కంటెంట్‌కు వెళ్లండి

circa 1380–1050 BC

The Judges & Ruth

Israel cycles through rebellion, oppression, and rescue under charismatic leaders—culminating in Ruth's faithful love story.

703 వచనాలు · 2 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. న్యాయాధిపతులు 3:17సుమారు క్రీ.పూ. 1325

    అతడు ఆ కప్పము మోయాబు రాజైన ఎగ్లోనుకు చెల్లించాడు; ఎగ్లోను చాలా లావుపాటి మనిషి.

  2. న్యాయాధిపతులు 3:18సుమారు క్రీ.పూ. 1325

    ఏహూదు కప్పము చెల్లించిన తర్వాత దానిని మోసిన మనుష్యులను పంపించేశాడు.

  3. న్యాయాధిపతులు 3:19సుమారు క్రీ.పూ. 1325

    గిల్గాలు దగ్గరున్న రాతి ప్రతిమల దగ్గరకు వచ్చిన తర్వాత అతడు తిరిగి ఎగ్లోను దగ్గరకు వెళ్లి, “రాజా, మీకు ఒక రహస్య సందేశం చెప్పాలి” అని అన్నాడు. రాజు తన సేవకులతో, “మమ్మల్ని విడిచి వెళ్లండి!” అని చెప్పాడు, వారందరు వెళ్లిపోయారు.

  4. న్యాయాధిపతులు 3:20సుమారు క్రీ.పూ. 1325

    అతడు తన రాజభవనంలో మేడ గదిలో ఒంటరిగా కూర్చుని ఉన్నప్పుడు ఏహూదు అతన్ని సమీపించి, “నా దగ్గర దేవుని నుండి మీకొక సందేశం ఉంది” అని అన్నాడు. రాజు తన సింహాసనం మీద నుండి లేస్తున్నప్పుడు,

  5. న్యాయాధిపతులు 3:21సుమారు క్రీ.పూ. 1325

    ఏహూదు తన ఎడమ చేతిని చాపి తన కుడి తొడ మీద నుండి ఆ ఖడ్గాన్ని తీసి రాజు పొట్టలో పొడిచాడు.

  6. న్యాయాధిపతులు 3:22సుమారు క్రీ.పూ. 1325

    ఖడ్గం పిడి కూడ పొట్టలోనికి వెళ్లింది. ఏహూదు ఖడ్గాన్ని బయటకు లాగలేదు, ఖడ్గం పైనుండి క్రొవ్వు చుట్టుకుంది.

  7. న్యాయాధిపతులు 3:23సుమారు క్రీ.పూ. 1325

    అప్పుడు ఏహూదు వాకిలి వైపు వెళ్లి తన వెనుక ఆ మేడగది తలుపులు వేసి వాటికి తాళం వేశాడు.

  8. న్యాయాధిపతులు 3:24సుమారు క్రీ.పూ. 1325

    అతడు వెళ్లిన తర్వాత సేవకులు వచ్చి మేడగది తలుపులకు తాళం వేసి ఉందని చూశారు. వారు, “చల్లని గదిలో మూత్ర విసర్జనకు వెళ్లాడేమో” అనుకున్నారు.

  9. న్యాయాధిపతులు 3:25సుమారు క్రీ.పూ. 1325

    వారు విసుగు చెందేటంత వేచి చూశారు, కాని అతడు తలుపులు తెరవలేదు కాబట్టి వారు ఒక తాళపుచెవితో తాళం తీశారు. అక్కడ తమ ప్రభువు నేలపై పడి చనిపోయి ఉండడం చూశారు.

  10. న్యాయాధిపతులు 3:26సుమారు క్రీ.పూ. 1325

    వారు వేచి ఉన్నప్పుడు ఏహూదు వెళ్లిపోయాడు. అతడు రాతి ప్రతిమలను దాటి శేయీరాకు పారిపోయాడు.

  11. న్యాయాధిపతులు 3:27సుమారు క్రీ.పూ. 1325

    అక్కడికి చేరినప్పుడు, అతడు వచ్చి ఎఫ్రాయిం కొండ సీమలో బూరను ఊదాడు, అప్పుడు ఇశ్రాయేలీయులు అతనితో కొండల దిగువకు వెళ్లారు, అతడు వారి నాయకుడయ్యాడు.

  12. న్యాయాధిపతులు 3:28సుమారు క్రీ.పూ. 1325

    “నన్ను వెంబడించండి, యెహోవా మీ శత్రువైన మోయాబును మీ చేతికి అప్పగించారు” అని అతడు ఆదేశించాడు. కాబట్టి వారతన్ని వెంబడించి, మోయాబు వైపు నడిపించే యొర్దాను రేవులను స్వాధీనపరచుకున్నారు; ఏ ఒక్కరినైన దాటి వెళ్లడానికి వారు అనుమతించలేదు.

