కంటెంట్‌కు వెళ్లండి

Benjamin

157 వచనాలు · 26 కుటుంబ సభ్యులు

Benjamin ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. బెన్యామీను గోత్ర ప్రదేశాల్లో, గిబియోను, గెబా, అల్లెమెతు, అనాతోతు వాటి పచ్చిక మైదానాలతో పాటు ఇవ్వబడ్డాయి.

  2. యూదా, షిమ్యోను, బెన్యామీను గోత్రాల ప్రదేశాల్లో, పై చెప్పిన పట్టణాలు చీట్ల ద్వార వారికి కేటాయించబడ్డాయి.

  3. బెన్యామీనుకు కుమారులు ముగ్గురు: బేల, బెకెరు, యెదీయవేలు.

  4. బెన్యామీను వీరికి తండ్రి: మొదటివాడు బేల, రెండవవాడు అష్బేలు, మూడవవాడు అహరహు,

  5. ఊలాము కుమారులు పరాక్రమశాలులు, విల్లువిద్యలో ప్రవీణులు. వారికి నూటయాభైమంది కుమారులు, మనుమలు ఉన్నారు. వీరందరు బెన్యామీను వారసులు.

  6. యూదా, బెన్యామీను, ఎఫ్రాయిం మనష్షే వారిలో యెరూషలేము పట్టణంలో నివసించినవారు:

  7. బెన్యామీనీయుల నుండి: హస్సెనూయా కుమారుడైన హోదవ్యాకు పుట్టిన మెషుల్లాము కుమారుడైన సల్లు;

  8. బెన్యామీనీయుల గిబియాకు చెందిన రీబై కుమారుడు ఇత్తయి, పిరాతోనీయుడైన బెనాయా,

  9. వీరు బాణాలు ధరించి కుడిచేతితో ఎడమచేతితో బాణాలు వేయడంలో, వడిసెలతో రాళ్లు రువ్వడంలో సమర్థులు; వీరు బెన్యామీను గోత్రం నుండి వచ్చిన సౌలు బంధువులు):

  10. ఇతర బెన్యామీనీయులు, కొంతమంది యూదా వారు కూడా దావీదు ఉన్న సురక్షిత స్థలానికి వచ్చారు.

  11. సౌలు గోత్రమైన బెన్యామీనీయులలో 3,000 మంది, అప్పటివరకు వారిలో చాలామంది సౌలు ఇంటికి నమ్మకంగా ఉన్నవారు;

  12. రాజాజ్ఞ యోవాబుకు అభ్యంతరకరంగా ఉంది కాబట్టి అతడు లేవీ బెన్యామీను వారిని లెక్కలలో చేర్చలేదు.

  13. గిలాదులోని మనష్షే అర్థగోత్రం మీద: జెకర్యా కుమారుడైన ఇద్దో; బెన్యామీనీయుల మీద: అబ్నేరు కుమారుడైన యయశీయేలు;

  14. రెహబాము యెరూషలేము చేరుకొని యూదా బెన్యామీను గోత్రాల వారినందరిని, అనగా 1,80,000 మంది ఉత్తములైన సైనికులను పోగుచేసుకుని, ఇశ్రాయేలు మీద యుద్ధం చేసి, రెహబాముకు రాజ్యాన్ని తిరిగి సంపాదించాలని అనుకున్నాడు.

  15. “సొలొమోను కుమారుడును యూదా రాజైన రెహబాముతో, యూదా బెన్యామీనులో ఉన్న ఇశ్రాయేలీయులందరితో చెప్పు,

  16. జోరహు, అయ్యాలోను, హెబ్రోను. ఇవన్నీ యూదా, బెన్యామీనులో కోటగోడలు గల పట్టణాలు ఉన్నాయి.

  17. ఆ పట్టణాల్లో డాళ్లను, ఈటెలను ఉంచి వాటిని చాలా బలమైన పట్టణాలుగా చేశాడు. ఈ విధంగా యూదా, బెన్యామీను వారంతా అతని వశంలో ఉండిపోయాయి.

