circa 800–400 BC
The Hebrew Prophets
God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.
ఈ కాలపు వచనాలు
- యెషయా 65:8సుమారు క్రీ.పూ. 698
యెహోవా చెప్పే మాట ఇదే: “ద్రాక్షగుత్తిలో ఇంకా రసం కనబడినప్పుడు ప్రజలు, ‘దానిలో ఆశీర్వాదం ఉంది, దానిని నాశనం చేయకండి’ అని చెప్తారు కదా. అలాగే నా సేవకులందరి కోసం చేస్తాను; నేను వారందరిని నాశనం చేయను.
- యెషయా 65:9సుమారు క్రీ.పూ. 698
యాకోబు నుండి యూదా నుండి వారసుల్ని తీసుకువస్తాను, వారు నా పర్వతాల్ని స్వాధీనపరచుకుంటారు. నేను ఏర్పరచుకున్న ప్రజలు వాటిని స్వతంత్రించుకుంటారు. నా సేవకులు అక్కడ నివసిస్తారు.
- యెషయా 65:10సుమారు క్రీ.పూ. 698
నన్ను వెదకే నా ప్రజల కోసం షారోను గొర్రెలకు పచ్చికబయళ్లుగా, ఆకోరు లోయ పశువులకు విశ్రాంతి తీసుకునే చోటుగా ఉంటాయి.
- యెషయా 65:11సుమారు క్రీ.పూ. 698
“అయితే యెహోవాను విడిచి, నా పరిశుద్ధ పర్వతాన్ని మరచి, గాదు దేవునికి బల్లను సిద్ధపరచి, మెనీ దేవునికి ద్రాక్షరస పాత్రలు నింపేవారలారా,
- యెషయా 65:12సుమారు క్రీ.పూ. 698
నేను ఖడ్గానికి మిమ్మల్ని అప్పగిస్తాను, మీరందరు వధకు గురై కూలిపోతారు; ఎందుకంటే, నేను పిలిస్తే మీరు సమాధానం ఇవ్వలేదు, నేను మాట్లాడితే మీరు వినలేదు. నా దృష్టిలో మీరు చెడుగా ప్రవర్తించి నాకు అయిష్టమైన వాటిని ఎంచుకున్నారు.”
- యెషయా 65:13సుమారు క్రీ.పూ. 698
కాబట్టి ప్రభువైన యెహోవా చెప్పే మాట ఇదే: “నా సేవకులు భోజనం చేస్తారు, కాని మీరు ఆకలితో ఉంటారు; నా సేవకులు త్రాగుతారు కాని మీరు దాహంతో ఉంటారు; నా సేవకులు సంతోషిస్తారు కాని మీరు సిగ్గుపరచబడతారు.
- యెషయా 65:14సుమారు క్రీ.పూ. 698
నా సేవకులు తమ ఆనంద హృదయాలతో పాటలు పాడతారు, మీరు హృదయ వేదనతో ఏడుస్తారు నలిగిన ఆత్మలతో రోదిస్తారు.
- యెషయా 65:15సుమారు క్రీ.పూ. 698
నేను ఏర్పరచుకున్నవారు వారి శాపవచనాల్లో మీ పేరును ఉపయోగిస్తారు; ప్రభువైన యెహోవా మిమ్మల్ని చంపుతారు. ఆయన తన సేవకులకు మరొక పేరు పెడతారు.
- యెషయా 65:16సుమారు క్రీ.పూ. 698
దేశంలో ఆశీర్వాదం ఉండాలని కోరుకునేవారు ఖచ్చితంగా ఏకైక నిజ దేవుని పేరిట ఆశీర్వదించబడాలని కోరుకుంటారు; దేశంలో ప్రమాణం చేసేవారు, ఖచ్చితంగా ఏకైక నిజ దేవుని పేరిట ప్రమాణం చేస్తారు. గతకాలపు సమస్యలన్నీ మరచిపోయాను. అవి నా కళ్ల నుండి దాచబడ్డాయి.
- యెషయా 65:17సుమారు క్రీ.పూ. 698
“చూడండి, నేను క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని సృష్టిస్తాను. గత విషయాలు గుర్తు చేసుకోబడవు. వాటి గురించి ఎవరూ ఆలోచించరు.
- యెషయా 65:18సుమారు క్రీ.పూ. 698
అయితే నేను సృష్టించబోయే వాటి గురించి మీరు ఎప్పుడూ సంతోషించి ఆనందించండి. నేను యెరూషలేమును సంతోషకరమైన స్థలంగా ప్రజలను ఆనందంగా చేస్తాను.
- యెషయా 65:19సుమారు క్రీ.పూ. 698
నేను యెరూషలేము గురించి సంతోషిస్తాను నా ప్రజల్లో ఆనందిస్తాను; ఏడ్పు రోదన శబ్దం ఇకపై దానిలో వినపడవు.
- యెషయా 65:20సుమారు క్రీ.పూ. 698
“ఇకపై అక్కడ కొన్ని రోజులు మాత్రమే బ్రతికి ఉండే శిశువులు ఉండరు. తన కాలం పూర్తి కాకుండా చనిపోయే వృద్ధుడు ఉండడు; వంద సంవత్సరాల వయస్సులో చనిపోయేవారిని పిల్లలుగా పరిగణించబడతారు; వంద సంవత్సరాలకన్నా ముందే చనిపోయే పాపిని శాపగ్రస్తుడు అంటారు.
