కంటెంట్‌కు వెళ్లండి

Benjamin

157 వచనాలు · 26 కుటుంబ సభ్యులు

Benjamin ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. వారు ప్రధాన యాజకుడైన హిల్కీయా దగ్గరకు వెళ్లి, అంతకుముందు దేవుని ఆలయానికి తెచ్చిన డబ్బును అతనికి అప్పగించారు. ఆ డబ్బును మనష్షేవారు, ఎఫ్రాయిమీయుల, ఇశ్రాయేలు ప్రజల్లో మిగిలిన వారందరు, యూదా వారు, బెన్యామీనీయులు, యెరూషలేము నగరవాసులు ఇస్తూ ఉంటే, ద్వారపాలకులైన లేవీయులు దానిని జమచేశారు.

  2. అప్పుడు యెరూషలేములో, బెన్యామీనులో ఉన్నవారందరిని ఆ నిబంధనకి సమ్మతించేటట్టు చేశాడు. యెరూషలేమువారు తమ పూర్వికుల దేవుని నిబంధన ప్రకారం అలా చేశారు.

  3. అప్పుడు యూదా, బెన్యామీనీయుల కుటుంబ పెద్దలు, యాజకులు, లేవీయులు, దేవునిచే ప్రేరేపించబడిన ప్రతి ఒక్కరు యెరూషలేములో యెహోవా మందిరాన్ని కట్టేందుకు వెళ్లడానికి సిద్ధపడ్డారు.

  4. చెర నుండి వచ్చినవారు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందిరాన్ని కడుతున్నారని యూదా, బెన్యామీనీయుల శత్రువులు విని,

  5. మూడు రోజుల్లో, యూదా, బెన్యామీను పురుషులందరు యెరూషలేములో సమకూడారు. తొమ్మిదవ నెల ఇరవయ్యవ రోజున ప్రజలందరు దేవుని మందిరం ఎదురుగా ఉన్న కూడలిలో కూర్చుని భారీ వర్షంలో తడుస్తూ ఈ విషయాన్ని బట్టి ఎంతో దిగులుతో ఉన్నారు.

  6. యూదా, బెన్యామీను వారిలో మరికొంతమంది యెరూషలేములో నివసించారు): యూదా వారసుల నుండి: అతాయా, ఇతడు పెరెసు వారసుడైన మహలలేలు కుమారుడైన షెఫట్యాకు పుట్టిన అమర్యా కుమారుడైన జెకర్యాకు పుట్టిన ఉజ్జియా కుమారుడు;

  7. బెన్యామీను వారసుల నుండి: సల్లు, ఇతడు యెషయా కుమారుడైన ఇతీయేలుకు పుట్టిన మయశేయా కుమారుడైన కోలాయాకు పుట్టిన పెదాయా కుమారుడైన యోవేదుకు పుట్టిన మెషుల్లాము కుమారుడు,

  8. గెబాలో స్థిరపడిన బెన్యామీనీయులు మిక్మషులో, అయ్యాలో, బేతేలు వాటి చుట్టుప్రక్కల గ్రామాల్లో,

  9. యూదాలోని లేవీయులలో కొన్ని గుంపులు బెన్యామీనులో నివసించారు.

  10. చిన్నదైన బెన్యామీను గోత్రం వారిని నడిపిస్తుంది, యూదా నాయకుల గొప్ప సమూహం, జెబూలూను నఫ్తాలి నాయకులు కూడా ఉన్నారు.

  11. ఎఫ్రాయిం, బెన్యామీను, మనష్షే గోత్రాల ఎదుట ప్రకాశించండి. మీ పరాక్రమాన్ని చూపించండి; వచ్చి మమ్మల్ని రక్షించండి.

  12. బెన్యామీను దేశంలో అనాతోతు అనే పట్టణంలో ఉన్న యాజకులలో ఒకడైన హిల్కీయా కుమారుడైన యిర్మీయా మాటలు.

  13. “బెన్యామీను ప్రజలారా, క్షేమం కోసం పారిపోండి! యెరూషలేము నుండి పారిపోండి! తెకోవాలో బూరధ్వని చేయండి! బేత్-హక్కెరెము మీద సంకేతం కోసం ధ్వజం నిలబెట్టండి! ఎందుకంటే ఉత్తర దిక్కునుండి విపత్తు వస్తుంది, భయంకరమైన విధ్వంసం కూడా వస్తుంది.

