కంటెంట్‌కు వెళ్లండి

Warfare of Saints గురించి బైబిల్ వచనాలు

107 వచనాలు · 73 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. “నేను ఈ ప్రజలను పాతాళం శక్తి నుండి విడిపిస్తాను; మరణం నుండి వారిని విమోచిస్తాను. ఓ మరణమా, నీవు కలిగించే తెగుళ్ళు ఎక్కడ? ఓ పాతాళమా, నీవు కలిగించే నాశనం ఎక్కడ? “అతడు తన సోదరుల మధ్య ఎదుగుతున్నా సరే,

  2. కుమారుడు తండ్రిని నిర్లక్ష్యం చేస్తాడు, తల్లి మీదికి కుమార్తె, అత్త మీదికి తన కోడలు తిరగబడతారు, సొంత ఇంటివారే వారికి శత్రువులవుతారు.

  3. నా విరోధీ, నా మీద అతిశయించకు, నేను పడిపోయినా తిరిగి లేస్తాను. నేను చీకటిలో కూర్చున్నా, యెహోవా నాకు వెలుగై ఉంటారు.

  4. వారందరు కలిసి యుద్ధంలోని వీరుల్లా వీధుల బురదలో తమ శత్రువులను త్రొక్కుతారు. యెహోవా వారికి తోడుగా ఉన్నారు కాబట్టి వారు పోరాడతారు, శత్రువుల గుర్రపురౌతులను సిగ్గుపడేలా చేస్తారు.

  5. ఎలాగంటే, “ ‘తన తండ్రికి వ్యతిరేకంగా కుమారుడు తన తల్లికి వ్యతిరేకంగా కుమార్తె, తన అత్తకు వ్యతిరేకంగా కోడలు తిరగబడతారు.

  6. ఒక మనుష్యుని శత్రువులు తన సొంత ఇంటివారే.’

  7. “ఈ లోకంలో మీకు శ్రమలు కలుగుతాయి. అయినా ధైర్యం తెచ్చుకోండి! ఎందుకంటే నేను లోకాన్ని జయించాను. నాలో మీకు సమాధానం ఉండాలని ఈ సంగతులను మీకు చెప్పాను” అన్నారు.

  8. కాని మరొక నియమం నాలో ఉన్నట్లు నాకు కనబడుతుంది. అది నా మనస్సులోని నియమంతో పోరాడుతూ నాలో పని చేస్తున్న పాపనియమానికి నన్ను బందీగా చేస్తుంది.

  9. నేను ఎంత దౌర్భాగ్యుడిని! మరణానికి బందీగా ఉన్న నా శరీరం నుండి నన్ను ఎవరు రక్షించగలరు?

  10. మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా నాకు విడుదలను ఇచ్చే దేవునికి వందనాలు! అయితే నా మనస్సులో నేను దేవుని ధర్మశాస్త్రానికి దాసుడను, కాని నాకున్న పాప స్వభావంలో నేను పాపనియమానికి దాసుడను.

  11. అయినా మనల్ని ప్రేమించినవాని ద్వారా మనం అన్ని విషయాల్లో జయించినవారి కన్నా అధికంగా ఉన్నాము.

  12. రాత్రి చాలా వరకు గడిచిపోయింది; పగలు దాదాపు వచ్చేసింది. కాబట్టి మనం చీకటి క్రియలు విడిచిపెడదాం, వెలుగు కవచాన్ని ధరించుకుందాము.

  13. సమాధానకర్తయైన దేవుడు త్వరలో తన పాదాల క్రింద సాతానును నలిపివేస్తారు. మన ప్రభువైన యేసు కృప మీతో ఉండును గాక.

  14. ఆటలలో పాల్గొనే ప్రతివారు కఠినమైన శిక్షణ తీసుకుంటారు. వారు నిత్యం ఉండని కిరీటాన్ని పొందడానికి అంత కష్టపడతారు, కానీ మనమైతే నిత్యం నిలిచే కిరీటం పొందడం కోసం కష్టపడతాం.

  15. కాబట్టి, గమ్యంలేని వానిలా నేను పరుగెత్తడం లేదు; గాలిని కొట్టువానిలా నేను పోరాడడంలేదు.

  16. అయితే, ఇతరులకు సువార్త ప్రకటించిన తర్వాత బహుమానం పొందే అర్హత నేను కోల్పోకుండా ఉండడానికి నా శరీరాన్ని నలగ్గొట్టి, దాన్ని లోబరచుకొంటున్నాను.

  17. చివరిగా నశించే శత్రువు మరణం.

  18. “దేవుడు సమస్తాన్ని క్రీస్తు పాదాల క్రింద ఉంచారు” అని చెప్పినప్పుడు ఆయన క్రింద సమస్తాన్ని ఇచ్చిన దేవుడు మినహా మిగిలిన వాటన్నిటిని ఆయన క్రింద ఉంచారని అర్థం.

  19. నశించిపోయేది శాశ్వతమైన దాన్ని, మరణించేది మరణంలేని దాన్ని ధరించినపుడు, “విజయం మరణాన్ని మ్రింగివేసింది” అని వ్రాయబడిన వాక్యం నిజమవుతుంది.

  20. “ఓ మరణమా, నీ విజయం ఎక్కడ? ఓ మరణమా, నీ ముల్లు ఎక్కడ?”

  21. అయితే దేవునికి కృతజ్ఞతలు! మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ఆయన మనకు విజయాన్ని ఇచ్చారు.

  22. మెలకువగా ఉండండి; విశ్వాసంలో నిలకడగా ఉండండి; ధైర్యం కలిగి బలవంతులై ఉండండి.

  23. సాతాను మనపై ఆధిక్యాన్ని పొందకుండా అలా చేశాను, సాతాను తంత్రాలు మనకు తెలియనివి కావు.

  24. కాబట్టి ఆయన మా ద్వారా ప్రతి స్థలంలో క్రీస్తును గురించిన జ్ఞానపు సువాసన వ్యాపింపచేస్తూ, ఆయనలో మమ్మల్ని ఎల్లప్పుడు విజయోత్సాహంతో ముందుకు నడిపిస్తున్న దేవునికి కృతజ్ఞతలు.

  25. సత్యంగా మాట్లాడంలో దేవుని శక్తిలో; కుడిచేతిలో ఎడమ చేతిలో నీతి అనే ఆయుధాలను కలిగి;