కంటెంట్‌కు వెళ్లండి

circa 800–400 BC

The Hebrew Prophets

God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.

3,706 వచనాలు · 14 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యిర్మీయా 5:22సుమారు క్రీ.పూ. 612

    మీరు నాకు భయపడరా?” అంటూ యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు. “నా సన్నిధిలో మీరు వణకరా? నేను సముద్రానికి ఇసుకను ఒక సరిహద్దుగా చేశాను, అది దాటకూడని ఒక నిత్యమైన హద్దు, అలలు ఎగసిపడవచ్చు, కాని అవి దాన్ని దాటలేవు; అవి గర్జించవచ్చు, కాని అవి దాన్ని దాటలేవు.

  2. యిర్మీయా 5:23సుమారు క్రీ.పూ. 612

    అయితే ఈ ప్రజలు మొండితనం, తిరుగుబాటుతనం గల హృదయాలు కలిగి ఉన్నారు; వారు ప్రక్కకు తిరిగి వెళ్లిపోయారు.

  3. యిర్మీయా 5:24సుమారు క్రీ.పూ. 612

    ‘మనం మన దేవుడైన యెహోవాకు భయపడదాం, ఆయన తొలకరి వాన, కడవరి వాన కురిపిస్తారు, నిర్ణయించిన ప్రకారం కోతకాలపు వారాలను గురించి మనకు నిశ్చయత కలిగించేవాడు ఆయనే’ అని వారు తమ హృదయాల్లో అనుకోరు.

  4. యిర్మీయా 5:25సుమారు క్రీ.పూ. 612

    మీ తప్పులు వీటిని దూరం చేశాయి; మీ పాపాలు మీకు మేలు లేకుండా చేశాయి.

  5. యిర్మీయా 5:26సుమారు క్రీ.పూ. 612

    “నా ప్రజలమధ్య దుర్మార్గులు ఉన్నారు వారు పక్షులకు వలలు వేసే మనుష్యుల్లా మనుష్యులను పట్టుకోవడానికి వేటగానిలా పొంచి ఉన్నారు.

  6. యిర్మీయా 5:27సుమారు క్రీ.పూ. 612

    పక్షులతో నిండిన బోనుల్లా, వారి ఇల్లు మోసంతో నిండి ఉన్నాయి; వారు ధనవంతులు శక్తివంతులు

  7. యిర్మీయా 5:28సుమారు క్రీ.పూ. 612

    వారు లావుగా నిగనిగలాడుతూ ఉన్నారు. వారి దుర్మార్గాలకు హద్దు లేదు; వారు న్యాయం కోరరు. వారు తండ్రిలేనివారి వాదనను వాదించరు; వారు పేదల న్యాయమైన కారణాన్ని సమర్థించరు.

  8. యిర్మీయా 5:29సుమారు క్రీ.పూ. 612

    దీని కోసం నేను వారిని శిక్షించకూడదా?” అని యెహోవా ప్రకటిస్తున్నారు. “ఇలాంటి దేశం మీద నేను ప్రతీకారం తీర్చుకోకూడదా?

  9. యిర్మీయా 5:30సుమారు క్రీ.పూ. 612

    “భయంకరమైన, దిగ్భ్రాంతి కలిగించే సంఘటన ఒకటి దేశంలో జరిగింది:

  10. యిర్మీయా 5:31సుమారు క్రీ.పూ. 612

    ప్రవక్తలు అబద్ధాలను ప్రవచిస్తున్నారు, యాజకులు తమ సొంత అధికారంతో పరిపాలిస్తున్నారు, నా ప్రజలు ఇలాగే ఇష్టపడుతున్నారు. అయితే చివరికి మీరేం చేస్తారు?

  11. యిర్మీయా 6:1సుమారు క్రీ.పూ. 612

    “బెన్యామీను ప్రజలారా, క్షేమం కోసం పారిపోండి! యెరూషలేము నుండి పారిపోండి! తెకోవాలో బూరధ్వని చేయండి! బేత్-హక్కెరెము మీద సంకేతం కోసం ధ్వజం నిలబెట్టండి! ఎందుకంటే ఉత్తర దిక్కునుండి విపత్తు వస్తుంది, భయంకరమైన విధ్వంసం కూడా వస్తుంది.

  12. యిర్మీయా 6:2సుమారు క్రీ.పూ. 612

    నేను చాలా అందమైన, సున్నితమైన, సీయోను కుమార్తెను నాశనం చేస్తాను.

  13. యిర్మీయా 6:3సుమారు క్రీ.పూ. 612

    రాజులు తమ సైన్యాలతో ఆమెకు వ్యతిరేకంగా వస్తారు; వారు ఆమె చుట్టూ తమ గుడారాలు వేసుకుంటారు, ప్రతి ఒక్కరూ తమ సైన్యం నిర్మూలం చేయడానికి ఒక భాగాన్ని ఎంచుకుంటారు.”

