కంటెంట్‌కు వెళ్లండి

Israel

1,007 వచనాలు · 20 కుటుంబ సభ్యులు

ఇలా కూడా పిలుస్తారు: Jacob

Israel ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. తర్వాత మోషే అహరోనుతో ఇలా చెప్పాడు, “ఇశ్రాయేలీయుల సమాజమంతటికి ఇలా చెప్పు, ‘యెహోవా మీ సణుగుడు విన్నారు కాబట్టి ఆయన ఎదుటకు రండి.’ ”

  2. అహరోను ఇశ్రాయేలీయుల సమాజమంతటితో మాట్లాడుతున్నప్పుడు వారు అరణ్యం వైపు చూసినప్పుడు అక్కడ వారికి యెహోవా మహిమ మేఘంలో కనిపించింది.

  3. “నేను ఇశ్రాయేలీయుల సణుగులు విన్నాను. వారితో ఇలా చెప్పు, ‘సాయంకాలం మీరు మాంసాన్ని తింటారు, ఉదయకాలం ఆహారం తిని తృప్తిపొందుతారు. అప్పుడు మీ దేవుడనైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుంటారు.’ ”

  4. ఇశ్రాయేలీయులు వాటిని చూసి, అది ఏమిటో వారికి తెలియక, “ఇదేమిటి?” అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. మోషే వారితో, “ఇది మీరు తినడానికి యెహోవా ఇచ్చిన ఆహారము.

  5. ఇశ్రాయేలీయులు తమకు చెప్పబడినట్లుగానే చేశారు; కొందరు ఎక్కువ, కొందరు తక్కువ కూర్చుకున్నారు.

  6. ఇశ్రాయేలీయులు ఈ ఆహారానికి మన్నా అని పేరు పెట్టారు. అది తెల్లగా కొత్తిమెర గింజల్లా ఉండి దాని రుచి తేనెతో చేసిన పల్చనిరొట్టెల వలె ఉంది.

  7. ఇశ్రాయేలీయులు తాము నివసించవలసిన దేశానికి వచ్చేవరకు 40 సంవత్సరాలు మన్నాను తిన్నారు; వారు కనాను సరిహద్దులు చేరేవరకు మన్నాను తిన్నారు.

  8. ఇశ్రాయేలీయుల సమాజమంతా సీను అరణ్యం నుండి బయలుదేరి యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ప్రయాణించారు. వారు రెఫీదీములో బస చేశారు, కాని అక్కడ ప్రజలకు త్రాగడానికి నీళ్లు లేవు.

  9. యెహోవా మోషేతో, “ప్రజలకు ముందుగా వెళ్లు. నీతో ఇశ్రాయేలీయుల పెద్దలలో కొందరిని తీసుకుని నైలు నదిని కొట్టిన చేతికర్రను పట్టుకుని వెళ్లు.

  10. అక్కడ హోరేబులో బండ దగ్గర నేను నీకు ఎదురుగా నిలబడి ఉంటాను. నీవు ఆ బండను కొట్టు, ప్రజలు త్రాగడానికి ఆ బండ నుండి నీళ్లు వస్తాయి” అని చెప్పారు. కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల పెద్దలు చూస్తుండగా యెహోవా చెప్పినట్టు చేశాడు.

  11. ఇశ్రాయేలీయులు, “యెహోవా మన మధ్య ఉన్నాడా లేడా?” అని అంటూ మోషేతో జగడమాడి, యెహోవాను పరీక్షించారు కాబట్టి మోషే ఆ చోటికి మస్సా అని మెరీబా అని పేరు పెట్టాడు.

  12. రెఫీదీములో అమాలేకీయులు వచ్చి ఇశ్రాయేలీయులపై దాడి చేశారు.

  13. మోషే తన చేతులు పైకి ఎత్తినంతసేపు ఇశ్రాయేలీయులు గెలిచారు. మోషే తన చేతులు క్రిందికి దించినప్పుడు అమాలేకీయులు గెలిచారు.

  14. కొంతకాలం గడిచిన తర్వాత మిద్యాను యాజకుడు, మోషేకు మామయైన యెత్రో, దేవుడు మోషేకు అతని ప్రజలైన ఇశ్రాయేలీయులకు చేసినదంతటిని గురించి, యెహోవా ఇశ్రాయేలీయులను ఈజిప్టు నుండి బయటకు రప్పించిన సంగతి విన్నాడు.

  15. ఈజిప్టువారి చేతిలో నుండి ఇశ్రాయేలీయులను విడిపించడానికి యెహోవా చేసిన మేలులన్నిటిని విని యెత్రో ఎంతో సంతోషించాడు.

  16. అప్పుడు మోషే మామయైన యెత్రో, ఒక దహనబలిని ఇతర బలులను దేవునికి అర్పించగా, దేవుని సన్నిధిలో మోషే మామతో కలిసి భోజనం తినడానికి అహరోను, ఇశ్రాయేలీయుల పెద్దలందరితో కలిసి వచ్చాడు.

  17. అతడు ఇశ్రాయేలీయులందరిలో సమర్థవంతులైన వారిని ఎంపికచేసి వారిని ప్రజల మీద అధికారులుగా, వేయిమందికి, వందమందికి, యాభైమందికి, పదిమందికి ఒక అధికారి ప్రకారం అధికారులుగా నియమించాడు.

  18. ఇశ్రాయేలీయులు ఈజిప్టు నుండి బయటకు వచ్చిన మూడవ నెల మొదటి రోజున వారు సీనాయి అరణ్యానికి వచ్చారు.

  19. వారు రెఫీదీము నుండి బయలుదేరిన తర్వాత, వారు సీనాయి ఎడారిలో ప్రవేశించారు, అక్కడ పర్వతం ఎదురుగా ఇశ్రాయేలీయులు బసచేశారు.

  20. తర్వాత మోషే దేవుని దగ్గరకు ఎక్కి వెళ్లగా, ఆ పర్వతం నుండి యెహోవా అతన్ని పిలిచి, “యాకోబు వంశస్థులకు నీవు చెప్పాల్సింది, ఇశ్రాయేలు ప్రజలకు నీవు చెప్పాల్సింది ఇదే:

  21. మీరు నాకు ఒక యాజకుల రాజ్యంగా పరిశుద్ధ జనంగా ఉంటారు.’ నీవు ఇశ్రాయేలీయులతో చెప్పాల్సిన మాటలు ఇవే” అని చెప్పారు.

  22. తర్వాత యెహోవా మోషేతో, “ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు: ‘నేను పరలోకం నుండి మీతో మాట్లాడడం మీరే చూశారు.

  23. అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నారు, “నీవు, అహరోను, నాదాబు, అబీహు, ఇశ్రాయేలీయుల పెద్దలలో డెబ్బైమంది యెహోవా దగ్గరకు ఎక్కి వచ్చి దూరం నుండి ఆరాధించాలి.

  24. అప్పుడు మోషే యెహోవా చెప్పిన వాటన్నిటిని వ్రాశాడు. మరుసటిరోజు ఉదయానే లేచి పర్వతం క్రింద ఒక బలిపీఠాన్ని కట్టి ఇశ్రాయేలీయుల పన్నెండు గోత్రాలను బట్టి పన్నెండు స్తంభాలను నిలబెట్టాడు.

  25. అతడు ఇశ్రాయేలీయులలో యువకులను పంపగా వారు దహనబలులు అర్పించి, యెహోవాకు సమాధానబలులుగా ఎద్దులను వధించారు.