circa 800–400 BC
The Hebrew Prophets
God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.
ఈ కాలపు వచనాలు
- యిర్మీయా 1:9సుమారు క్రీ.పూ. 629
తర్వాత యెహోవా తన చేయి చాపి, నా నోటిని ముట్టి, “నీ నోటిలో నా మాటలు పెట్టాను.
- యిర్మీయా 1:10సుమారు క్రీ.పూ. 629
పెళ్లగించడానికి, కూల్చివేయడానికి, నాశనం చేయడానికి, పడద్రోయడానికి, కట్టడానికి నాటడానికి నిన్ను దేశాల మీద, రాజ్యాల మీద నియమిస్తున్నాను” అని నాతో చెప్పారు.
- యిర్మీయా 1:11సుమారు క్రీ.పూ. 629
తర్వాత యెహోవా నాతో మాట్లాడుతూ, “యిర్మీయా, నీకేం కనబడుతోంది?” అని అడిగారు. అందుకు నేను, “బాదం చెట్టు కొమ్మ కనబడుతోంది” అని జవాబిచ్చాను.
- యిర్మీయా 1:12సుమారు క్రీ.పూ. 629
యెహోవా నాతో, “నీవు సరిగ్గా చూశావు, ఎందుకంటే నా మాట నెరవేరడం చూడాలని నేను కనిపెట్టుకుని ఉన్నాను” అన్నారు.
- యిర్మీయా 1:13సుమారు క్రీ.పూ. 629
మరోసారి యెహోవా నాతో మాట్లాడుతూ, “నీవు ఏం చూస్తున్నావు?” అని అడిగారు. అందుకు నేను, “మసలుతున్న బాన, అది ఉత్తర దిక్కునుండి మన వైపు వంగి ఉంది” అని చెప్పాను.
- యిర్మీయా 1:14సుమారు క్రీ.పూ. 629
అప్పుడు యెహోవా నాతో, “ఉత్తరం నుండి దేశంలో నివసించే వారందరి మీద విపత్తు కుమ్మరించబడుతుంది.
- యిర్మీయా 1:15సుమారు క్రీ.పూ. 629
నేను ఉత్తర రాజ్యాల జనాంగాలన్నిటిని పిలిపించబోతున్నాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు. “వారి రాజులు వచ్చి తమ సింహాసనాలను యెరూషలేము గుమ్మాల్లో ఏర్పరచుకుంటారు; వారు దాని చుట్టుప్రక్కల ఉన్న ప్రాకారాలన్నింటి మీద అలాగే యూదా పట్టణాలన్నింటి మీద దాడి చేస్తారు.
- యిర్మీయా 1:16సుమారు క్రీ.పూ. 629
నా ప్రజలు నన్ను విడిచి ఇతర దేవుళ్ళకు ధూపం వేసి, వారి చేతులు చేసిన విగ్రహాలను వారు పూజించి, వారు చేసిన దుర్మార్గాన్ని బట్టి నేను నా ప్రజల మీద నా తీర్పులను ప్రకటిస్తాను.
- యిర్మీయా 1:17సుమారు క్రీ.పూ. 629
“నిన్ను నీవు సిద్ధం చేసుకో! లేచి నిలబడి నేను నీకు ఏది ఆజ్ఞాపిస్తే అది వారితో చెప్పు. వారికి భయపడవద్దు, లేకపోతే వారి ముందు నేను నిన్ను భయపెడతాను.
- యిర్మీయా 1:18సుమారు క్రీ.పూ. 629
ఈ రోజు నేను మిమ్మల్ని దేశమంతటికి వ్యతిరేకంగా యూదా రాజులకు, దాని అధికారులకు, యాజకులకు, కోటగోడలు గల పట్టణంగా, ఇనుప స్తంభంగా ఇత్తడి గోడగా చేశాను.
- యిర్మీయా 1:19సుమారు క్రీ.పూ. 629
వారు నీతో యుద్ధం చేస్తారు గాని, నీ మీద విజయం పొందలేరు, నేను నీతో ఉండి నిన్ను విడిపిస్తాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
- యిర్మీయా 2:1సుమారు క్రీ.పూ. 629
యెహోవా వాక్కు నాకు వచ్చి ఇలా చెప్పింది:
- యిర్మీయా 2:2సుమారు క్రీ.పూ. 629
“నీవు వెళ్లి యెరూషలేము వింటూ ఉండగా ఇలా ప్రకటించు: “యెహోవా ఇలా అంటున్నారు: “ ‘నీ యవ్వనంలోని నీ భక్తి నాకు జ్ఞాపకముంది, మీ నిశ్చితార్థ కాలం యొక్క ప్రేమ నాకు జ్ఞాపకముంది; నీవు అరణ్యంలో నన్ను వెంబడించావు, విత్తబడని భూమిలో నన్ను వెంబడించావు.
