కంటెంట్‌కు వెళ్లండి

circa 800–400 BC

The Hebrew Prophets

God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.

3,706 వచనాలు · 14 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యిర్మీయా 4:28సుమారు క్రీ.పూ. 612

    కాబట్టి భూమి దుఃఖిస్తుంది పైనున్న ఆకాశం అంధకారం అవుతుంది, నేను మాట్లాడాను కాబట్టి పశ్చాత్తాపపడను, నేను నిర్ణయించుకున్నాను, కాబట్టి వెనుకకు తిరగను.”

  2. యిర్మీయా 4:29సుమారు క్రీ.పూ. 612

    గుర్రాలు, విలుకాడుల శబ్దానికి ప్రతి ఊరు ఎగిరిపోతుంది. కొందరు పొదల్లోకి వెళ్తారు; కొందరు రాళ్ల మధ్య ఎక్కుతారు. పట్టణాలన్ని నిర్జనమైపోయాయి; వాటిలో ఎవరూ నివసించరు.

  3. యిర్మీయా 4:30సుమారు క్రీ.పూ. 612

    అన్నీ నాశనమవుతుంటే, నీవు ఏం చేస్తున్నావు? ఎర్రని రంగును ధరించి బంగారు ఆభరణాలు ఎందుకు ధరించాలి? మీ కళ్లను అలంకరించుకుని ఎందుకు ఆకర్షణీయంగా చేస్తారు? నిన్ను నీవు వృధాగా అలంకరించుకున్నావు. నీ ప్రేమికులు నిన్ను తృణీకరిస్తారు; వారు నిన్ను చంపాలనుకుంటున్నారు.

  4. యిర్మీయా 4:31సుమారు క్రీ.పూ. 612

    ప్రసవ వేదనలో ఉన్న స్త్రీ ఏడ్పు, తన మొదటి బిడ్డను కంటూ వేదనపడుతున్న స్త్రీ కేకలు, ఊపిరి కోసం అల్లాడుతూ, సీయోను కుమారి తన చేతులు చాచి, “అయ్యో! నేను మూర్ఛపోతున్నాను; నా ప్రాణం హంతకులకు అప్పగించబడింది,” అంటూ కేకలు వేయడం నాకు వినబడుతుంది.

  5. యిర్మీయా 5:1సుమారు క్రీ.పూ. 612

    “యెరూషలేము వీధుల్లోకి వెళ్లి, చుట్టూ చూసి పరిశీలించండి, దాని కూడళ్లలో వెదకండి. నమ్మకంగా వ్యవహరించే సత్యాన్ని వెదికే ఒక్క వ్యక్తినైనా మీరు కనుగొనగలిగితే, నేను ఈ పట్టణాన్ని క్షమిస్తాను.

  6. యిర్మీయా 5:2సుమారు క్రీ.పూ. 612

    వారు, ‘సజీవుడైన యెహోవా మీద ప్రమాణం’ అని అన్నప్పటికీ, వారు అబద్ధపు ప్రమాణమే చేస్తున్నారు.”

  7. యిర్మీయా 5:3సుమారు క్రీ.పూ. 612

    యెహోవా, మీ కళ్లు నమ్మకత్వాన్ని వెదకడం లేదా? మీరు వారిని మొత్తారు కాని వారికి నొప్పి కలగలేదు; మీరు వారిని చితకబాదారు, కానీ వారు దిద్దుబాటును నిరాకరించారు. వారు తమ ముఖాలను రాయి కంటే కఠినంగా చేసుకున్నారు పశ్చాత్తాపపడడానికి నిరాకరించారు.

  8. యిర్మీయా 5:4సుమారు క్రీ.పూ. 612

    నేను ఇలా అనుకున్నాను, “వీరు పేదవారు; వారు బుద్ధిహీనులు, ఎందుకంటే వారికి యెహోవా మార్గం తెలియదు, వారి దేవుడు ఏమి కోరుతున్నారో వారికి తెలియదు.

  9. యిర్మీయా 5:5సుమారు క్రీ.పూ. 612

    కాబట్టి నేను నాయకుల దగ్గరకు వెళ్లి వారితో మాట్లాడతాను; ఖచ్చితంగా యెహోవా మార్గం వారికి తెలుసు, వారి దేవుడు ఏమి కోరుతున్నారో వారికి తెలుసు.” అయితే వారు కూడా ఏకమనస్సుతో కాడిని విరగ్గొట్టారు, బంధకాలను తెంపుకున్నారు.

  10. యిర్మీయా 5:6సుమారు క్రీ.పూ. 612

    కాబట్టి అడవి నుండి సింహం వారిపై దాడి చేస్తుంది, ఎడారి నుండి ఒక తోడేలు వారిని నాశనం చేస్తుంది, ఒక చిరుతపులి వారి పట్టణాల దగ్గర పొంచి ఉంది బయటకు వెళ్లేవారిని ముక్కలు చేయడానికి, ఎందుకంటే వారి తిరుగుబాటు గొప్పది వారి విశ్వాసభ్రష్టత్వం చాలా ఎక్కువ.

