కంటెంట్‌కు వెళ్లండి

circa 930–586 BC

The Divided Kingdom

The kingdom splits into Israel and Judah; prophets warn of judgment as both nations slowly drift into idolatry and exile.

1,722 వచనాలు · 3 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. 2 దినవృత్తాంతములు 24:18సుమారు క్రీ.పూ. 842

    అప్పుడు వారు తమ పూర్వికుల దేవుడైన యెహోవా మందిరాన్ని విడిచి అషేరా స్తంభాలకు, విగ్రహాలకు పూజ చేశారు. వారు చేసిన ఈ అపరాధం కారణంగా దేవుని కోపం యూదా వారిమీదికి, యెరూషలేము వారిమీదికి వచ్చింది.

  2. 2 దినవృత్తాంతములు 24:19సుమారు క్రీ.పూ. 842

    అయినా, వారిని తన వైపుకు మళ్ళించాలని యెహోవా తన ప్రవక్తలను వారి దగ్గరకు పంపాడు. ప్రవక్తలు సాక్ష్యమిస్తూ వారిని హెచ్చరించారు కాని వారు ప్రవక్త మాటలు పెడచెవిని పెట్టారు.

  3. 2 దినవృత్తాంతములు 24:20సుమారు క్రీ.పూ. 842

    ఆ సమయంలో దేవుని ఆత్మ యాజకుడైన యెహోయాదా కుమారుడైన జెకర్యా మీదికి రాగా అతడు ప్రజలు ముందు నిలబడి, “దేవుడు చెప్పే మాట ఇదే: ‘యెహోవా ఆజ్ఞలను మీరెందుకు మీరుతున్నారు? మీరు వర్ధిల్లరు. మీరు యెహోవాను విడిచిపెట్టారు కాబట్టి ఆయన మిమ్మల్ని విడిచిపెట్టారు’ ” అన్నాడు.

  4. 2 దినవృత్తాంతములు 24:21సుమారు క్రీ.పూ. 842

    అయితే వారు అతని మీద కుట్రపన్ని అతన్ని యెహోవా ఆలయ ఆవరణంలో రాళ్లతో కొట్టి చంపారు. రాజు జారీ చేసిన ఆజ్ఞ ప్రకారమే అలా జరిగింది.

  5. 2 దినవృత్తాంతములు 24:22సుమారు క్రీ.పూ. 842

    జెకర్యా తండ్రియైన యెహోయాదా తనపై చూపిన దయను యోవాషు రాజు మరచిపోయే, అతని కుమారున్ని చంపించాడు. జెకర్యా చనిపోతూ చివరిగా, “యెహోవా ఇది చూసి విచారణ చేస్తారు” అన్నాడు.

  6. 2 దినవృత్తాంతములు 24:23సుమారు క్రీ.పూ. 839

    ఆ సంవత్సరం చివరిలో సిరియా సైన్యం యోవాషు మీదికి దండెత్తి వచ్చింది. వారు యూదాపై యెరూషలేముపై దాడిచేసి ప్రజల నాయకులందరిని చంపారు. కొల్లసొమ్మంతా దమస్కులో ఉన్న వారి రాజుకు పంపారు.

  7. 2 దినవృత్తాంతములు 24:24సుమారు క్రీ.పూ. 839

    వచ్చిన సిరియా సైన్యం చిన్నదే అయినా చాలా పెద్ద సైన్యాన్ని యెహోవా వారి వశం చేశాడు. యూదా తమ పూర్వికుల దేవుడైన యెహోవాను విడిచిపెట్టారు కాబట్టి అలా జరిగింది. యోవాషు కూడా తీర్పుకు గురి అయ్యాడు.

