కంటెంట్‌కు వెళ్లండి

circa 800–400 BC

The Hebrew Prophets

God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.

3,706 వచనాలు · 14 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యిర్మీయా 4:3సుమారు క్రీ.పూ. 612

    యూదా వారికి, యెరూషలేముకు యెహోవా ఇలా చెప్తున్నారు: “దున్నబడని నీ నేలను పగులగొట్టు ముళ్ళ మధ్య విత్తవద్దు.

  2. యిర్మీయా 4:4సుమారు క్రీ.పూ. 612

    మిమ్మల్ని మీరు యెహోవాకు సున్నతి చేసుకోండి, మీ హృదయాలను సున్నతి చేసుకోండి, యూదా ప్రజలారా, యెరూషలేము నివాసులారా, లేకపోతే మీరు చేసిన చెడును బట్టి నా కోపం అగ్నిలా మండుతుంది, ఆర్పడానికి ఎవరూ ఉండరు.

  3. యిర్మీయా 4:5సుమారు క్రీ.పూ. 612

    “యూదాలో ప్రకటించి, యెరూషలేములో ప్రకటించి ఇలా చెప్పు: ‘దేశమంతటా బూరధ్వని చేయండి!’ బిగ్గరగా కేకలువేస్తూ అనండి: ‘ఒక్క దగ్గరికి రండి! కోటలున్న పట్టణాలకు పారిపోదాం!’

  4. యిర్మీయా 4:6సుమారు క్రీ.పూ. 612

    సీయోనుకు కనబడేలా జెండాను ఎత్తండి! ఆలస్యం చేయకుండా క్షేమం కోసం పారిపోండి! నేను ఉత్తరం నుండి విపత్తును, భయంకరమైన నాశనాన్ని కూడా తెస్తున్నాను.”

  5. యిర్మీయా 4:7సుమారు క్రీ.పూ. 612

    ఒక సింహం తన పొద చాటు నుండి బయటకు వచ్చింది; దేశాలను నాశనం చేసేవాడు బయలుదేరాడు. మీ దేశాన్ని పాడుచేయడానికి ఆయన తన స్థలాన్ని విడిచిపెట్టాడు. నీ పట్టణాలు నివాసులు లేకుండా శిథిలావస్థలో ఉంటాయి.

  6. యిర్మీయా 4:8సుమారు క్రీ.పూ. 612

    కాబట్టి గోనెపట్ట ధరించుకుని, విలపించండి, ఏడవండి, యెహోవా యొక్క భయంకరమైన కోపం మనల్ని విడిచిపెట్టలేదు.

  7. యిర్మీయా 4:9సుమారు క్రీ.పూ. 612

    యెహోవా ఇలా అంటున్నాడు, “ఆ రోజు రాజు, అధికారులు ధైర్యం కోల్పోతారు, యాజకులు భయపడతారు, ప్రవక్తలు ఆశ్చర్యపోతారు.”

  8. యిర్మీయా 4:10సుమారు క్రీ.పూ. 612

    అప్పుడు నేను, “అయ్యో, ప్రభువైన యెహోవా! ఖడ్గం మా గొంతు మీద ఉన్నప్పుడు, ‘మీకు సమాధానం కలుగుతుంది’ అని చెప్పి మీరు ఈ ప్రజలను, యెరూషలేమును ఎంత ఘోరంగా మోసం చేశారు!”

  9. యిర్మీయా 4:11సుమారు క్రీ.పూ. 612

    ఆ సమయంలో ఈ ప్రజలకు, యెరూషలేముకు ఇలా ప్రకటించబడుతుంది: “ఎడారిలో బంజరు కొండల నుండి మండే గాలి నా ప్రజల వైపు వీస్తుంది, కానీ పొట్టు చెరగడానికో లేదా శుభ్రం చేయడానికో కాదు.

  10. యిర్మీయా 4:12సుమారు క్రీ.పూ. 612

    అంతకంటే బలమైన గాలి నా మీద వీచింది, యెహోవా చెప్పినట్లు వారి మీదికి నా తీర్పులు ప్రకటిస్తున్నాను.”

  11. యిర్మీయా 4:13సుమారు క్రీ.పూ. 612

    చూడు! అతడు మేఘాల్లా ముందుకు సాగిపోతాడు, అతని రథాలు సుడిగాలిలా వస్తాయి, అతని గుర్రాలు గ్రద్దల కంటే వేగవంతమైనవి. అయ్యో మాకు శ్రమ! మేము నాశనం అయ్యాము!

