circa 800–400 BC
The Hebrew Prophets
God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.
ఈ కాలపు వచనాలు
- యిర్మీయా 2:15సుమారు క్రీ.పూ. 629
సింహాలు గర్జించాయి; అవి అతని మీదికి గుర్రుమన్నాయి. వారు అతని దేశాన్ని పాడుచేశారు; అతని పట్టణాలు కాలిపోయి నిర్జనమయ్యాయి.
- యిర్మీయా 2:16సుమారు క్రీ.పూ. 629
అలాగే, మెంఫిసు, తహ్పన్హేసు పట్టణస్థులు, నీ పుర్రె పగులగొట్టారు.
- యిర్మీయా 2:17సుమారు క్రీ.పూ. 629
కానీ నీ దేవుడైన యెహోవా మార్గంలో నిన్ను నడిపిస్తున్నప్పుడు, నీవు ఆయనను విడిచిపెట్టి, నీకు నీవే ఇదంతా నీ మీదికి తెచ్చుకోలేదా?
- యిర్మీయా 2:18సుమారు క్రీ.పూ. 629
నైలు నది నీళ్లు త్రాగడానికి ఈజిప్టుకు ఎందుకు వెళ్లాలి? యూఫ్రటీసు నుండి నీళ్లు త్రాగడానికి అష్షూరుకు ఎందుకు వెళ్లాలి?
- యిర్మీయా 2:19సుమారు క్రీ.పూ. 629
నీ దుర్మార్గం నిన్ను శిక్షిస్తుంది; నీ భక్తిహీనత నిన్ను గద్దిస్తుంది. నీ దేవుడైన యెహోవాను, నీవు విడిచిపెట్టడం, నేనంటే భయం లేకపోవడం, నీకు ఎంత బాధ శ్రమ కలిగిస్తుందో ఆలోచించు, గ్రహించు” అని సైన్యాల అధిపతియైన యెహోవా ప్రకటిస్తున్నారు.
- యిర్మీయా 2:20సుమారు క్రీ.పూ. 629
“చాలా కాలం క్రితమే నేను నీ కాడిని విరగ్గొట్టాను, నీ బంధకాలను తెంపివేశాను; అయినా నీవు, ‘నేను నీ సేవ చేయను!’ అన్నావు కాని నిజానికి, ప్రతీ ఎత్తైన కొండమీద, ప్రతీ పచ్చని చెట్టు క్రింద నీవు వేశ్యలా పడుకుంటున్నావు.
- యిర్మీయా 2:21సుమారు క్రీ.పూ. 629
నేను నిన్ను శ్రేష్ఠమైన ద్రాక్షవల్లిగా మంచి, నమ్మదగిన మొక్కగా నాటాను. అలాంటప్పుడు నీవు నాకు వ్యతిరేకంగా చెడిపోయిన అడవి ద్రాక్షవల్లిగా ఎలా మారావు?
- యిర్మీయా 2:22సుమారు క్రీ.పూ. 629
నీవు సబ్బుతో నిన్ను నీవు కడుక్కున్నా శుభ్రం చేయడానికి వాడే చూర్ణం వాడినా, నీ అపరాధపు మరక ఇంకా కనిపిస్తుంది,” అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.
- యిర్మీయా 2:23సుమారు క్రీ.పూ. 629
“నీవు, ‘నేను అపవిత్రం కాలేదు; నేను బయలు విగ్రహాల వెంట పరుగెత్తలేదు’ అని ఎలా అనగలవు? లోయలో నీవు ఎలా ప్రవర్తించావో చూడు; నీవు ఏమి చేశావో కాస్త గమనించు. నీవు ఇటు అటు వేగంగా పరుగెత్తే ఆడ ఒంటెవు,
- యిర్మీయా 2:24సుమారు క్రీ.పూ. 629
ఎడారికి అలవాటు పడిన అడవి గాడిదవు, అది కామంతో గాలిని పసిగడుతుంది, అది తాపంలో ఉన్నప్పుడు దానిని ఎవరు అడ్డుకోగలరు? దాన్ని వెంటాడే మగ గాడిదలకు అలసట రాదు; అది కలుసుకునే సమయంలో అది వారికి కనబడుతుంది.
- యిర్మీయా 2:25సుమారు క్రీ.పూ. 629
నీ పాదాల చెప్పులు అరిగిపోయే వరకు, నీ గొంతు ఆరిపోయే వరకు నీవు పరదేశి దేవుళ్ళ వెంట పరుగెత్తకు. అయితే మీరు ఇలా అన్నారు, ‘మాకు నీవు చెప్పి ప్రయోజనం లేదు! మేము పరదేశి దేవుళ్ళను ప్రేమిస్తున్నాము, మేము వారి వెంట వెళ్లాలి.’
- యిర్మీయా 2:26సుమారు క్రీ.పూ. 629
“దొంగ పట్టుబడినప్పుడు అవమానించబడినట్లు, ఇశ్రాయేలు ప్రజలు అవమానించబడ్డారు; వారు వారి రాజులు వారి అధికారులు, వారి యాజకులు వారి ప్రవక్తలు అవమానించబడ్డారు.
