Travellers గురించి బైబిల్ వచనాలు: Often supplied them with provision
Often supplied them with provision గురించి వచనాలు
మర్నాడు వేకువజామున అబ్రాహాము లేచి కొంత ఆహారం, నీళ్ల తిత్తి హాగరుకు ఇచ్చాడు. వాటిని ఆమె భుజం మీద పెట్టి, ఆమెను తన కుమారునితో పంపివేశాడు. ఆమె వెళ్లి బెయేర్షేబ ఎడారిలో తిరుగుతూ ఉంది.
యోసేపు తన ఇంటి గృహనిర్వాహకుని పిలిచి, “ఈ మనుష్యులు మోసికొని వెళ్లగలిగినంత ఆహారంతో వారి సంచులు నింపి ఎవరి గోనెసంచిలో వారు రూకలుగా తెచ్చిన వెండిని కూడా పెట్టు.
అయితే, యిర్మీయా బయలుదేరక ముందు, నెబూజరదాను, “బబులోను రాజు యూదా పట్టణాలపై నియమించిన షాఫాను మనుమడు, అహీకాము కుమారుడైన గెదల్యా దగ్గరకు తిరిగివెళ్లి, అతనితో పాటు ప్రజలమధ్య నివసించు, లేదా ఎక్కడికి వెళ్లడం సరియైనది అని నీకు అనిపిస్తే అక్కడికి వెళ్లు” అని చెప్పాడు. తర్వాత దళాధిపతి అతనికి ఆహారపదార్థాలు బహుమానం ఇచ్చి అతన్ని పంపించాడు.