- యిర్మీయా 2:3సుమారు క్రీ.పూ. 629
ఇశ్రాయేలు యెహోవాకు పరిశుద్ధమైనది, వారు ఆయన పంటలోని ప్రథమ ఫలాలు; ఇశ్రాయేలీయులను మ్రింగివేసినవారు శిక్షకు పాత్రులు, విపత్తు వారి మీదికి వస్తుంది’ ” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
- యిర్మీయా 2:4సుమారు క్రీ.పూ. 629
యాకోబు సంతానమా, సర్వ ఇశ్రాయేలు వంశస్థులారా, యెహోవా మాట వినండి.
- యిర్మీయా 2:5సుమారు క్రీ.పూ. 629
యెహోవా ఇలా చెప్తున్నారు: “మీ పూర్వికులు అంతలా దూరమవడానికి, వారికి నాలో ఏం తప్పు కనిపించింది? వారు విలువలేని విగ్రహాలను పూజించి, వారు విలువలేని వారయ్యారు.
- యిర్మీయా 2:6సుమారు క్రీ.పూ. 629
వారు, ‘ఈజిప్టు నుండి మమ్మల్ని రప్పించి, నిర్జన అరణ్యం గుండా, ఎడారులు, కనుమలు ఉన్న భూమి గుండా, కరువు, చీకటి నిండిన భూమి గుండా, ఎవరూ ప్రయాణించని, ఎవరూ నివసించని భూమి గుండా మమ్మల్ని నడిపించిన యెహోవా ఎక్కడ?’ అని అడిగారు.
- యిర్మీయా 2:7సుమారు క్రీ.పూ. 629
నేను మిమ్మల్ని సారవంతమైన దేశంలోకి, దాని ఫలాలను, శ్రేష్ఠమైన వాటిని తినడానికి తీసుకువచ్చాను. అయితే మీరు వచ్చి నా దేశాన్ని ఆచారరీత్య అపవిత్రం చేసి నా స్వాస్థ్యాన్ని అసహ్యమైనదిగా చేశారు.
- యిర్మీయా 2:8సుమారు క్రీ.పూ. 629
యాజకులు ‘యెహోవా ఎక్కడ ఉన్నారు?’ అని అడగలేదు. ధర్మశాస్త్రాన్ని బోధించే వారికి నేను తెలియదు; నాయకులు నా మీదికి తిరుగబడ్డారు. ప్రవక్తలు పనికిరాని విగ్రహాలను పూజిస్తూ, బయలు పేరిట ప్రవచించారు.
- యిర్మీయా 2:9సుమారు క్రీ.పూ. 629
“కాబట్టి నేను మీమీద మళ్ళీ నేరారోపణ చేస్తాను” మీ పిల్లల పిల్లల మీద కూడా నేరారోపణ చేస్తాను, “అని యెహోవా ప్రకటిస్తున్నారు.
- యిర్మీయా 2:10సుమారు క్రీ.పూ. 629
కుప్ర తీరాల అవతలి వైపుకు వెళ్లి చూడండి, కేదారుకు దూతల్ని పంపి దగ్గరి నుండి గమనించండి; ఇలాంటిది ఎప్పుడైనా జరిగి ఉంటుందేమో చూడండి:
- యిర్మీయా 2:11సుమారు క్రీ.పూ. 629
ఏ దేశమైనా తన దేవుళ్ళను ఎప్పుడైనా మార్చుకుందా? అయినా అవి దేవుళ్ళే కావు. కాని నా ప్రజలు పనికిమాలిన విగ్రహాల కోసం తమ మహిమగల దేవున్ని మార్చుకున్నారు.
- యిర్మీయా 2:12సుమారు క్రీ.పూ. 629
ఆకాశమా, దీని గురించి ఆందోళన చెంది, భయంతో వణుకు,” అని యెహోవా చెప్తున్నారు.
- యిర్మీయా 2:13సుమారు క్రీ.పూ. 629
“నా ప్రజలు రెండు చెడు పాపాలు చేశారు: జీవజలపు ఊటనైన నన్ను వారు విసర్జించి, తమ కోసం సొంత తొట్లు తొలిపించుకున్నారు, అవి పగిలిన తొట్లు, వాటిలో నీళ్లు నిలువవు.
- యిర్మీయా 2:14సుమారు క్రీ.పూ. 629
ఇశ్రాయేలు దాసుడా? పుట్టుకతోనే బానిసా? అలాంటప్పుడు అతడు దోపుడుసొమ్ము ఎందుకు అయ్యాడు?