కంటెంట్‌కు వెళ్లండి

Travellers గురించి బైబిల్ వచనాలు

110 వచనాలు · 39 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అతడు సుక్కోతు వారితో, “నా సైనికులకు కొంత ఆహారం ఇవ్వండి; వారు అలసిపోయి ఉన్నారు, నేను ఇంకా మిద్యాను రాజులైన జెబహును, సల్మున్నాను తరుముతున్నాను” అన్నాడు.

  2. అక్కడినుండి అతడు పెనూయేలుకు వెళ్లి వారిని కూడా ఆహారం కోసం అలాగే అడిగినప్పుడు, వారు కూడా సుక్కోతు వారిలా జవాబిచ్చారు,

  3. నాలుగవ రోజు వారు ప్రొద్దున్నే లేచి లేవీయుడు వెళ్లడానికి సిద్ధపడ్డాడు కాని ఆమె తండ్రి తన అల్లుడితో, “భోజనం చేసి సేదతీరిన తర్వాత వెళ్లవచ్చు” అన్నాడు.

  4. ఆ వృద్ధుడు ఊరి మధ్యలో ప్రయాణికున్ని చూసి, “మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడ నుండి వస్తున్నారు?” అని అడిగాడు.

  5. మా గాడిదలకు గడ్డి, ఎండుగడ్డి మేత మా దగ్గర ఉంది. నాకు మీ దాసికి, మాతో ఉన్న యువకుడికి రొట్టె, ద్రాక్షరసం కూడా ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో మాకెలాంటి ఇబ్బంది లేదు” అన్నాడు.

  6. ఆ వృద్ధుడు, “మీకు క్షేమం కలుగును గాక! మీరు మా ఇంటికి రండి, మీకు అవసరమైంది నేను చూసుకుంటాను. ఇలా రాత్రివేళ వీధిలో మాత్రం గడపకండి” అని అన్నాడు.

  7. అతడు వారిని ఇంటికి తీసుకెళ్లి తమ గాడిదలకు మేత వేశాడు. వారు తమ కాళ్లు కడుక్కున్న తర్వాత భోజనపానీయాలు పుచ్చుకున్నారు.

  8. అప్పుడు ఆ ఇంటి యజమాని బయటకు వెళ్లి వారితో అన్నాడు, “అలా అనవద్దు. నా సోదరులారా, అంత నీచానికి దిగజారకండి, ఈ మనిషి నా అతిథి కాబట్టి ఇంత అవమానకరమైన పని చేయవద్దు.

  9. నాబాలు గొర్రెల బొచ్చు కత్తిరిస్తున్నాడని అరణ్యంలో ఉన్న దావీదు విని,

  10. దావీదు తన పనివారిలో పదిమంది యువకులను పిలిచి వారితో ఇలా చెప్పాడు, “మీరు కర్మెలులో ఉన్న నాబాలు దగ్గరకు వెళ్లి నేను అడిగినట్టుగా క్షేమసమాచారం అడగండి.

  11. అతనితో ఇలా చెప్పండి, ‘నీకు దీర్ఘాయువు కలుగును గాక! నీకు నీ ఇంటివారికి నీకు చెందినవాటన్నిటికి క్షేమం కలుగును గాక!

  12. “ ‘ఇది గొర్రెల బొచ్చు కత్తిరించే సమయమని నేను విన్నాను. నీ గొర్రెల కాపరులు మాతో ఉన్నప్పుడు మేము వారికి ఏ హాని చేయలేదు. కర్మెలులో ఉన్నంత కాలం వారు ఏదీ పోగొట్టుకోలేదు.

  13. నీ సేవకులను అడిగితే వారు నీకు చెప్తారు. పండుగ సమయంలో మేము వచ్చాం, నా మనుష్యుల మీద దయ చూపించు. దయచేసి నీకు ఏది ఇవ్వాలనిపిస్తే అదే నీ సేవకులకు నీ కుమారుడైన దావీదుకు ఇవ్వు.’ ”

  14. దావీదు సేవకులు వచ్చి వారు నాబాలుకు దావీదు పంపిన వర్తమానాన్ని చెప్పి వేచి ఉన్నారు.

  15. నాబాలు దావీదు సేవకులతో, “దావీదు ఎవడు? యెష్షయి కుమారుడెవడు? ఈ రోజుల్లో చాలామంది తమ యజమానులను విడిచిపెట్టి వెళ్లి పోతున్నారు.

  16. నా ఆహారాన్ని నీటిని, నా గొర్రెల బొచ్చు కత్తిరిస్తున్న వారి కోసం నేను సిద్ధం చేసిన మాంసాన్ని ఎక్కడి నుండి వచ్చారో నాకు తెలియని వారికి నేను ఎందుకు ఇవ్వాలి?” అన్నాడు.

  17. దావీదు సేవకులు వచ్చిన దారినే తిరిగివెళ్లి నాబాలు చెప్పిన మాటలన్నీ అతనికి చెప్పారు.

  18. అప్పుడు దావీదు వారితో, “మీరందరు మీ ఖడ్గాలు ధరించుకోండి” అని చెప్పగా వారు తమ ఖడ్గాలు ధరించుకున్నారు. దావీదు కూడా కత్తి ధరించాడు. దావీదుతో పాటు దాదాపు నాలుగువందలమంది పురుషులు వెళ్లగా రెండువందలమంది సామాగ్రితో ఉండిపోయారు.

  19. మీ సేవకురాలినైన నేను నా ప్రభువైన మీకు తెచ్చిన ఈ కానుకను మీ వెంట ఉన్న మీ సేవకులకు ఇవ్వనివ్వండి.

  20. అలసిపోయి దావీదును వెంబడించలేక బెసోరు వాగు దగ్గర ఆగిపోయిన ఆ రెండువందలమంది దగ్గరకు దావీదు రాగా వారు దావీదును అతనితో ఉన్న మనుష్యులను కలుసుకోడానికి వచ్చారు. దావీదు వారి దగ్గరకు వచ్చి వారి క్షేమాన్ని అడిగి తెలుసుకున్నాడు.

  21. గిలాదీయుడైన బర్జిల్లయి కూడా రాజుతో పాటు యొర్దాను దాటి, నది అవతలి నుండి అతన్ని సాగనంపడానికి రోగెలీము నుండి వచ్చాడు.

  22. ఆమె ఒంటెల మీద సుగంధ ద్రవ్యాలను, చాలా బంగారం, వెలగల రాళ్లు ఎక్కించి, గొప్ప పరివారంతో బయలుదేరి యెరూషలేముకు చేరింది. ఆమె సొలొమోను దగ్గరకు వచ్చి, తన మనస్సులో ఉన్నదంతా చెప్పింది.

  23. యెహోవా హస్తం ఏలీయాను బలపరచగా అతడు తన నడుము బిగించుకుని, అహాబు కంటే ముందే పరుగెత్తుకొని వెళ్లి యెజ్రెయేలు చేరుకున్నాడు.

  24. కాబట్టి ఇశ్రాయేలు రాజు, యూదారాజు, ఎదోము రాజు కలిసి బయలుదేరి ఏడు రోజులు చుట్టూ తిరిగి ప్రయాణించిన తర్వాత సైన్యానికి పశువులకు వారి దగ్గర నీళ్లు మిగల్లేదు.

  25. ఆమె గాడిద మీద జీను వేసుకుని పనివానితో, “త్వరగా నడిపించు; నేను చెప్పే వరకు నెమ్మదిగా వెళ్లకు” అని చెప్పింది.