కంటెంట్‌కు వెళ్లండి

circa 930–586 BC

The Divided Kingdom

The kingdom splits into Israel and Judah; prophets warn of judgment as both nations slowly drift into idolatry and exile.

1,722 వచనాలు · 3 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. 1 రాజులు 22:22సుమారు క్రీ.పూ. 897

    “ ‘ఎలా?’ అని యెహోవా అడిగారు. “ ‘నేను వెళ్లి అతని ప్రవక్తలందరి నోట మోసగించే ఆత్మగా ఉంటాను’ అని అతడు చెప్పాడు. “అందుకు యెహోవా, ‘నీవు అతన్ని ప్రలోభపెట్టడంలో విజయం సాధిస్తావు. వెళ్లు అలాగే చేయి’ అన్నారు.

  2. 1 రాజులు 22:23సుమారు క్రీ.పూ. 897

    “కాబట్టి యెహోవా నీ ఈ ప్రవక్తలందరి నోట మోసపరచే ఆత్మను ఉంచారు. యెహోవా ఈ విపత్తును నీకోసం నిర్ణయించారు.”

  3. 1 రాజులు 22:24సుమారు క్రీ.పూ. 897

    అప్పుడు కెనాన కుమారుడైన సిద్కియా అతని దగ్గరకు వచ్చి మీకాయాను చెంపమీద కొట్టాడు. “నీతో మాట్లాడడానికి యెహోవా ఆత్మ నా నుండి వెళ్లినప్పుడు ఏ మార్గాన వెళ్లాడు?” అని అతడు అడిగాడు.

  4. 1 రాజులు 22:25సుమారు క్రీ.పూ. 897

    మీకాయా జవాబిస్తూ, “నీవు దాక్కోడానికి లోపలి గదిలోకి చొరబడే రోజున నీవు తెలుసుకుంటావు” అన్నాడు.

  5. 1 రాజులు 22:26సుమారు క్రీ.పూ. 897

    అప్పుడు ఇశ్రాయేలు రాజు, “మీకాయాను నగర పాలకుడైన ఆమోను దగ్గరకు, అలాగే రాకుమారుడైన యోవాషు దగ్గరకు తీసుకెళ్లి,

  6. 1 రాజులు 22:27సుమారు క్రీ.పూ. 897

    వారితో ఇలా చెప్పండి, ‘రాజు ఇలా అన్నారు: నేను క్షేమంగా తిరిగి వచ్చేవరకు, ఇతన్ని చెరసాలలో ఉంచి అతనికి రొట్టె, నీరు తప్ప ఏమి ఇవ్వకండి’ ” అని ఆదేశించాడు.

  7. 1 రాజులు 22:28సుమారు క్రీ.పూ. 897

    మీకాయా, “ఒకవేళ మీరు క్షేమంగా వస్తే, యెహోవా నా ద్వారా మాట్లాడలేదని అర్థం. ప్రజలారా, మీరంతా నా మాట గుర్తు పెట్టుకోండి!” అని ప్రకటించాడు.

  8. 1 రాజులు 22:29సుమారు క్రీ.పూ. 897

    కాబట్టి ఇశ్రాయేలు రాజు, యూదా రాజైన యెహోషాపాతు రామోత్ గిలాదు మీదికి వెళ్లారు.

  9. 1 రాజులు 22:30సుమారు క్రీ.పూ. 897

    ఇశ్రాయేలు రాజు యెహోషాపాతుతో, “యుద్ధంలో ప్రవేశించేటప్పుడు నేను మారువేషంలో యుద్ధానికి వెళ్తాను, మీరు మాత్రం మీ రాజవస్త్రాలు ధరించుకోండి” అని అన్నాడు. కాబట్టి ఇశ్రాయేలు రాజు మారువేషంలో యుద్ధానికి వెళ్లాడు.

  10. 1 రాజులు 22:31సుమారు క్రీ.పూ. 897

    సిరియా రాజు తన ముప్పై రెండు మంది రథాధిపతులకు, “మీరు ఇశ్రాయేలు రాజు ఒక్కనితో తప్ప, చిన్నవారితో గాని గొప్పవారితో గాని యుద్ధం చేయకూడదు” అని ఆదేశించాడు.

  11. 1 రాజులు 22:32సుమారు క్రీ.పూ. 897

    అయితే ఆ రథాధిపతులు యెహోషాపాతును చూసి, “ఖచ్చితంగా ఇతడే ఇశ్రాయేలు రాజు” అనుకుని, అతనిపై దాడి చేయడానికి అతని మీదికి రాగా యెహోషాపాతు బిగ్గరగా కేక వేసినప్పుడు,

  12. 1 రాజులు 22:33సుమారు క్రీ.పూ. 897

    అతడు ఇశ్రాయేలు రాజు కాడని రథాధిపతులు తెలుసుకొని అతన్ని తరమడం ఆపివేశారు.

