మామయైన హోబాబు సంతతివారైన వారైన కెనీయులను విడిచిపెట్టి కెదెషు దగ్గర ఉన్న జయనన్నీములోని మస్తకిచెట్టు దగ్గర తన గుడారం వేసుకున్నాడు.
- న్యాయాధిపతులు 4:12సుమారు క్రీ.పూ. 1285
అబీనోయము కుమారుడైన బారాకు తాబోరు పర్వతం మీదికి వెళ్లాడని సీసెరాకు చెప్పినప్పుడు,
- న్యాయాధిపతులు 4:13సుమారు క్రీ.పూ. 1285
సీసెరా హరోషెత్-హగ్గోయిము నుండి కీషోను వాగువరకు తన సైన్యమంతటిని, తన తొమ్మిది వందల ఇనుప రథాలను పిలిపించుకున్నాడు.
- న్యాయాధిపతులు 4:14సుమారు క్రీ.పూ. 1285
అప్పుడు దెబోరా బారాకుతో, “వెళ్లు! ఈ రోజు యెహోవా నీ చేతికి సీసెరాను అప్పగించారు. యెహోవా నీకు ముందుగా వెళ్లలేదా?” అని అడిగినప్పుడు బారాకు ఆ పదివేలమంది మనుష్యులను వెంటబెట్టుకొని తాబోరు పర్వతం నుండి దిగి వెళ్లాడు.
- న్యాయాధిపతులు 4:15సుమారు క్రీ.పూ. 1285
బారాకు దాడి చేసినప్పుడు యెహోవా సీసెరాను, అతని రథాలన్నిటిని, అతని సైన్యాన్ని ఖడ్గంతో హతం చేయగా సీసెరా తన రథాన్ని దిగి కాలినడకన పారిపోయాడు.
- న్యాయాధిపతులు 4:16సుమారు క్రీ.పూ. 1285
బారాకు ఆ రథాలను, సైన్యాన్ని హరోషెత్-హగ్గోయిము వరకు వెంటాడగా సీసెరా సైన్యమంతా ఖడ్గంతో చంపబడ్డారు; ఏ ఒక్కరు మిగల్లేదు.
- న్యాయాధిపతులు 4:17సుమారు క్రీ.పూ. 1285
హాసోరు రాజైన యాబీనుకు, కెనీయుడైన హెబెరు కుటుంబానికి మధ్య స్నేహబంధం ఉండేది కాబట్టి సీసెరా కాలినడకన కెనీయుడైన హెబెరు భార్యయైన యాయేలు గుడారానికి పారిపోయాడు.
- న్యాయాధిపతులు 4:18సుమారు క్రీ.పూ. 1285
యాయేలు సీసెరాను కలుసుకోడానికి బయటకు వెళ్లి, “నా ప్రభువా, లోనికి రండి. భయపడకండి” అని అన్నది. కాబట్టి అతడు గుడారంలోకి వెళ్లగా ఆమె దుప్పటితో అతన్ని కప్పింది.
- న్యాయాధిపతులు 4:19సుమారు క్రీ.పూ. 1285
“నాకు దాహంగా ఉంది, దయచేసి కొంచెం నీళ్లు ఇవ్వు” అని అతడు అన్నాడు. ఆమె ఒక పాలబుడ్డి విప్పి అతడు త్రాగడానికి ఇచ్చి అతన్ని తిరిగి కప్పింది.
- న్యాయాధిపతులు 4:20సుమారు క్రీ.పూ. 1285
అతడు ఆమెతో, “గుడార ద్వారం దగ్గర నిలబడు, ఎవరైనా వచ్చి, ‘లోపల ఎవరైనా ఉన్నారా?’ అని అడిగితే ‘లేరు’ అని చెప్పు” అన్నాడు.
- న్యాయాధిపతులు 4:21సుమారు క్రీ.పూ. 1285
అయితే హెబెరు భార్యయైన యాయేలు గుడారపు మేకు సుత్తిని తీసుకుని, అలసిపోయి గాఢనిద్రలో ఉన్న అతని దగ్గరకు నెమ్మదిగా వెళ్లింది. ఆమె ఆ మేకును అతని కణతలలో నుండి నేలలోకి దిగగొట్టగా అతడు చనిపోయాడు.