  14. యిర్మీయా 6:4సుమారు క్రీ.పూ. 612

    “ఆమెతో పవిత్ర యుద్ధానికి సిద్ధపడండి! లేచి, మధ్యాహ్న సమయంలో దాడి చేద్దాం! కానీ, అయ్యో, పగటి వెలుతురు తగ్గిపోతుంది, సాయంత్రపు నీడలు పొడవు అవుతున్నాయి.

  15. యిర్మీయా 6:5సుమారు క్రీ.పూ. 612

    కాబట్టి లేచి, రాత్రిపూట దాడి చేసి దాని కోటలను నాశనం చేద్దాం!”

  16. యిర్మీయా 6:6సుమారు క్రీ.పూ. 612

    సైన్యాల యెహోవా చెప్పేదేమిటంటే: “చెట్లను నరికి యెరూషలేముపై ముట్టడి దిబ్బలను కట్టండి. ఈ పట్టణం శిక్షించబడాలి; ఇందులో అణచివేయడం తప్ప ఏమీ లేదు.

  17. యిర్మీయా 6:7సుమారు క్రీ.పూ. 612

    బావి తన నీళ్లను ఎలా బయటకు ఉబికేలా చేస్తుందో, అలాగే ఆమె తన దుష్టత్వాన్ని కుమ్మరిస్తుంది. హింస, విధ్వంసం ఆమెలో ప్రతిధ్వనిస్తుంది; ఆమె జబ్బులు, గాయాలు నిత్యం నా ముందు ఉన్నాయి.

  18. యిర్మీయా 6:8సుమారు క్రీ.పూ. 612

    యెరూషలేమా, ఈ హెచ్చరికను తీవ్రమైనదిగా తీసుకో, లేకపోతే నేను నిన్ను వదిలేసి నీ దేశాన్ని నిర్జనంగా చేస్తాను అందులో ఎవరూ నివసించలేరు.”

  19. యిర్మీయా 6:9సుమారు క్రీ.పూ. 612

    సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: “మిగిలిన ఇశ్రాయేలీయులను ద్రాక్షపళ్లలా వారిని ఏరుకోనివ్వండి; ఒకడు ద్రాక్ష పళ్లను ఏరుకున్నట్లుగా, మళ్ళీ కొమ్మల మీద నీ చేయి వేయి.”

  20. యిర్మీయా 6:10సుమారు క్రీ.పూ. 612

    నేను ఎవరితో మాట్లాడి హెచ్చరిక ఇవ్వగలను? నా మాట ఎవరు వింటారు? వారి చెవులు మూయబడి ఉన్నాయి కాబట్టి వారు వినలేరు. యెహోవా మాట వారికి అభ్యంతరకరమైనది; వారు దానిలో ఆనందాన్ని పొందలేరు.

  21. యిర్మీయా 6:11సుమారు క్రీ.పూ. 612

    కానీ నేను యెహోవా యొక్క ఉగ్రతతో నిండి ఉన్నాను, నేను దానిని పట్టుకోలేను. “వీధిలో ఉన్న పిల్లల మీద ఒక్కచోట పోగైన యువకుల మీద దానిని కుమ్మరించండి; భార్య భర్తలు, వృద్ధులు, వయస్సు మీరిన వారు అందులో చిక్కుకుంటారు.

  22. యిర్మీయా 6:12సుమారు క్రీ.పూ. 612

    నేను దేశంలో నివసించే వారిపై నా చేయి చాచినప్పుడు వారి ఇల్లు, వారి పొలాలతో పాటు, వారి భార్యలు ఇతరులకు అప్పగించబడతారు,” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

  23. యిర్మీయా 6:13సుమారు క్రీ.పూ. 612

    “అల్పుల నుండి గొప్పవారి వరకు, అందరు లాభం కోసం అత్యాశతో ఉన్నారు; ప్రవక్తలు యాజకులు అంతా ఒకటే, అందరు మోసం చేసేవారే.

  24. యిర్మీయా 6:14సుమారు క్రీ.పూ. 612

    నా ప్రజల గాయం తీవ్రమైనది కానట్టు వారు దానికి కట్టు కడతారు. సమాధానం లేనప్పుడు, ‘సమాధానం, సమాధానం’ అని వారంటారు.

  25. యిర్మీయా 6:15సుమారు క్రీ.పూ. 612

    వారు తమ అసహ్యమైన ప్రవర్తనకు సిగ్గుపడుతున్నారా? లేదు, వారికి బొత్తిగా సిగ్గు లేదు; ఎలా సిగ్గుపడాలో కూడా వారికి తెలియదు. కాబట్టి వారు పతనమైనవారి మధ్య పడతారు; నేను వారిని శిక్షించినప్పుడు వారు పడద్రోయబడతారు” అని యెహోవా చెప్తున్నారు.