కంటెంట్‌కు వెళ్లండి

Israel

1,007 వచనాలు · 20 కుటుంబ సభ్యులు

ఇలా కూడా పిలుస్తారు: Jacob

Israel ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అప్పుడు మోషే అహరోను, నాదాబు అబీహు, ఇశ్రాయేలీయుల పెద్దలలో డెబ్బైమంది పైకి ఎక్కి వెళ్లి,

  2. ఇశ్రాయేలీయుల దేవుని చూశారు. ఆయన పాదాల క్రింద నిగనిగలాడే నీలమణులతో తయారుచేసిన దారివంటిది ఉంది; అది ఆకాశమంత నిర్మలంగా ఉంది.

  3. ఇశ్రాయేలీయుల ఈ నాయకులపై దేవుడు చేయి ఎత్తలేదు; వారు దేవున్ని చూశారు, వారు తిని త్రాగారు.

  4. ఇశ్రాయేలీయులకు యెహోవా మహిమ ఆ పర్వతం మీద దహించే అగ్నిలా కనిపించింది.

  5. “నాకు ఒక అర్పణ తీసుకురావాలి అని ఇశ్రాయేలీయులతో చెప్పు. మనసారా అర్పించే ప్రతిఒక్కరి నుండి నీవు నా కోసం కానుక తీసుకోవాలి.

  6. అక్కడ, నిబంధన మందసం పైన ఉన్న ఆ ప్రాయశ్చిత్త మూత మీదుగా రెండు కెరూబుల మధ్యలో నుండి, నేను నిన్ను కలుసుకొని ఇశ్రాయేలీయుల కోసం నా ఆజ్ఞలన్నిటిని నీకు ఇస్తాను.

  7. “వెలుగు కోసం దీపాలు వెలుగుతూ ఉండేలా దంచి తీసిన ఒలీవ నూనెను మీ దగ్గరకు తీసుకురావాలని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించు.

  8. సమావేశ గుడారంలో, నిబంధన మందసాన్ని కప్పి ఉంచే తెర బయట, అహరోను, అతని కుమారులు సాయంత్రం నుండి ఉదయం వరకు యెహోవా ఎదుట దీపాలను వెలిగించాలి. ఇది ఇశ్రాయేలీయుల రాబోయే తరాలకు మధ్య నిత్య కట్టుబాటుగా ఉంటుంది.

  9. “నాకు యాజకులుగా సేవ చేయడానికి నీ సోదరుడైన అహరోనును అతని కుమారులైన నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారులను ఇశ్రాయేలీయులలో నుండి నీ దగ్గరకు రమ్మని పిలిపించు.

  10. “రెండు లేతపచ్చ రాళ్లు తీసుకుని వాటిపై ఇశ్రాయేలు కుమారుల పేర్లు, వారు పుట్టిన క్రమం ప్రకారం ఒక రాయి మీద ఆరు పేర్లు మరొకదాని మీద మిగిలిన ఆరు పేర్లు చెక్కాలి.

  11. ముత్యాలు చెక్కేవారు ముద్రను చెక్కినట్లు ఆ రెండు లేతపచ్చ రాళ్లమీద ఇశ్రాయేలు కుమారుల పేర్లు చెక్కాలి. తర్వాత ఆ రాళ్లను బంగారు జరీ చట్రంలోకి ఎక్కించాలి.

  12. తర్వాత వాటిని ఇశ్రాయేలు కుమారుల జ్ఞాపకార్థ రాళ్లుగా ఏఫోదు భుజాలపై బిగించాలి. యెహోవా ఎదుట జ్ఞాపకంగా అహరోను తన భుజాలమీద ఆ పేర్లను మోయాలి.

  13. ఇశ్రాయేలు కుమారుల పేర్లకు ఒక్కొక్కటి చొప్పున పన్నెండు రాళ్లు ఉండాలి, ప్రతిదీ వారిలో ఒక్కొక్క పేరు చొప్పున పన్నెండు గోత్రాల పేర్లు ముద్రలా చెక్కబడి ఉండాలి.

