కంటెంట్‌కు వెళ్లండి

Warfare of Saints గురించి బైబిల్ వచనాలు

107 వచనాలు · 73 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. కాబట్టి, దేవునిచే ఎన్నుకోబడినవారు కూడా నిత్యమహిమతో యేసు క్రీస్తులో ఉన్న రక్షణను పొందాలని నేను ఈ శ్రమలన్నింటిని సహిస్తున్నాను.

  2. కాని నా ప్రభువు నాకు తోడుగా నిలిచి నన్ను బలపరిచారు ఎందుకంటే, నా ద్వారా సువార్త పూర్తిగా ప్రకటించబడి యూదేతరులంతా దానిని వినడానికి దేవుడు నన్ను సింహం నోటి నుండి విడిపించారు.

  3. నాకు కలిగే ప్రతి కీడు నుండి ప్రభువు నన్ను కాపాడి తన పరలోక రాజ్యంలోనికి క్షేమంగా చేర్చుకుంటారు. ఆయనకే మహిమ నిరంతరం కలుగును గాక ఆమేన్.

  4. ఎవరి కోసం, ఎవరి ద్వారా సమస్తం కలిగిందో ఆ దేవునికి, అనేకమంది కుమారులను కుమార్తెలను మహిమలో తీసుకురావడంలో, వారి రక్షణకు మార్గదర్శి యైన వానిని శ్రమల ద్వారా పరిపూర్ణునిగా చేయడం తగినదిగా ఉండింది.

  5. ఈ పిల్లలు రక్తమాంసాలు కలిగి ఉన్నవారు కాబట్టి, తన మరణం ద్వారా మరణంపై అధికారం కలవాడైన అపవాది అధికారాన్ని విరుగగొట్టడానికి,

  6. మరణ భయంతో దాస్యంలో ఉంచబడినవారిని విడిపించడానికి, ఆయన కూడా మానవరూపంలో పాలుపంచుకున్నాడు.

  7. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు కాబట్టి, మనం గొప్పగా చెప్పుకొనే నిరీక్షణను గట్టిగా పట్టుకుందాము.

  8. వారు విశ్వాసం ద్వారానే రాజ్యాలను జయించారు, న్యాయాన్ని జరిగించారు, వాగ్దానఫలాన్ని పొందారు, సింహాల నోళ్లను మూయించారు,

  9. తీవ్రమైన అగ్ని జ్వాలలను చల్లార్చారు, ఖడ్గపు అంచు నుండి తప్పించుకున్నారు; వారికి వారి బలహీనతే బలంగా మార్చబడింది; వారు యుద్ధాలలో మహాశక్తివంతులై శత్రు సైన్యాలను ఓడించారు.

  10. కొందరు స్త్రీలు చనిపోయిన తమ వారిని తిరిగి సజీవులుగా పొందారు. హింసించబడినవారు ఇంకా కొందరు దేవునితో శ్రేష్ఠమైన పునరుత్థానాన్ని పొందడానికి ఆ హింసను తప్పించుకోలేదు.

  11. కొందరు ఎగతాళిచేయబడి కొరడా దెబ్బలు తిన్నారు, సంకెళ్ళతో బంధించబడ్డారు.

  12. వారు చంపబడటానికి రాళ్లతో కొట్టబడ్డారు, రంపాలచేత భాగాలుగా కోయబడ్డారు, కత్తితో చంపబడ్డారు. గొర్రెల మేకల చర్మాలను కప్పుకుని, శ్రమలు హింసలు పొందుతూ దరిద్రుల్లా బాధలు అనుభవించారు.

  13. కాబట్టి మీరు దేవునికి లోబడి ఉండండి. అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ నుండి పారిపోతాడు.

  14. ప్రియ మిత్రులారా, ఈ లోకంలో విదేశీయులుగా, ప్రవాసులుగా ఉన్న మీకు నేను మనవి చేసుకుంటున్నాను. శారీరక కోరికలు ఎప్పుడు ఆత్మతో పోరాడుతుంటాయి. కాబట్టి వాటికి విడిచిపెట్టండి.

  15. మెలకువతో జాగరూకులై ఉండండి. మీ శత్రువైన సాతాను గర్జించు సింహంలా తిరుగుతూ ఎవరినైన మ్రింగివేయాలని చూస్తున్నాడు.

  16. దృఢ విశ్వాసులై వానిని ఎదిరించండి. ప్రపంచమంతా ఉన్న విశ్వాసుల కుటుంబం ఇలాంటి బాధలనే అనుభవిస్తుందని మీకు తెలుసు.

  17. ప్రియ బిడ్డలారా, మీకు తండ్రి తెలుసు, కాబట్టి నేను మీకు వ్రాస్తున్నాను. తండ్రులారా, ఆది నుండి ఉన్నవాడు మీకు తెలుసు, కాబట్టి నేను మీకు వ్రాస్తున్నాను. యవ్వనస్థులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీలో నివసిస్తున్నది; మీరు దుష్టుని జయించారు; కాబట్టి నేను మీకు వ్రాస్తున్నాను.

  18. ప్రియ బిడ్డలారా, మీరు దేవునికి చెందినవారు; మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కాబట్టి మీరు వారిని జయించారు.

  19. దేవుని మూలంగా పుట్టిన ప్రతి ఒక్కరు లోకాన్ని జయిస్తారు. లోకాన్ని జయించిన విజయం మన విశ్వాసమే.

  20. లోకాన్ని ఎవరు జయించగలరు? యేసు దేవుని కుమారుడని నమ్మినవారు మాత్రమే కదా.

  21. ప్రియ మిత్రులారా, మనందరం పాలుపంచుకొనే రక్షణ గురించి మీకు వ్రాయాలని చాలా ఆశించాను, కాని దేవుని పరిశుద్ధ ప్రజలకు ఒక్కసారే ఇవ్వబడిన విశ్వాసం కోసం మీరు పోరాడుతూనే ఉండాలని, మిమ్మల్ని ప్రోత్సహించడానికి, వేడుకోడానికి నేను వ్రాస్తున్నాను.

  22. ఆత్మ సంఘాలతో చెప్పే మాటలను చెవులుగలవారు వినాలి! వీటిని జయించినవారికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలాలను తినడానికి అనుమతిస్తాను.

  23. ఆత్మ సంఘాలతో చెప్పే మాటలను చెవులుగలవారు వినాలి! జయించినవారికి రెండవ మరణం హాని చేయదు.

  24. ఆత్మ సంఘాలతో చెప్పే మాటలను చెవులుగలవారు వినాలి! వీటిని జయించినవారికి నేను దాచి ఉంచిన మన్నాను ఇస్తాను. నేను వారికి తెల్లని రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరును ఇస్తాను. దాన్ని పొందినవారికి మాత్రమే ఆ పేరు తెలుస్తుంది.

  25. అంతం వరకు నా చిత్తాన్ని నెరవేరుస్తూ జయించినవారికి నా తండ్రి నుండి నేను అధికారం పొందినట్లే రాజ్యాల మీద వారికి అధికారం ఇస్తాను.