  12. యిర్మీయా 4:14సుమారు క్రీ.పూ. 612

    యెరూషలేమా, నీ హృదయంలోని చెడును కడిగి రక్షించబడు. మీరు ఎంతకాలం చెడ్డ ఆలోచనలను కలిగి ఉంటారు?

  13. యిర్మీయా 4:15సుమారు క్రీ.పూ. 612

    దాను నుండి ఒక స్వరం, ఎఫ్రాయిం కొండల నుండి కీడు వస్తుందని ప్రకటిస్తుంది.

  14. యిర్మీయా 4:16సుమారు క్రీ.పూ. 612

    “దేశాలకు ఈ విషయం చెప్పండి, యెరూషలేము గురించి ఇలా ప్రకటించండి: ‘దూరదేశం నుండి ముట్టడి చేస్తున్న సైన్యం, యూదా పట్టణాలకు వ్యతిరేకంగా యుద్ధ కేకలు వేస్తుంది.

  15. యిర్మీయా 4:17సుమారు క్రీ.పూ. 612

    పొలంలో కాపలా కాస్తున్న మనుష్యుల్లా వారు ఆమెను చుట్టుముట్టారు, ఎందుకంటే ఆమె నా మీదికి తిరుగుబాటు చేసింది’ ” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

  16. యిర్మీయా 4:18సుమారు క్రీ.పూ. 612

    “మీ ప్రవర్తన మీ క్రియలు దీన్ని మీపైకి తెచ్చాయి. ఇది నీకు శిక్ష. ఎంత చేదుగా ఉంది! అది హృదయాన్ని ఎలా గ్రుచ్చుతుంది!”

  17. యిర్మీయా 4:19సుమారు క్రీ.పూ. 612

    అయ్యో, నా వేదన, నా వేదన! నేను నొప్పితో విలపిస్తున్నాను. అయ్యో, నా హృదయ వేదన! నా గుండె నాలో కొట్టుకుంటుంది, నేను మౌనంగా ఉండలేను. నేను బూరధ్వని విన్నాను; నేను యుద్ధ కేకలు విన్నాను.

  18. యిర్మీయా 4:20సుమారు క్రీ.పూ. 612

    విపత్తు తర్వాత విపత్తు వస్తున్నాయి; దేశం మొత్తం శిథిలావస్థలో ఉంది. వెంటనే నా గుడారాలు ధ్వంసమయ్యాయి, నా ఆశ్రయం క్షణంలో ధ్వంసమయ్యాయి.

  19. యిర్మీయా 4:21సుమారు క్రీ.పూ. 612

    నేను ఎంతకాలం యుద్ధ పతాక సంకేతాన్ని చూడాలి బూరధ్వని వినాలి?

  20. యిర్మీయా 4:22సుమారు క్రీ.పూ. 612

    “నా ప్రజలు మూర్ఖులు; వారికి నేను తెలియదు. వారు బుద్ధిలేని పిల్లలు; వారికి వివేచన లేదు. వారు కీడు చేయడంలో నేర్పరులు; మంచి చేయడం ఎలాగో వారికి తెలియదు.”

  21. యిర్మీయా 4:23సుమారు క్రీ.పూ. 612

    నేను భూమిని చూశాను, అది నిరాకారంగా, శూన్యంగా ఉంది; ఆకాశాల వైపు చూశాను, వాటి కాంతి పోయింది.

  22. యిర్మీయా 4:24సుమారు క్రీ.పూ. 612

    నేను పర్వతాలను చూశాను, అవి వణుకుతున్నాయి. కొండలన్నీ ఊగుతున్నాయి.

  23. యిర్మీయా 4:25సుమారు క్రీ.పూ. 612

    నేను చూశాను, అక్కడ మనుష్యులే లేరు; ఆకాశంలోని ప్రతి పక్షి ఎగిరిపోయింది.

  24. యిర్మీయా 4:26సుమారు క్రీ.పూ. 612

    నేను చూశాను, ఫలవంతమైన భూమి ఎడారి; దాని పట్టణాలన్ని యెహోవా ఎదుట, ఆయన ఉగ్రమైన కోపం ముందు శిథిలమైపోయాయి.

  25. యిర్మీయా 4:27సుమారు క్రీ.పూ. 612

    యెహోవా ఇలా అంటున్నాడు: “నేను దానిని పూర్తిగా నాశనం చేయనప్పటికీ, దేశమంతా పాడైపోతుంది.