  8. 2 దినవృత్తాంతములు 24:25సుమారు క్రీ.పూ. 839

    సిరియావారు తిరిగి వెళ్లేటప్పుడు గాయాలతో ఉన్న యోవాషును వదిలేశారు. యాజకుడైన యెహోయాదా కుమారుడిని చంపినందుకు అతని అధికారులు అతనిపై కుట్రపన్ని అతన్ని అతని మంచం మీద చంపారు. కాబట్టి అతడు చనిపోయి దావీదు పట్టణంలో పాతిపెట్టబడ్డాడు, అయితే రాజుల సమాధుల్లో కాదు.

  9. 2 దినవృత్తాంతములు 24:26సుమారు క్రీ.పూ. 839

    అతనిపై అమ్మోనీయురాలైన షిమాతు కుమారుడైన జాబాదు, మోయాబురాలైన షిమ్రీతు కుమారుడైన యెహోజాబాదు కుట్రపన్నారు.

  10. 2 దినవృత్తాంతములు 24:27సుమారు క్రీ.పూ. 839

    యోవాషు కుమారుల గురించి, అతని గురించి చెప్పిన ప్రవచనాల విషయం, దేవుని మందిరాన్ని పూర్వస్థితికి తెచ్చిన విషయం రాజు గ్రంథ వ్యాఖ్యానంలో వ్రాసి ఉన్నాయి. అతని తర్వాత అతని కుమారుడైన అమజ్యా రాజయ్యాడు.

  11. అమజ్యా రాజైనప్పుడు అతని వయస్సు ఇరవై అయిదు సంవత్సరాలు, అతడు యెరూషలేములో ఇరవై తొమ్మిది సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు యెహోయద్దాను; ఆమె యెరూషలేముకు చెందినది.

  12. అతడు యెహోవా దృష్టిలో సరియైనది చేశాడు, కానీ హృదయమంతటితో ఆయనను అనుసరించలేదు.

  13. 2 దినవృత్తాంతములు 25:3సుమారు క్రీ.పూ. 838

    రాజ్యం తన ఆధీనంలో స్థిరపడిన తర్వాత అతడు రాజైన తన తండ్రిని చంపిన ఆ అధికారులను చంపించాడు.

  14. 2 దినవృత్తాంతములు 25:4సుమారు క్రీ.పూ. 838

    అయితే అతడు వారి సంతానాన్ని చంపలేదు. మోషే వ్రాసిన ధర్మశాస్త్రంలో “తల్లిదండ్రులు తమ పిల్లల కోసం మరణశిక్ష పొందుకోవద్దు, లేదా వారి తల్లిదండ్రుల కోసం పిల్లలు మరణశిక్ష పొందుకోవద్దు; ప్రతి ఒక్కరూ తమ సొంత పాపం కోసం చనిపోతారు” అని యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం అతడు చేశాడు.

  15. 2 దినవృత్తాంతములు 25:5సుమారు క్రీ.పూ. 827

    అమజ్యా యూదా వారిని పిలిపించి, వారి కుటుంబాల ప్రకారం వారిని యూదా, బెన్యామీను వారందరికి సహస్రాధిపతులుగాను శతాధిపతులుగాను నియమించాడు. తర్వాత అతడు ఇరవై సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సున్న వారిని లెక్కిస్తే ఈటె డాలు పట్టుకుని యుద్ధానికి వెళ్లగలవారు 3,00,000 మంది ఉన్నారు.

  16. 2 దినవృత్తాంతములు 25:6సుమారు క్రీ.పూ. 827

    అతడు ఇశ్రాయేలు నుండి వంద తలాంతుల వెండికి లక్ష మంది పోరాట యోధులను కిరాయికి తీసుకున్నాడు.

  17. 2 దినవృత్తాంతములు 25:7సుమారు క్రీ.పూ. 827

    అయితే ఒక దైవజనుడు అమజ్యా దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు, “రాజా, ఇశ్రాయేలు సైనికులు నీతో తీసుకెళ్లకు. ఎందుకంటే యెహోవా ఇశ్రాయేలీయులతో గాని, ఎఫ్రాయిం వారిలో ఎవ్వరితో గాని లేరు.