  11. యిర్మీయా 5:7సుమారు క్రీ.పూ. 612

    “నేను నిన్ను ఎందుకు క్షమించాలి? మీ పిల్లలు నన్ను విడిచి, దేవుళ్ళు కాని దేవుళ్ళపై ప్రమాణం చేశారు. వారి అవసరాలన్నీ నేను తీర్చాను, అయినప్పటికీ వారు వ్యభిచారం చేశారు వేశ్యల ఇళ్ళకు గుమికూడారు.

  12. యిర్మీయా 5:8సుమారు క్రీ.పూ. 612

    వారు బాగా మేపబడిన, కామంతో నిండిన మగ గుర్రాలు, ప్రతి ఒక్కరు పొరుగువాని భార్యను చూసి సకిలిస్తారు,

  13. యిర్మీయా 5:9సుమారు క్రీ.పూ. 612

    అందుకు నేను వారిని శిక్షించవద్దా?” అని యెహోవా ప్రకటిస్తున్నారు. “ఇలాంటి దేశం మీద నేను ప్రతీకారం తీర్చుకోవద్దా?

  14. యిర్మీయా 5:10సుమారు క్రీ.పూ. 612

    “ఆమె ద్రాక్షతోట వరుసల గుండా వెళ్లి వాటిని నాశనం చేయండి, అయితే వాటిని పూర్తిగా నాశనం చేయవద్దు. వాటి కొమ్మలను తీసివేయండి, ఎందుకంటే ఈ ప్రజలు యెహోవాకు చెందినవారు కారు.

  15. యిర్మీయా 5:11సుమారు క్రీ.పూ. 612

    ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలు నా పట్ల పూర్తిగా నమ్మకద్రోహులుగా ఉన్నారు” అని యెహోవా అంటున్నారు.

  16. యిర్మీయా 5:12సుమారు క్రీ.పూ. 612

    వారు యెహోవా గురించి అబద్ధం చెప్పారు; వారు, “ఆయన ఏమీ చేయడు! మాకు ఎలాంటి హాని జరగదు; మేము ఖడ్గం గాని కరువు గాని ఎన్నడూ చూడము.

  17. యిర్మీయా 5:13సుమారు క్రీ.పూ. 612

    ప్రవక్తలు గాలి తప్ప మరొకటి కాదు వారిలో వాక్యం లేదు; కాబట్టి వారు చెప్పేది వారికే జరుగనివ్వండి” అని అన్నారు.

  18. యిర్మీయా 5:14సుమారు క్రీ.పూ. 612

    కాబట్టి సైన్యాల యెహోవా దేవుడు ఇలా అంటున్నారు: “ప్రజలు ఈ మాటలు మాట్లాడారు కాబట్టి, నేను నీ నోటిలో నా మాటలను అగ్నిగాను ఈ ప్రజలను అది కాల్చివేసే కలపగాను చేస్తాను.

  19. యిర్మీయా 5:15సుమారు క్రీ.పూ. 612

    ఇశ్రాయేలు ప్రజలారా,” యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, “నేను మీ మీదికి దూర దేశాన్ని రప్పిస్తున్నాను, చాలా కాలంనాటి, శాశ్వతమైన దేశం, ఎవరి భాష మీకు తెలియదో, ఎవరి మాట మీకు అర్థం కాదో, అలాంటి ప్రజలను.

  20. యిర్మీయా 5:16సుమారు క్రీ.పూ. 612

    వారి అంబులపొది తెరిచిన సమాధిలా ఉంది; వారందరూ పరాక్రమవంతులు.

  21. యిర్మీయా 5:17సుమారు క్రీ.పూ. 612

    వారు మీ పంటలను, ఆహారాన్ని మ్రింగివేస్తారు, మీ కుమారులను, కుమార్తెలను మ్రింగివేస్తారు; వారు మీ గొర్రెలను, మందలను మ్రింగివేస్తారు, మీ ద్రాక్ష చెట్లను, అంజూర చెట్లను మ్రింగివేస్తారు. మీరు నమ్ముకునే కోటగోడలు గల పట్టణాలను వారు ఖడ్గంతో నాశనం చేస్తారు.

  22. యిర్మీయా 5:18సుమారు క్రీ.పూ. 612

    “అయినప్పటికీ ఆ రోజుల్లో” అని యెహోవా ప్రకటిస్తున్నారు, “నేను మిమ్మల్ని పూర్తిగా నాశనం చేయను.

  23. యిర్మీయా 5:19సుమారు క్రీ.పూ. 612

    ఒకవేళ ప్రజలు, ‘మన దేవుడైన యెహోవా మనకు ఎందుకు ఇదంతా చేశారు?’ అని అడిగితే మీరు వారితో ఇలా చెప్తారు, ‘మీరు నన్ను విడిచి మీ స్వదేశంలో పరదేశి దేవుళ్ళను సేవించారు, కాబట్టి ఇప్పుడు మీరు మీది కాని దేశంలో విదేశీయులకు సేవ చేయాలి.’

  24. యిర్మీయా 5:20సుమారు క్రీ.పూ. 612

    “యాకోబు సంతతికి ఈ విషయాన్ని చాటించండి యూదాలో ప్రకటించండి:

  25. యిర్మీయా 5:21సుమారు క్రీ.పూ. 612

    తెలివిలేని బుద్ధిహీనులారా, కళ్లుండి చూడ లేనివారలారా, చెవులుండి వినలేనివారలారా, ఇది వినండి: