circa 800–400 BC
The Hebrew Prophets
God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.
ఈ కాలపు వచనాలు
- యెషయా 66:8సుమారు క్రీ.పూ. 698
అలాంటి సంగతులు ఎవరైనా ఎప్పుడైనా విన్నారా? అలాంటి సంగతులు ఎవరైనా ఎప్పుడైనా చూశారా? ఒక్క రోజులో దేశం పుడుతుందా ఒక్క నిమిషంలోనే ఒక జనం జన్మిస్తుందా? అయితే సీయోనుకు ప్రసవవేదన కలగగానే ఆమె తన బిడ్డలకు జన్మనిస్తుంది.
- యెషయా 66:9సుమారు క్రీ.పూ. 698
నేను ప్రసవవేదన కలిగించి జన్మనివ్వకుండా ఉంటానా?” అని యెహోవా అడుగుతున్నారు. “పుట్టుక వరకు తీసుకువచ్చి గర్భాన్ని మూస్తానా?” అని నీ దేవుడు అడుగుతున్నారు.
- యెషయా 66:10సుమారు క్రీ.పూ. 698
“యెరూషలేమును ప్రేమించే మీరందరూ ఆమెతో సంతోషించి ఆనందించండి. ఆమె గురించి ఏడ్చే మీరందరూ ఆమెతో గొప్పగా సంతోషించండి.
- యెషయా 66:11సుమారు క్రీ.పూ. 698
ఆదరణకరమైన ఆమె రొమ్ము పాలు త్రాగి మీరు తృప్తిపొందుతారు. మీరు తృప్తిగా త్రాగి ఆమె సమృద్ధిని అనుభవిస్తూ ఆనందిస్తారు.”
- యెషయా 66:12సుమారు క్రీ.పూ. 698
యెహోవా చెప్పే మాట ఇదే: “వినండి. ఆమె దగ్గరకు సమాధానం నదిలా ప్రవహించేలా చేస్తాను, దేశాల సంపదలు పొంగిపొర్లే ప్రవాహంలా వస్తాయి; మీరు పోషించబడి ఆమె చంకనెక్కుతారు ఆమె మోకాళ్లమీద ఆడుకుంటారు.
- యెషయా 66:13సుమారు క్రీ.పూ. 698
తల్లి తన బిడ్డను ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. యెరూషలేములోనే మీరు ఆదరించబడతారు.”
- యెషయా 66:14సుమారు క్రీ.పూ. 698
మీరు ఇది చూసినప్పుడు మీ హృదయం సంతోషిస్తుంది మీరు గడ్డిలా వర్ధిల్లుతారు; యెహోవా యొక్క చేతి బలం తన సేవకులకు తెలియజేయబడుతుంది, కాని ఆయన కోపం తన శత్రువులకు చూపించబడుతుంది.
- యెషయా 66:15సుమారు క్రీ.పూ. 698
చూడండి, యెహోవా అగ్నితో వస్తున్నారు, ఆయన రథాలు సుడిగాలిలా వస్తున్నాయి. ఆయన తన కోపాన్ని తీవ్రతతో క్రిందికి తెస్తున్నారు, ఆయన గద్దింపు అగ్ని మంటలతో వస్తుంది.
- యెషయా 66:16సుమారు క్రీ.పూ. 698
అగ్నితో తన ఖడ్గంతో యెహోవా ప్రజలందరికి తీర్పు అమలుచేస్తారు, యెహోవా ద్వారా అనేకమంది చంపబడతారు.
- యెషయా 66:17సుమారు క్రీ.పూ. 698
“ఎవరైతే పందిమాంసం, ఎలుకలు, ఇతర అపవిత్రమైన వాటిని తినేవాన్ని అనుసరిస్తూ, పవిత్ర తోటలోకి వెళ్లి పూజించడానికి తమను తాము ప్రతిష్ఠించుకుని శుద్ధి చేసుకుంటారో, వారు తాము అనుసరించే వానితో పాటు నశిస్తారు” అని యెహోవా తెలియజేస్తున్నారు.
- యెషయా 66:18సుమారు క్రీ.పూ. 698
“వారి యొక్క పనులు వారి ఆలోచనలను బట్టి నేను అన్ని దేశాల ప్రజలను, రకరకాల భాషలు మాట్లాడేవారిని ఒక్కచోట చేర్చడానికి వస్తున్నాను. వారు వచ్చి నా మహిమను చూస్తారు.
- యెషయా 66:19సుమారు క్రీ.పూ. 698
“నేను వారి ఎదుట ఒక సూచనను పెడతాను. వారిలో తప్పించుకున్న వారిని వేరే దేశాలకు అనగా, తర్షీషు, పూలు, లూదు (ప్రసిద్ధ విల్లుకాండ్రు) అనే దేశాల దగ్గరకు, తుబాలు గ్రీసులకు, నా గురించి నా మహిమ గురించి వినని దూరంగా ఉన్న ద్వీపవాసుల దగ్గరకు పంపిస్తాను. వారు దేశాల మధ్య నా మహిమ గురించి ప్రకటిస్తారు.