  13. న్యాయాధిపతులు 3:29సుమారు క్రీ.పూ. 1325

    ఆ సమయంలో వారు శూరులైన బలమైన పదివేలమంది మోయాబీయులను హతం చేశారు; ఏ ఒక్కరు తప్పించుకోలేదు.

  14. న్యాయాధిపతులు 3:30సుమారు క్రీ.పూ. 1325

    ఆ రోజు మోయాబీయులను ఇశ్రాయేలీయులు పాలించారు, దేశము ఎనభై సంవత్సరాలు ప్రశాంతంగా ఉంది.

  15. న్యాయాధిపతులు 3:31సుమారు క్రీ.పూ. 1325

    ఏహూదు తర్వాత అనాతు కుమారుడైన షమ్గరు వచ్చాడు, పశువులను తోలే ములుకోలుతో ఆరువందలమంది ఫిలిష్తీయులను హతం చేశాడు. అతడు కూడా ఇశ్రాయేలీయులను కాపాడాడు.

  16. న్యాయాధిపతులు 4:1సుమారు క్రీ.పూ. 1305

    ఏహూదు మరణించిన తర్వాత ఇశ్రాయేలీయులు మరల యెహోవా కళ్ళెదుట చెడు కార్యాలు చేశారు.

  17. న్యాయాధిపతులు 4:2సుమారు క్రీ.పూ. 1305

    కాబట్టి యెహోవా వారిని హాసోరులో పరిపాలించే కనాను రాజైన యాబీను చేతికి అప్పగించారు. అతని సేనాధిపతి హరోషెత్-హగ్గోయిములో నివసించిన సీసెరా.

  18. న్యాయాధిపతులు 4:3సుమారు క్రీ.పూ. 1305

    అతనికి తొమ్మిది వందల ఇనుప రథాలున్నాయి, అతడు ఇరవై సంవత్సరాలు ఇశ్రాయేలీయులను క్రూరంగా హింసించాడు, కాబట్టి వారు సహాయం కోసం యెహోవాను వేడుకొన్నారు.

  19. న్యాయాధిపతులు 4:4సుమారు క్రీ.పూ. 1285

    ఆ కాలంలో లప్పీదోతు భార్యయైన దెబోరా అనే ప్రవక్త్రి ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండేది.

  20. న్యాయాధిపతులు 4:5సుమారు క్రీ.పూ. 1285

    ఆమె ఎఫ్రాయిం కొండ సీమలో రామాకు బేతేలుకు మధ్యనున్న దెబోరా ఖర్జూర చెట్టు క్రింద తీర్పులు తీర్చడానికి కూర్చుండేది, ఇశ్రాయేలీయులు వారి వివాదాలు పరిష్కరించుకోడానికి ఆమె దగ్గరకు వచ్చేవారు.

  21. న్యాయాధిపతులు 4:6సుమారు క్రీ.పూ. 1285

    ఆమె నఫ్తాలిలోని కెదెషు నుండి అబీనోయము కుమారుడైన బారాకును పిలిపించి, “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నీకు ఇలా ఆజ్ఞాపిస్తున్నారు: ‘నీవు వెళ్లి నఫ్తాలి జెబూలూను గోత్రాల నుండి పదివేలమంది మనుష్యులను తాబోరు పర్వతం దగ్గరకు పిలిపించు.

  22. న్యాయాధిపతులు 4:7సుమారు క్రీ.పూ. 1285

    యాబీను సేనాధిపతియైన సీసెరాను, అతని రథాలను, అతని సైన్యాన్ని కీషోను నది దగ్గరకు నడిపించి నీ చేతికి అతన్ని అప్పగిస్తాను.’ ”

  23. న్యాయాధిపతులు 4:8సుమారు క్రీ.పూ. 1285

    బారాకు ఆమెతో, “నీవు నాతో వస్తే నేను వెళ్తాను నీవు రాకపోతే వెళ్లను” అన్నాడు.

  24. న్యాయాధిపతులు 4:9సుమారు క్రీ.పూ. 1285

    అప్పుడు దెబోరా, “నీతో నేను తప్పకుండా వస్తాను, అయితే నీ ప్రయాణం వలన నీకు ఘనత రాదు, ఎందుకంటే యెహోవా ఒక స్త్రీకి సీసెరాను అప్పగిస్తారు” అని చెప్పి ఆమె బారాకుతో కలిసి కెదెషుకు వెళ్లింది.

  25. న్యాయాధిపతులు 4:10సుమారు క్రీ.పూ. 1285

    బారాకు జెబూలూనీయులను నఫ్తాలీయులను కెదెషుకు పిలిపించినప్పుడు పదివేలమంది పురుషులు అతనితో వెళ్లారు. దెబోరా కూడా అతనితో వెళ్లింది.