circa 800–400 BC
The Hebrew Prophets
God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.
ఈ కాలపు వచనాలు
- యిర్మీయా 6:16సుమారు క్రీ.పూ. 612
యెహోవా ఇలా చెప్తున్నారు: “కూడలిలో నిలబడి చూడండి; పురాతన మార్గాలు ఎక్కడ ఉన్నాయో అడగండి, మంచి మార్గం ఎక్కడ ఉందో అడిగి, దానిలో నడవండి, మీ ప్రాణాలకు నెమ్మది కలుగుతుంది. కానీ మీరు ఇలా అన్నారు, ‘మేము దానిలో నడవము.’
- యిర్మీయా 6:17సుమారు క్రీ.పూ. 612
నేను మీపై కావలివారిని నియమించాను వారు మీతో ఇలా చెప్పారు, ‘బూరధ్వని వినండి!’ కాని మీరన్నారు, ‘మేము వినము.’
- యిర్మీయా 6:18సుమారు క్రీ.పూ. 612
కాబట్టి జనులారా, వినండి; సాక్షులైన మీరు, వారికి ఏమి జరుగుతుందో గమనించండి.
- యిర్మీయా 6:19సుమారు క్రీ.పూ. 612
భూమీ, విను: నేను ఈ ప్రజలమీదికి విపత్తు తెస్తున్నాను, అది వారి కుట్రల ఫలం, ఎందుకంటే వారు నా మాటలను వినలేదు, నా ధర్మశాస్త్రాన్ని తిరస్కరించారు.
- యిర్మీయా 6:20సుమారు క్రీ.పూ. 612
షేబ నుండి వచ్చే ధూపం గురించి గాని దూరదేశం నుండి వచ్చే మధురమైన సువాసనగల వస గురించి నేను ఏమి పట్టించుకోను? మీ దహనబలులు అంగీకరించదగినవి కావు; మీ బలులు నన్ను ప్రసన్నం చేయవు.”
- యిర్మీయా 6:21సుమారు క్రీ.పూ. 612
కాబట్టి యెహోవా ఇలా అంటున్నారు: “ఈ ప్రజల ముందు నేను అడ్డురాళ్లు వేస్తాను. తల్లిదండ్రులు పిల్లలు ఒకే విధంగా వారిపై పొరపాట్లు చేస్తారు; పొరుగువారు స్నేహితులు నశిస్తారు.”
- యిర్మీయా 6:22సుమారు క్రీ.పూ. 612
యెహోవా చెప్పే మాట ఇదే: “చూడు, ఉత్తర దేశం నుండి ఒక సైన్యం వస్తుంది; ఒక గొప్ప దేశం భూదిగంతాల నుండి పురికొల్పబడతారు.
- యిర్మీయా 6:23సుమారు క్రీ.పూ. 612
వారు విల్లు, ఈటె పట్టుకుని ఉన్నారు; వారు కౄరమైనవారు, దయ చూపరు. వారు తమ గుర్రాలపై స్వారీ చేస్తున్నప్పుడు గర్జించే సముద్రంలా వినిపిస్తారు; సీయోను కుమారీ, నీ మీద దాడి చేయడానికి వారు యుద్ధ వరుసలో ఉన్న సైనికుల్లా వస్తారు.”
- యిర్మీయా 6:24సుమారు క్రీ.పూ. 612
మేము వారి గురించిన వార్తలను విన్నాము, మా చేతులు వణికిపోయాయి. స్త్రీకి కలిగే ప్రసవ వేదనలాంటి వేదన మమ్మల్ని పట్టుకుంది.
- యిర్మీయా 6:25సుమారు క్రీ.పూ. 612
పొలాల్లోకి వెళ్లకండి రహదారులపై నడవకండి, శత్రువుకు కత్తి ఉంది, ప్రతి వైపు భయం ఉంది.
- యిర్మీయా 6:26సుమారు క్రీ.పూ. 612
నా ప్రజలారా, గోనెపట్ట కట్టుకుని బూడిదలో దొర్లండి. ఒక్కగానొక్క కుమారుని కోసం తీవ్ర రోదనతో దుఃఖించండి, ఎందుకంటే హఠాత్తుగా నాశనం చేసేవాడు మన మీదికి వస్తాడు.