  18. 2 దినవృత్తాంతములు 25:8సుమారు క్రీ.పూ. 827

    ఒకవేళ మీరు వెళ్లి ధైర్యంగా యుద్ధం చేసినా, దేవుడు మిమ్మల్ని శత్రువుల ముందు కూల్చివేస్తారు, ఎందుకంటే సహాయం చేయడానికైనా, కూల్చివేయడానికైనా దేవునికే శక్తి ఉంది.”

  19. 2 దినవృత్తాంతములు 25:9సుమారు క్రీ.పూ. 827

    అమజ్యా దైవజనుని చూసి, “కాని ఇశ్రాయేలు సైనికుల కోసం నేను చెల్లించిన వంద తలాంతుల సంగతేంటి?” అని అడిగాడు. అందుకు దైవజనుడు, “యెహోవా అంతకంటే ఎక్కువ నీకివ్వగలరు” అని జవాబిచ్చాడు.

  20. 2 దినవృత్తాంతములు 25:10సుమారు క్రీ.పూ. 827

    కాబట్టి అమజ్యా ఎఫ్రాయిం నుండి తన దగ్గరకు వచ్చిన సైన్యాన్ని వేరుచేసి ఇంటికి పంపివేశాడు. అందుకు వారు యూదా మీద కోప్పడి తీవ్ర కోపంతో ఇంటికి వెళ్లిపోయారు.

  21. 2 దినవృత్తాంతములు 25:11సుమారు క్రీ.పూ. 827

    తర్వాత అమజ్యా బలం కూడగట్టుకొని తన సైన్యాన్ని ఉప్పు లోయకు నడిపించి అక్కడ 10,000 మంది శేయీరు వారిని చంపాడు.

  22. 2 దినవృత్తాంతములు 25:12సుమారు క్రీ.పూ. 827

    అంతేగాక యూదా సైన్యం మరో 10,000 మందిని ప్రాణాలతో పట్టుకుని, వారిని ఒక కొండచరియపైకి తీసుకెళ్లి అక్కడినుండి క్రిందికి పడవేశారు. వారంతా ముక్కలైపోయారు.

  23. 2 దినవృత్తాంతములు 25:13సుమారు క్రీ.పూ. 827

    ఈలోగా అమజ్యా తనతో కూడా యుద్ధానికి రానివ్వకుండా పంపివేసిన ఇశ్రాయేలు సైనికులు సమరయ నుండి బేత్-హోరోను వరకు ఉన్న యూదా పట్టణాల మీద దాడిచేశారు. వారు 3,000 మందిని చంపి, పెద్ద మొత్తంలో దోపుడుసొమ్మును ఎత్తుకెళ్లారు.

  24. 2 దినవృత్తాంతములు 25:14సుమారు క్రీ.పూ. 827

    అమజ్యా ఎదోమీయులను హతమార్చి తిరిగి వచ్చినప్పుడు తమతో కూడా శేయీరు ప్రజల దేవుళ్ళను తెచ్చాడు. వాటిని తన సొంత దేవుళ్ళుగా నిలిపి, వాటి ఎదుట సాష్టాంగపడి వాటికి బలులు అర్పించాడు.

  25. 2 దినవృత్తాంతములు 25:15సుమారు క్రీ.పూ. 827

    అందువల్ల అమజ్యా మీద యెహోవాకు కోపం రగులుకుంది. యెహోవా ఒక ప్రవక్తను అమజ్యా దగ్గరకు పంపాడు. అతడు అమజ్యాతో, “ఈ దేవుళ్ళు తమ సొంత ప్రజలనే నీ చేతిలో పడకుండా కాపాడలేకపోయారు. నీవు వారి దేవుళ్ళ మీద ఎందుకు ఆధారపడుతున్నావు?” అని అడిగాడు.