- యిర్మీయా 2:27సుమారు క్రీ.పూ. 629
వారు చెక్కతో, ‘నీవు మా తండ్రివి’ అని, రాయితో, ‘నీవు మాకు జన్మనిచ్చావు’ అంటున్నారు వారు నావైపు వారి ముఖాలు త్రిప్పకుండ, నాకు వెన్ను చూపారు; అయినప్పటికీ వారు కష్టంలో ఉన్నప్పుడు, ‘వచ్చి మమ్మల్ని రక్షించండి!’ అని అంటారు.
- యిర్మీయా 2:28సుమారు క్రీ.పూ. 629
అయితే మీరు మీ కోసం చేసుకున్న దేవుళ్ళు ఎక్కడున్నారు? మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని కాపాడగలిగితే రానివ్వండి! యూదా, నీకు ఎన్ని పట్టణాలున్నాయో, అంతమంది దేవుళ్ళు ఉన్నారు.
- యిర్మీయా 2:29సుమారు క్రీ.పూ. 629
“నా మీద ఎందుకు ఆరోపణలు చేస్తున్నావు? మీరందరూ నాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
- యిర్మీయా 2:30సుమారు క్రీ.పూ. 629
“నేను వ్యర్థంగా నీ పిల్లలను శిక్షించాను; వారు దిద్దుబాటుకు స్పందించలేదు. నీ ఖడ్గం నీ ప్రవక్తలను, బాగా ఆకలిగా ఉన్న సింహంలా చంపింది.
- యిర్మీయా 2:31సుమారు క్రీ.పూ. 629
“ఈ తరం వారలారా! యెహోవా మాటలు శ్రద్ధగా వినండి: “నేను ఇశ్రాయేలుకు ఎడారిగా మహా చీకటి దేశంగా ఉన్నానా? ఎందుకు నా ప్రజలు, ‘మేము స్వేచ్ఛగా తిరుగుతాము; ఇకపై మేము మీ దగ్గరకు రాము’ అని ఎందుకు అంటున్నారు?
- యిర్మీయా 2:32సుమారు క్రీ.పూ. 629
ఒక యువతి తన నగలు, ఒక వధువు తన పెళ్ళి ఆభరణాలు మరచిపోతుందా? అయినా నా ప్రజలు లెక్కలేనన్ని రోజులు, నన్ను మరచిపోయారు.
- యిర్మీయా 2:33సుమారు క్రీ.పూ. 629
ప్రేమను వెదకడంలో నీవు ఎంత నేర్పరివో! నీచమైన స్త్రీలు నీ నుండి నేర్చుకుంటారు.
- యిర్మీయా 2:34సుమారు క్రీ.పూ. 629
నిర్దోషుల ప్రాణాధారమైన రక్తపు మరక నీ బట్టలపైన ఉంది. వారు లోపలికి చొచ్చుకొని వస్తూ ఉంటే నీవు వారిని పట్టుకోలేదు. ఇంత జరిగినా,
- యిర్మీయా 2:35సుమారు క్రీ.పూ. 629
నీవు, ‘నేను నిర్దోషిని; ఆయనకు నా మీద కోపం రాదు’ అంటున్నావు. ‘నేను పాపం చేయలేదు’ అని అంటున్నావు, కాబట్టి నేను నీ మీద తీర్పు ప్రకటిస్తాను.
- యిర్మీయా 2:36సుమారు క్రీ.పూ. 629
నీ మార్గాలను మార్చుకుంటూ, ఎందుకు అంతలా తిరుగుతున్నావు? నీవు అష్షూరులో నిరాశచెందినట్టుగా ఈజిప్టు విషయంలో కూడా నీవు నిరాశ చెందుతావు.
- యిర్మీయా 2:37సుమారు క్రీ.పూ. 629
నీ తలపై చేతులు పెట్టుకుని ఆ స్థలం నుండి వెళ్లిపోతావు, ఎందుకంటే నీవు నమ్మేవారిని యెహోవా తిరస్కరించారు; నీవు వారి ద్వారా సహాయం పొందలేవు.
“ఒక పురుషుడు తన భార్యకు విడాకులు ఇచ్చి, ఆమె అతన్ని విడిచిపెట్టి మరొక వ్యక్తిని పెళ్ళి చేసుకుంటే, అతడు మళ్ళీ ఆమె దగ్గరకు వెళ్లాలా? దేశమంతా పూర్తిగా అపవిత్రమవదా? అయితే నీవు చాలామంది ప్రేమికులతో వేశ్యగా జీవించావు, ఇప్పుడు నా దగ్గరకు తిరిగి వస్తావా?” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
“కళ్లు పైకెత్తి ఆ బంజరు కొండలను చూడు. నీవు అత్యాచారానికి గురి కాని ప్రదేశం ఏదైనా ఉందా? ప్రేమికుల కోసం రోడ్డు ప్రక్కన ఎదురుచూస్తూ కూర్చున్నావు, ఎడారిలో అరబీయునిగా కూర్చున్నావు. నీ వ్యభిచారంతో, దుర్మార్గంతో దేశాన్ని అపవిత్రం చేశావు.