  14. యూదా పట్టణాల నుండి, యెరూషలేము చుట్టుప్రక్కల గ్రామాల నుండి, బెన్యామీను ప్రాంతం నుండి, పడమటి కొండ దిగువ ప్రదేశాల నుండి, కొండ ప్రదేశాల నుండి, దక్షిణ వైపు నుండి ప్రజలు దహనబలులను, బలులను, భోజనార్పణలను, ధూపద్రవ్యాలను, కృతజ్ఞతార్పణలను యెహోవా ఆలయానికి తీసుకువస్తారు.

  15. అతడు యిర్మీయా ప్రవక్తను కొట్టించి, యెహోవా మందిరం దగ్గర బెన్యామీను ఎగువ ద్వారం దగ్గర ఉన్న కొయ్యకు బంధించాడు.

  16. “అప్పుడు, యెహోవా చెప్పినట్లే, నా బంధువైన హనామేలు కావలివారి ప్రాంగణంలో నా దగ్గరకు వచ్చి, ‘బెన్యామీను ప్రాంతంలోని అనాతోతులో ఉన్న నా పొలాన్ని కొను. దానిని విడిపించి, స్వాధీనపరచుకునే హక్కు నీకుంది కాబట్టి, నీ కోసం దాన్ని కొనుక్కో’ అని అన్నాడు. “ఇది యెహోవా వాక్కు అని నాకు తెలుసు;

  17. బెన్యామీను ప్రాంతాల్లోనూ, యెరూషలేము చుట్టుప్రక్కల గ్రామాల్లోనూ, యూదా పట్టణాల్లోనూ, కొండ సీమల్లోనూ, పడమటి దిగువ కొండ ప్రదేశాల్లోనూ, దక్షిణ ప్రాంతాల్లోనూ పొలాలు వెండి ఇచ్చి కొంటారు, ఒప్పందాలపై సంతకాలు చేస్తారు, కొనుగోలు పత్రాలపై ముద్రలు వేస్తారు, ఎందుకంటే నేను వారిని చెర నుండి తిరిగి రప్పిస్తాను, అని యెహోవా ప్రకటిస్తున్నారు.”

  18. కొండ ప్రాంత పట్టణాల్లో, పడమటి పర్వత ప్రాంతాల్లో, దక్షిణ ప్రాంతంలో, బెన్యామీను ప్రాంతంలో, యెరూషలేము చుట్టూ ఉన్న గ్రామాల్లో, యూదా పట్టణాల్లో మందలు లెక్కించే వారిచేత లెక్కించబడతాయి’ అని యెహోవా చెప్తున్నారు.

  19. యిర్మీయా బెన్యామీను ప్రాంతంలో తన ప్రజల ఆస్తిలో తన వాటాను పొందేందుకు యెరూషలేమును విడిచి అక్కడి వెళ్లడానికి బయలుదేరాడు.

  20. అయితే అతడు బెన్యామీను ద్వారం దగ్గరకు చేరుకున్నప్పుడు, హనన్యా కుమారుడైన షెలెమ్యా కుమారుడు ఇరియా అనే కావలివారి దళాధిపతి ప్రవక్తయైన యిర్మీయాను పట్టుకుని, “నీవు బబులోనీయులతో చేరిపోవడానికి వెళ్తున్నావు!” అన్నాడు.

  21. అయితే రాజభవనంలో అధికారిగా ఉన్న ఎబెద్-మెలెకు అనే ఒక కూషీయుడు యిర్మీయాను నీటి గోతిలో వేశారు అని విన్నాడు. ఆ సమయంలో రాజు బెన్యామీను ద్వారం దగ్గర కూర్చుని ఉన్నాడు.

  22. కాబట్టి లేవీయుల స్వాస్థ్యం, పట్టణం యొక్క స్వాస్థ్యం యువరాజుకు చెందిన ప్రాంతం మధ్యలో ఉంటుంది. యువరాజుకు చెందిన ప్రాంతం యూదా సరిహద్దుకు బెన్యామీను సరిహద్దుకు మధ్య ఉంటుంది.

  23. “తక్కిన గోత్రాల వివరాలు: “బెన్యామీను వారికి ఒక భాగము. అది తూర్పు సరిహద్దు నుండి పడమటి సరిహద్దు వరకు ఉంటుంది.

  24. షిమ్యోను వారికి ఒక భాగము. తూర్పు నుండి పడమటి వరకు అది బెన్యామీను వారి భూమిని ఆనుకుని ఉంటుంది.

  25. తూర్పు దిక్కున 4,500 మూరల పొడవుతో మూడు ద్వారాలు: యోసేపు ద్వారం, బెన్యామీను ద్వారం, దాను ద్వారము.