  13. 1 రాజులు 22:34సుమారు క్రీ.పూ. 897

    అయితే ఒకడు విల్లెక్కుపెట్టి గురి చూడకుండ బాణం వేయగా అది ఇశ్రాయేలు రాజుకు కవచం అతుకు మధ్యలో గుచ్చుకుంది. రాజు తన రథసారధితో, “రథం వెనుకకు త్రిప్పి నన్ను యుద్ధం నుండి బయటకు తీసుకెళ్లు, నేను గాయపడ్డాను” అని అన్నాడు.

  14. 1 రాజులు 22:35సుమారు క్రీ.పూ. 897

    ఆ రోజంతా హోరాహోరీగా యుద్ధం జరిగింది, రాజు అరామీయులకు ఎదురుగా తన రథం మీద ఉన్నాడు. అతని గాయం నుండి కారిన రక్తం రథం అడుగు భాగానికి చేరింది. ఆ సాయంకాలం అతడు చనిపోయాడు.

  15. 1 రాజులు 22:36సుమారు క్రీ.పూ. 897

    సూర్యాస్తమయం అవుతున్నప్పుడు, “ప్రతి ఒక్కరు తన పట్టణానికి వెళ్లాలి, ప్రతి ఒక్కడు తన దేశానికి వెళ్లాలి!” అనే వార్త సైన్యమంతా వ్యాపించింది.

  16. 1 రాజులు 22:37సుమారు క్రీ.పూ. 897

    అలా రాజు చనిపోయాడు. వారు అతన్ని సమరయకు తీసుకువచ్చి అక్కడే అతన్ని సమాధి చేశారు.

  17. 1 రాజులు 22:38సుమారు క్రీ.పూ. 897

    వారు సమరయలో ఒక చెరువు దగ్గర అతన్ని రథాన్ని కడిగారు (అక్కడ వేశ్యలు స్నానం చేసేవారు). యెహోవా చెప్పినట్లే కుక్కలు వచ్చి అతని రక్తం నాకాయి.

  18. 1 రాజులు 22:39సుమారు క్రీ.పూ. 918

    అహాబు పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలు, అతడు చేసినదంతా, దంతంతో అతడు కట్టించుకున్న భవనం గురించి, అతడు పటిష్టం చేసుకున్న పట్టణాల గురించి ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడలేదా?

  19. 1 రాజులు 22:40సుమారు క్రీ.పూ. 918

    అహాబు చనిపోయి తన పూర్వికుల దగ్గర చేరాడు. అతని తర్వాత అతని కుమారుడైన అహజ్యా రాజయ్యాడు.

  20. 1 రాజులు 22:41సుమారు క్రీ.పూ. 914

    ఇశ్రాయేలు రాజైన అహాబు పరిపాలనలోని నాల్గవ సంవత్సరంలో ఆసా కుమారుడైన యెహోషాపాతు యూదాకు రాజయ్యాడు.

  21. 1 రాజులు 22:42సుమారు క్రీ.పూ. 914

    యెహోషాపాతు యూదాకు రాజైనప్పుడు అతని వయస్సు ముప్పై అయిదు సంవత్సరాలు. అతడు యెరూషలేములో ఇరవై అయిదు సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు అజూబా, ఆమె షిల్హీ కుమార్తె.

  22. 1 రాజులు 22:43సుమారు క్రీ.పూ. 914

    ప్రతీ విషయంలో అతడు తన తండ్రి ఆసా విధానాలను అనుసరించాడు, వాటినుండి తొలగిపోలేదు; అతడు యెహోవా దృష్టిలో సరియైనది చేశాడు. అయితే, క్షేత్రాలు తొలగించబడలేదు, ప్రజలు ఇంకా ఆ స్థలాల్లో బలులు అర్పిస్తూ, ధూపం వేస్తూ వచ్చారు.

  23. 1 రాజులు 22:44సుమారు క్రీ.పూ. 914

    అంతేకాక యెహోషాపాతు ఇశ్రాయేలు రాజుతో సంధి కలిగి ఉన్నాడు.

  24. 1 రాజులు 22:45సుమారు క్రీ.పూ. 914

    యెహోషాపాతు పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలు, అతని విజయాలు, యుద్ధం విన్యాసాలు, యూదా రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడలేదా?

  25. 1 రాజులు 22:46సుమారు క్రీ.పూ. 914

    అతడు తన తండ్రి ఆసా పాలన తర్వాత కూడా అక్కడ మిగిలిపోయిన ఆలయాలలో ఉన్న పురుష వేశ్యలను దేశంలో నుండి తొలగించాడు.