- న్యాయాధిపతులు 4:22సుమారు క్రీ.పూ. 1285
అప్పుడు బారాకు సీసెరాను తరుముతూ వెళ్తునప్పుడు యాయేలు అతన్ని ఎదుర్కొని, “రండి, మీరు వెదుకుతున్న మనిషిని నేను చూపిస్తాను” అని అన్నది. అతడు ఆమెతో లోనికి వచ్చినప్పుడు, అక్కడ సీసెరా కణతలలో మేకుతో చచ్చి పడి ఉన్నాడు.
- న్యాయాధిపతులు 4:23సుమారు క్రీ.పూ. 1285
ఆ రోజు దేవుడు ఇశ్రాయేలీయుల ఎదుట కనాను రాజైన యాబీనును ఓడించారు.
- న్యాయాధిపతులు 4:24సుమారు క్రీ.పూ. 1285
ఇశ్రాయేలీయులు కనాను రాజైన యాబీనును సంపూర్ణంగా నాశనం చేసే వరకు వారి హస్తం అంతకంతకు కఠినం అయ్యింది.
ఆ రోజు దెబోరా, అబీనోయము కుమారుడైన బారాకు ఈ పాట పాడారు:
ఇశ్రాయేలులో నాయకులు నాయకత్వం వహించినపుడు, ప్రజలు స్వచ్ఛందంగా అర్పించుకున్నప్పుడు, యెహోవాను స్తుతించండి!
రాజులారా వినండి! అధికారులారా ఆలకించండి! నేను యెహోవాకు కీర్తన పాడతాను, నేను పాడతాను; ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను కీర్తనలో స్తుతిస్తాను.
యెహోవా, మీరు శేయీరు నుండి బయలుదేరినప్పుడు, మీరు ఎదోము ప్రాంతం నుండి బయలుదేరినప్పుడు, భూమి కంపించింది, ఆకాశం కుమ్మరించింది, మేఘాలు నీళ్లు కుమ్మరించాయి.
అద్వితీయుడైన యెహోవా ఎదుట పర్వతాలు కంపించాయి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఎదుట సీనాయి కంపించింది.
అనాతు కుమారుడైన షమ్గరు రోజుల్లో, యాయేలు రోజుల్లో రాజమార్గాలు నిర్జనమయ్యాయి; ప్రయాణికులు ప్రక్క త్రోవల్లో నడిచారు.
ఇశ్రాయేలులో ఉన్న గ్రామస్థులు పోరాడలేరు; దెబోరా అనే నేను లేచేవరకు, ఇశ్రాయేలులో తల్లిగా నేను లేచేవరకు వారు వెనకడుగు వేశారు.
ఇశ్రాయేలీయులు కొత్త దేవుళ్ళను ఎంచుకున్నారు, యుద్ధం పట్టణ ద్వారాల దగ్గరకు వచ్చింది, కాని నలభై వేలమంది ఇశ్రాయేలీయులలో ఒక డాలు గాని ఈటె గాని కనిపించలేదు.
నా హృదయం ఇశ్రాయేలు నాయకులతో, యుద్ధానికి స్వచ్ఛందంగా వచ్చిన వారితో ఉన్నది. యెహోవాను స్తుతించండి!
తెల్ల గాడిదల మీద స్వారీ చేసేవారలారా, తివాచీల మీద కూర్చునే వారలారా, త్రోవలో నడిచే వారలారా, ఇది గమనించండి!
పశువులు నీళ్లు త్రాగే చోట గాయకులు చేసే స్వరాన్ని వినండి. వారు యెహోవా నీతిక్రియల గురించి, ఇశ్రాయేలులో ఆయన యొక్క గ్రామస్థుల జయాల గురించి చెప్తున్నారు. “అప్పుడు యెహోవా ప్రజలు పట్టణ ద్వారాల దగ్గరకు వెళ్లారు.