  18. రెహబాము వివేకంతో ప్రవర్తిస్తూ, తక్కిన తన కుమారులను యూదాలో, బెన్యామీనులో వేరు ప్రాంతాలకు, కోటగోడలు గల పట్టణాలకు పంపాడు. వారికి విస్తారమైన ధనం ఇచ్చి వారికి అనేక పెళ్ళిళ్ళు చేశాడు.

  19. ఆసాకు యూదా వారిలో 3,00,000 మంది సైనికులు ఉన్నారు. వారికి పెద్ద డాళ్లు ఈటెలు ఉన్నాయి. అతనికి బెన్యామీనీయులలో 2,80,000 మంది సైనికులున్నారు. వారికి చిన్న డాళ్లు, విల్లులు ఉన్నాయి. వీరంతా పోరాట యోధులు.

  20. అతడు ఆసాను కలుసుకోడానికి వెళ్లి అతనితో ఇలా చెప్పాడు, “ఆసా, సర్వ యూదా ప్రజలారా, బెన్యామీనీయులారా, నేను చెప్పేది వినండి. మీరు యెహోవాతో ఉంటే ఆయన మీతో ఉంటారు. మీరు ఆయనను వెదికితే, ఆయన మీకు కనిపిస్తారు. ఒకవేళ మీరు ఆయనను విడిచిపెడితే, ఆయన మిమ్మల్ని విడిచిపెడతారు.

  21. ప్రవక్తయైన ఓదేదు ప్రవచించిన ఈ మాటలు ఆసా విని ధైర్యం తెచ్చుకున్నాడు. యూదా బెన్యామీనీయుల దేశమంతటి నుండి, ఎఫ్రాయిం కొండ సీమలో తాను వశం చేసుకున్న పట్టణాల్లో ఉన్న విగ్రహాలను, అసహ్యమైన వాటన్నిటిని తీసివేశాడు. యెహోవా ఆలయ ఆవరణంలో ఉన్న బలిపీఠాలన్ని మరమ్మత్తు చేయించాడు.

  22. అతని దేవుడైన యెహోవా ఆసాకు తోడుగా ఉండడం చూసి పెద్ద సంఖ్యలో ఇశ్రాయేలు రాజ్యాన్ని విడచి అతని పక్షం చేరారు. ఆసా తన దగ్గరకు యూదా వారందరినీ బెన్యామీను వారందరినీ వారి మధ్య నివసిస్తున్న ఎఫ్రాయిం, మనష్షే, షిమ్యోను గోత్రాల వారిని సమకూర్చాడు.

  23. బెన్యామీను గోత్రంలో: ఎల్యాదా అనే యుద్ధవీరుడు ఉండేవాడు. అతనితో విల్లు, డాలు పట్టుకునేవారు 2,00,000 మంది ఉన్నారు,

  24. అమజ్యా యూదా వారిని పిలిపించి, వారి కుటుంబాల ప్రకారం వారిని యూదా, బెన్యామీను వారందరికి సహస్రాధిపతులుగాను శతాధిపతులుగాను నియమించాడు. తర్వాత అతడు ఇరవై సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సున్న వారిని లెక్కిస్తే ఈటె డాలు పట్టుకుని యుద్ధానికి వెళ్లగలవారు 3,00,000 మంది ఉన్నారు.

  25. ఇదంతా ముగిసిన తర్వాత అక్కడున్న ఇశ్రాయేలీయులు యూదా పట్టణాలకు వెళ్లి పవిత్ర రాళ్లను పగులగొట్టి, అషేరా స్తంభాలను పడగొట్టారు. వారు యూదా, బెన్యామీను, ఎఫ్రాయిం, మనష్షేలలో ఉన్న క్షేత్రాలను బలిపీఠాలను నాశనం చేశారు. వాటన్నిటినీ నాశనం చేసిన తర్వాత, ఇశ్రాయేలీయులు తమ సొంత పట్టణాలకు వారి సొంత స్వాస్థ్యాలకు తిరిగి వచ్చారు.