  14. “అహరోను పరిశుద్ధ స్థలంలోకి వెళ్లినప్పుడు అతడు తన హృదయం మీద న్యాయవిధాన పతకంలోని ఇశ్రాయేలు కుమారుల పేర్లను నిత్యం యెహోవా సన్నిధిలో జ్ఞాపకంగా మోయాలి.

  15. రొమ్ము పతకంలో ఊరీము తుమ్మీము అనే వాటిని ఉంచాలి. అప్పుడు అహరోను యెహోవా సన్నిధికి వెళ్లినప్పుడు అవి అతని రొమ్ము మీద ఉంటాయి. అహరోను యెహోవా సన్నిధిలో తన హృదయం మీద ఇశ్రాయేలీయుల న్యాయవిధానాలను నిత్యం మోస్తాడు.

  16. అది అహరోను నుదిటిపై ఉంటుంది, ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠించే పవిత్ర బహుమతులలో, ఆ బహుమతులు ఏవైనా సరే, వాటిలో ఉన్న అపరాధాన్ని అతడు భరిస్తాడు, అది అహరోను నుదుటిపై నిరంతరం ఉంటుంది, తద్వారా వారు యెహోవాకు అంగీకారంగా ఉంటారు.

  17. ఇది ఇశ్రాయేలీయుల నుండి అహరోనుకు అతని కుమారులకు చెందవలసిన శాశ్వత వాటా. ఇది ఇశ్రాయేలీయులు అర్పించే సమాధానబలులలో నుండి వారు యెహోవాకు అర్పించే ప్రత్యేక కానుక.

  18. అక్కడే నేను ఇశ్రాయేలీయులను కలుసుకుంటాను; ఆ స్థలం నా మహిమచేత పవిత్రం చేయబడుతుంది.

  19. అప్పుడు నేను ఇశ్రాయేలీయుల మధ్య నివసించి వారికి దేవునిగా ఉంటాను.

  20. “నీవు ఇశ్రాయేలీయుల జనాభా లెక్కించేటప్పుడు, వారు లెక్కించబడుతున్న సమయంలో ప్రతి ఒక్కరు యెహోవాకు తమ జీవితానికి విమోచన క్రయధనం చెల్లించాలి. అలా చేస్తే నీవు వారిని లెక్కించినప్పుడు ఏ తెగులు వారి మీదికి రాదు.

  21. నీవు ఇశ్రాయేలీయుల దగ్గర నుండి ప్రాయశ్చిత్త డబ్బును తీసుకుని సమావేశ గుడారపు సేవ కోసం ఉపయోగించాలి. మీ ప్రాణాలకు ప్రాయశ్చిత్తం చేయడానికి యెహోవా ఎదుట ఇది ఇశ్రాయేలీయులకు జ్ఞాపకంగా ఉంటుంది.”

  22. నీవు ఇశ్రాయేలీయులతో, ‘ఇది రాబోయే తరాలకు పవిత్రమైన అభిషేక తైలం అవుతుంది.

  23. “నీవు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు, ‘మీరు నా సబ్బాతులు ఖచ్చితంగా ఆచరించాలి. నేను మిమ్మల్ని పరిశుద్ధపరచే యెహోవానై యున్నాను అని మీరు తెలుసుకునేలా అది రాబోయే తరాలకు నాకు మీకు మధ్య ఒక గుర్తుగా ఉంటుంది.

  24. రాబోయే తరాలకు నిత్యమైన ఒడంబడికగా ఇశ్రాయేలీయులు సబ్బాతును ఆచరించాలి.

  25. ఇది నాకు, ఇశ్రాయేలీయులకు మధ్య ఎప్పటికీ ఒక గుర్తులా ఉంటుంది, ఎందుకంటే ఆరు రోజుల్లో యెహోవా ఆకాశాలను భూమిని చేశారు, ఏడవ రోజున ఆయన విశ్రాంతి తీసుకుని సేదదీరారు.’ ”