కంటెంట్‌కు వెళ్లండి

circa 930–586 BC

The Divided Kingdom

The kingdom splits into Israel and Judah; prophets warn of judgment as both nations slowly drift into idolatry and exile.

1,722 వచనాలు · 3 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. 1 రాజులు 22:47సుమారు క్రీ.పూ. 914

    ఆ రోజుల్లో ఎదోము దేశానికి రాజు లేడు; ఒక ప్రాంతీయ అధికారి పరిపాలించేవాడు.

  2. 1 రాజులు 22:48సుమారు క్రీ.పూ. 914

    యెహోషాపాతు బంగారం తెప్పించాలని ఓఫీరుకు వెళ్లడానికి తర్షీషు ఓడలను నిర్మించాడు కాని అవి సముద్రయానం చేయకుండానే ఎసోన్-గెబెరు దగ్గర బద్దలైపోయాయి.

  3. 1 రాజులు 22:49సుమారు క్రీ.పూ. 914

    అప్పుడు అహాబు కుమారుడైన అహజ్యా యెహోషాపాతుతో, “నా మనుష్యులను మీ మనుష్యులతో పాటు ఓడలో ప్రయాణం చెయ్యనివ్వండి” అన్నాడు కాని యెహోషాపాతు ఒప్పుకోలేదు.

  4. 1 రాజులు 22:50సుమారు క్రీ.పూ. 889

    తర్వాత యెహోషాపాతు చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేరాడు, తన తండ్రి దావీదు పట్టణంలో అతన్ని సమాధి చేశారు. అతని తర్వాత అతని కుమారుడు యెహోరాము రాజయ్యాడు.

  5. 1 రాజులు 22:51సుమారు క్రీ.పూ. 897

    యూదా రాజైన యెహోషాపాతు పరిపాలనలోని పదిహేడవ సంవత్సరంలో అహాబు కుమారుడైన అహజ్యా ఇశ్రాయేలు మీద సమరయలో రాజయ్యాడు. అతడు ఇశ్రాయేలును రెండు సంవత్సరాలు పరిపాలించాడు.

  6. 1 రాజులు 22:52సుమారు క్రీ.పూ. 897

    అతడు యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు. అతడు తన తల్లిదండ్రుల విధానాలను ఇశ్రాయేలు పాపం చేయునట్లు చేసిన నెబాతు కుమారుడైన యరొబాము జీవిత విధానాలను అనుసరించాడు.

  7. 1 రాజులు 22:53సుమారు క్రీ.పూ. 897

    అతడు బయలును సేవిస్తూ పూజిస్తూ, తన తండ్రిలా ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు కోపం రేపాడు.

  8. 2 రాజులు 1:1సుమారు క్రీ.పూ. 896

    అహాబు చనిపోయిన తర్వాత, మోయాబు ఇశ్రాయేలు మీద తిరుగుబాటు చేసింది.

  9. 2 రాజులు 1:2సుమారు క్రీ.పూ. 896

    ఆ కాలంలో ఒక రోజు అహజ్యా రాజు సమరయలో ఉన్న తన మేడగది కిటికీలో నుండి క్రిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. అతడు, “నేను ఈ గాయం నుండి కోలుకుంటానో లేదో మీరు వెళ్లి, ఎక్రోను దేవుడైన బయల్-జెబూబు దగ్గర విచారణ చేయండి” అని దూతలకు చెప్పి పంపించాడు.

  10. 2 రాజులు 1:3సుమారు క్రీ.పూ. 896

    అయితే యెహోవా దూత తిష్బీయుడైన ఏలీయాతో, “నీవు వెళ్లి, సమరయ రాజు పంపిన దూతలను కలిసి, ‘ఇశ్రాయేలులో దేవుడు లేరని ఎక్రోను దేవుడైన బయల్-జెబూబు దగ్గర విచారణ చేయడానికి వెళ్తున్నారా?’

  11. 2 రాజులు 1:4సుమారు క్రీ.పూ. 896

    అయితే యెహోవా చెప్పే మాట ఇదే: ‘నీవు పడుకున్న మంచం దిగవు, నీవు తప్పక చస్తావు!’ అని చెప్పు.” కాబట్టి ఏలీయా ఈ వార్త చెప్పడానికి వెళ్లాడు.

  12. 2 రాజులు 1:5సుమారు క్రీ.పూ. 896

    ఆ దూతలు రాజు దగ్గరకు తిరిగి వెళ్లగా అతడు వారిని, “మీరు ఎందుకు తిరిగి వచ్చారు?” అని అడిగాడు.

  13. 2 రాజులు 1:6సుమారు క్రీ.పూ. 896

    అందుకు వారు, “ఒక మనుష్యుడు మాకు ఎదురయ్యాడు” అన్నారు. “అందుకతడు మాతో ఇలా అన్నాడు, ‘మీరు వెనక్కి వెళ్లి మిమ్మల్ని పంపించిన రాజుకు ఇలా చెప్పండి, “యెహోవా ఇలా చెప్తున్నారు: ఇశ్రాయేలులో దేవుడు లేరని ఎక్రోను దేవుడైన బయల్-జెబూబు దగ్గర విచారణ చేయడానికి దూతలను పంపారా? నీవు చేసిన దాన్ని బట్టి నీవు ఎక్కిన మంచం దిగవు, నీవు తప్పక చస్తావు!” ’ ”

  14. 2 రాజులు 1:7సుమారు క్రీ.పూ. 896

    రాజు వారిని, “మిమ్మల్ని కలుసుకోడానికి వచ్చి ఈ మాటలు చెప్పిన మనిషి ఎలా ఉంటాడు?” అని అడిగాడు.