- యెషయా 65:21సుమారు క్రీ.పూ. 698
వారు ఇల్లు కట్టుకుని వాటిలో నివసిస్తారు; వారు ద్రాక్షతోటలు నాటి వాటి పండ్లు తింటారు.
- యెషయా 65:22సుమారు క్రీ.పూ. 698
ఇకపై వారు కట్టుకున్న ఇళ్ళలో వేరొకరు నివసించరు. వారు నాటిన వాటి పండ్లను వేరొకరు తినరు. నా ప్రజల ఆయుష్షు చెట్ల ఆయుష్షంత ఉంటుంది; నేను ఏర్పరచుకున్నవారు తమ చేతిపనిని పూర్తిగా అనుభవిస్తారు.
- యెషయా 65:23సుమారు క్రీ.పూ. 698
వారు వృధాగా కష్టపడరు, దురదృష్టాన్ని అనుభవించడానికి పిల్లల్ని కనరు; వారు యెహోవాచేత ఆశీర్వదించబడిన ప్రజలుగా, వారు, వారి వారసులు ఉంటారు.
- యెషయా 65:24సుమారు క్రీ.పూ. 698
వారు మొరపెట్టక ముందే నేను జవాబిస్తాను; వారు ఇంకా మాట్లాడుతుండగానే నేను వింటాను.
- యెషయా 65:25సుమారు క్రీ.పూ. 698
తోడేలు గొర్రెపిల్ల కలిసి మేస్తాయి, సింహం ఎద్దులా గడ్డి తింటుంది, దుమ్ము సర్పానికి ఆహారమవుతుంది. నా పరిశుద్ధ పర్వతం మీద అవి హానిని గాని నాశనాన్ని గాని చేయవు” అని యెహోవా చెప్తున్నారు.
- యెషయా 66:1సుమారు క్రీ.పూ. 698
యెహోవా చెప్పే మాట ఇదే: “ఆకాశం నా సింహాసనం భూమి నా పాదపీఠం. మీరు నా కోసం కట్టాలనుకున్న ఇల్లు ఎక్కడ? నా విశ్రాంతి స్థలం ఏది?
- యెషయా 66:2సుమారు క్రీ.పూ. 698
వీటన్నిటిని చేసింది నా చేయి కాదా, ఈ విధంగా అవి కలిగాయి కదా?” అని యెహోవా తెలియజేస్తున్నారు. “ఎవరైతే వినయంతో పశ్చాత్తాప హృదయం కలిగి నా మాట విని వణుకుతారో, వారికే నేను దయ చూపిస్తాను.
- యెషయా 66:3సుమారు క్రీ.పూ. 698
అయితే కోడెను బలిచ్చేవారు నరబలి ఇచ్చేవారి వంటివారే, గొర్రెపిల్లను బలిగా అర్పించేవారు, కుక్క మెడను విరిచేవారి వంటివారే; భోజనార్పణ చేసేవారు పందిరక్తం అర్పించేవారి వంటివారే, జ్ఞాపకార్థ ధూపం వేసేవారు విగ్రహాలను పూజించేవారి వంటివారే. వారు తమకిష్టమైన దుష్ట మార్గాలను ఎంచుకున్నారు వారి అసహ్యమైన పనులలో వారు సంతోషిస్తారు;
- యెషయా 66:4సుమారు క్రీ.పూ. 698
కాబట్టి నేను వారి కోసం కఠినమైన శిక్షను ఎంచుకుంటాను వారు భయపడేవాటిని వారి మీదికి రప్పిస్తాను. ఎందుకంటే, నేను పిలిస్తే ఎవరూ జవాబు ఇవ్వలేదు నేను మాట్లాడితే ఎవరూ వినలేదు. నా దృష్టిలో మీరు చెడుగా ప్రవర్తించి నాకు అయిష్టమైన వాటిని ఎంచుకున్నారు.”
- యెషయా 66:5సుమారు క్రీ.పూ. 698
యెహోవా మాటకు భయపడేవారలారా, ఆయన మాట వినండి. “మిమ్మల్ని ద్వేషిస్తూ నా నామాన్ని బట్టి మిమ్మల్ని త్రోసివేసే మీ సొంతవారు, ‘మీ సంతోషం మాకు కనిపించేలా యెహోవాకు మహిమ కలుగును గాక!’ అని అన్నారు. అయినా వారు సిగ్గుపరచబడతారు.
- యెషయా 66:6సుమారు క్రీ.పూ. 698
పట్టణం నుండి వచ్చే కోలాహలం వినండి మందిరం నుండి వస్తున్న ఆ శబ్దం వినండి! తన శత్రువులకు తగిన ప్రతిఫలాన్ని ఇస్తున్న యెహోవా యొక్క శబ్దం అది.
- యెషయా 66:7సుమారు క్రీ.పూ. 698
“ఆమె ప్రసవవేదన పడక ముందే ఆమె బిడ్డకు జన్మనిస్తుంది; ఆమెకు నొప్పులు రాకముందే కుమారున్ని కంటుంది.