- యిర్మీయా 6:27సుమారు క్రీ.పూ. 612
“నేను నిన్ను లోహాలు పరీక్షించేవానిగా నా ప్రజలను మిశ్రమ లోహంగా చేశాను, మీరు వారి మార్గాలను గమనిస్తారని వాటిని పరీక్షిస్తారని.
- యిర్మీయా 6:28సుమారు క్రీ.పూ. 612
వారంతా మొండి తిరుగుబాటుదారులు, వారు అభాండాలు వేస్తూ తిరుగుతున్నారు. వారు ఇత్తడి, ఇనుము లాంటివారు; వారంతా అవినీతికి పాల్పడుతున్నారు.
- యిర్మీయా 6:29సుమారు క్రీ.పూ. 612
సీసాన్ని నిప్పుతో కాల్చివేయడానికి కొలిమి తిత్తులు తీవ్రంగా ఊదుతున్నారు, కానీ శుద్ధి చేయడం వృధా అవుతుంది; దుష్టులు ప్రక్షాళన చేయబడరు.
- యిర్మీయా 6:30సుమారు క్రీ.పూ. 612
వారు తిరస్కరించబడిన వెండి అని పిలువబడతారు, ఎందుకంటే యెహోవా వారిని తిరస్కరించారు.”
యెహోవా నుండి యిర్మీయాకు వచ్చిన వాక్కు ఇది:
- యిర్మీయా 7:2సుమారు క్రీ.పూ. 610
“యెహోవా ఆలయ ద్వారం దగ్గర నిలబడి, అక్కడ ఈ సందేశాన్ని ప్రకటించండి: “ ‘యెహోవాను ఆరాధించడానికి ఈ ద్వారాల గుండా వచ్చే సర్వ యూదా ప్రజలారా, యెహోవా చెప్తుంది వినండి.
- యిర్మీయా 7:3సుమారు క్రీ.పూ. 610
సైన్యాల యెహోవాయైన ఇశ్రాయేలు దేవుడు ఇలా అంటున్నారు: నీ మార్గాలను, నీ క్రియలను సరిచేసుకో, అప్పుడు నేను నిన్ను ఈ స్థలంలో నివాసం చేయిస్తాను.
- యిర్మీయా 7:4సుమారు క్రీ.పూ. 610
మోసపూరిత మాటలను నమ్మకండి, “ఇది యెహోవా మందిరం, యెహోవా మందిరం, యెహోవా మందిరం!”
- యిర్మీయా 7:5సుమారు క్రీ.పూ. 610
మీరు నిజంగా మీ మార్గాలను, మీ క్రియలను మార్చుకుని ఒకరితో ఒకరు న్యాయంగా వ్యవహరిస్తే,
- యిర్మీయా 7:6సుమారు క్రీ.పూ. 610
మీరు విదేశీయులను, తండ్రిలేనివారిని లేదా విధవరాండ్రను అణచివేయకుండ, ఈ స్థలంలో నిర్దోషుల రక్తాన్ని చిందించకుండ, మీకు హాని కలిగించే విధంగా ఇతర దేవుళ్ళను అనుసరించకుండా ఉంటే,
- యిర్మీయా 7:7సుమారు క్రీ.పూ. 610
నేను మీ పూర్వికులకు ఇచ్చిన దేశంలో, అంటే ఈ స్థలంలో, మిమ్మల్ని శాశ్వతంగా నివాసం చేయనిస్తాను.
- యిర్మీయా 7:8సుమారు క్రీ.పూ. 610
కాని చూడండి, మీరు విలువలేని మోసపూరితమైన మాటలు నమ్ముతున్నారు.
- యిర్మీయా 7:9సుమారు క్రీ.పూ. 610
“ ‘నీవు దొంగిలిస్తూ, హత్య చేస్తూ, వ్యభిచారం చేస్తూ, అబద్ధ ప్రమాణం, దేవుళ్ళ మీద ప్రమాణం చేస్తూ, బయలుకు ధూపం వేస్తూ, నీకు తెలియని ఇతర దేవుళ్ళను అనుసరిస్తూ,
- యిర్మీయా 7:10సుమారు క్రీ.పూ. 610
తర్వాత వచ్చి నా పేరుతో పిలువబడే ఈ మందిరంలో నా ముందు నిలబడి, “మేము క్షేమంగా ఉన్నాము” ఈ అసహ్యకరమైన వాటన్నిటిని చేయడానికి క్షేమంగా ఉన్నాము అని అంటారా?