- యెషయా 66:20సుమారు క్రీ.పూ. 698
ఇశ్రాయేలీయులు పవిత్రమైన పాత్రల్లో భోజనార్పణల్ని యెహోవా మందిరంలోనికి తెచ్చినట్లు, గుర్రాల మీద, రథాల మీద, బండ్ల మీద, కంచరగాడిదల మీద, ఒంటెల మీద ఎక్కించి అన్ని దేశాల నుండి నా పరిశుద్ధ పర్వతమైన యెరూషలేముకు మీ ప్రజలందరినీ యెహోవాకు అర్పణగా వారు తీసుకువస్తారు” అని యెహోవా చెప్తున్నారు.
- యెషయా 66:21సుమారు క్రీ.పూ. 698
“యాజకులుగా లేవీయులుగా ఉండడానికి నేను వారిలో కొందరిని ఏర్పరచుకుంటాను” అని యెహోవా చెప్తున్నారు.
- యెషయా 66:22సుమారు క్రీ.పూ. 698
“నేను చేయబోయే క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి, నా ఎదుట నిత్యం నిలిచి ఉన్నట్లు, నీ పేరు నీ సంతానం నిలిచి ఉంటుంది” అని యెహోవా తెలియజేస్తున్నారు.
- యెషయా 66:23సుమారు క్రీ.పూ. 698
“ప్రతి అమావాస్య రోజున, ప్రతి సబ్బాతు దినాన నా ఎదుట ఆరాధించడానికి ప్రజలందరూ వస్తారు” అని యెహోవా చెప్తున్నారు.
- యెషయా 66:24సుమారు క్రీ.పూ. 698
“వారు వెళ్లి నా మీద తిరుగుబాటు చేసిన వారి శవాలను చూస్తారు; వాటిని తినే పురుగులు చావవు, వాటిని కాల్చే అగ్ని ఆరిపోదు, మనుష్యులందరికి అది అసహ్యంగా ఉంటుంది.”
- యిర్మీయా 1:1సుమారు క్రీ.పూ. 629
బెన్యామీను దేశంలో అనాతోతు అనే పట్టణంలో ఉన్న యాజకులలో ఒకడైన హిల్కీయా కుమారుడైన యిర్మీయా మాటలు.
- యిర్మీయా 1:2సుమారు క్రీ.పూ. 629
ఆమోను కుమారుడు యూదా రాజైన యోషీయా పాలనలో పదమూడవ సంవత్సరంలో యిర్మీయాకు యెహోవా వాక్కు వచ్చి,
- యిర్మీయా 1:3సుమారు క్రీ.పూ. 629
యోషీయా కుమారుడును యూదా రాజునైన యెహోయాకీము పాలన నుండి, యోషీయా కుమారుడును యూదా రాజునైన సిద్కియా పాలనలో పదకొండవ సంవత్సరం పూర్తయ్యే వరకు అంటే ఆ సంవత్సరం అయిదవ నెలలో యెరూషలేము ప్రజలు చెరలోకి వెళ్లేవరకు యిర్మీయాకు యెహోవా వాక్కు ప్రత్యక్షమవుతూ ఉంది.
- యిర్మీయా 1:4సుమారు క్రీ.పూ. 629
యెహోవా వాక్కు నాకు వచ్చి,
- యిర్మీయా 1:5సుమారు క్రీ.పూ. 629
“గర్భంలో నేను నిన్ను రూపించక ముందే నీవు నాకు తెలుసు, నీవు పుట్టకముందే నేను నిన్ను ప్రత్యేకపరచుకున్నాను; దేశాలకు నిన్ను ప్రవక్తగా నియమించాను” అని చెప్పింది.
- యిర్మీయా 1:6సుమారు క్రీ.పూ. 629
అప్పుడు నేను, “అయ్యో, ప్రభువైన యెహోవా, నేను చిన్నవాన్ని, ఎలా మాట్లాడాలో నాకు తెలియదు” అన్నాను.
- యిర్మీయా 1:7సుమారు క్రీ.పూ. 629
అయితే యెహోవా నాతో, “ ‘నేను చిన్నవాన్ని’ అని నీవు అనవద్దు. నేను నిన్ను ఎవరి దగ్గిరికి పంపితే నీవు వారి దగ్గరికి వెళ్లి నేను ఏది ఆజ్ఞాపించానో అది వారికి చెప్పాలి.
- యిర్మీయా 1:8సుమారు క్రీ.పూ. 629
నీవు వారికి భయపడవద్దు, నేను నీతో ఉండి నిన్ను విడిపిస్తాను అని యెహోవా చెప్తున్నారు.”