  15. 2 రాజులు 1:8సుమారు క్రీ.పూ. 896

    అందుకు వారు, “అతడు గొంగళి కప్పుకున్నాడు, నడుముకు తోలుతో చేసిన నడికట్టు కట్టుకున్నాడు” అని చెప్పారు. అప్పుడు రాజు, “అతడు తిష్బీయుడైన ఏలీయా” అని అన్నాడు.

  16. 2 రాజులు 1:9సుమారు క్రీ.పూ. 896

    అప్పుడు రాజు ఒక అధిపతిని, తనతో పాటు యాభైమంది మనుష్యులను ఏలీయా దగ్గరకు పంపాడు. ఒక కొండమీద కూర్చుని ఉన్న ఏలీయా దగ్గరకు ఆ అధిపతి ఎక్కి వెళ్లి, “దైవజనుడా, ‘క్రిందికి రా!’ అని రాజు చెప్తున్నారు” అని చెప్పాడు.

  17. 2 రాజులు 1:10సుమారు క్రీ.పూ. 896

    ఏలీయా అధిపతికి జవాబిస్తూ అన్నాడు, “నేనే దైవజనుడనైతే, ఆకాశం నుండి అగ్ని దిగివచ్చి నిన్ను నీ యాభైమంది మనుష్యులను దహించును గాక!” అన్నాడు. అప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగి ఆ అధిపతిని అతని యాభైమంది మనుష్యులను దహించివేసింది.

  18. 2 రాజులు 1:11సుమారు క్రీ.పూ. 896

    అందుకు రాజు వేరొక అధిపతిని, అతనితో పాటు యాభైమంది మనుష్యులను ఏలీయా దగ్గరకు పంపాడు. ఆ అధిపతి, “దైవజనుడా! రాజు నీతో, ‘వెంటనే క్రిందికి రా!’ అని అన్నారు” అని చెప్పాడు.

  19. 2 రాజులు 1:12సుమారు క్రీ.పూ. 896

    ఏలీయా జవాబిస్తూ, “నేనే దైవజనుడనైతే, ఆకాశం నుండి అగ్ని దిగివచ్చి నిన్ను నీ యాభైమంది మనుష్యులను దహించును గాక!” అన్నాడు. అప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగి ఆ అధిపతిని అతని యాభైమంది మనుష్యులను దహించివేసింది.

  20. 2 రాజులు 1:13సుమారు క్రీ.పూ. 896

    రాజు మూడవ అధిపతిని అతనితో పాటు యాభైమంది మనుష్యులను పంపాడు. ఈ మూడవ అధిపతి కొండెక్కి వెళ్లి, ఏలీయా ముందు మోకాళ్లమీద ఉండి, “దైవజనుడా” అని వేడుకున్నాడు, “నా ప్రాణాన్ని మీ సేవకులైన ఈ యాభైమంది ప్రాణాలను కాపాడండి!

  21. 2 రాజులు 1:14సుమారు క్రీ.పూ. 896

    చూడండి, ఆకాశం నుండి అగ్ని దిగి ముందు వచ్చిన అధిపతులిద్దరిని వారితో పాటు వచ్చిన మనుష్యులందరిని దహించివేసింది. దయచేసి నా ప్రాణాన్ని కాపాడండి” అని అతడు బ్రతిమిలాడాడు.

  22. 2 రాజులు 1:15సుమారు క్రీ.పూ. 896

    యెహోవా దూత ఏలీయాతో, “అతనితో దిగి వెళ్లు; అతనికి భయపడకు” అని చెప్పినప్పుడు ఏలీయా లేచి అతనితో కొండ దిగి రాజు దగ్గరకు వెళ్లాడు.

  23. 2 రాజులు 1:16సుమారు క్రీ.పూ. 896

    అతడు రాజుతో, “యెహోవా చెప్పే మాట ఇదే: ఇశ్రాయేలులో దేవుడు లేరని ఎక్రోను దేవుడైన బయల్-జెబూబు దగ్గర విచారణ చేయడానికి దూతలను పంపించావా? నీవు చేసిన దాన్ని బట్టి నీవు ఎక్కిన మంచం మళ్ళీ దిగవు, అక్కడే చస్తావు!” అని అన్నాడు.

  24. 2 రాజులు 1:17సుమారు క్రీ.పూ. 896

    కాబట్టి ఏలీయా చెప్పిన యెహోవా వాక్కు ప్రకారమే అతడు చనిపోయాడు. అహజ్యాకు కుమారుడు లేనందుకు, యూదాలో రాజైన యెహోషాపాతు కుమారుడైన యెహోరాము పరిపాలనలోని రెండవ సంవత్సరంలో యోరాము రాజయ్యాడు.

  25. 2 రాజులు 1:18సుమారు క్రీ.పూ. 896

    అహజ్యా పరిపాలన గురించిన ఇతర విషయాలు, అతడు చేసినవి ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడ్డాయి.