Skip to content

Threshing గురించి బైబిల్ వచనాలు

58 వచనాలు · 31 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అదే రోజు గాదు దావీదు దగ్గరకు వచ్చి, “యెబూసీయుడైన అరౌనా నూర్పిడి కళ్ళంలో యెహోవాకు బలిపీఠం కట్టించు” అని చెప్పాడు.

  2. గాదు ద్వారా యెహోవా ఇచ్చిన ఆజ్ఞమేరకు దావీదు బయలుదేరి వెళ్లాడు.

  3. రాజు, అతని అధికారులు తన వైపు రావడం చూసిన అరౌనా రాజుకు ఎదురు వెళ్లి తన తల నేలకు వంచి రాజుకు నమస్కారం చేశాడు.

  4. అరౌనా, “నా ప్రభువైన రాజా, తన సేవకుని దగ్గరకు రావడానికి కారణం ఏమిటి?” అని అడిగాడు. అందుకు దావీదు, “ప్రజల మీద ఉన్న తెగులు ఆగిపోవడానికి యెహోవాకు బలిపీఠం కట్టడానికి, నీ నూర్పిడి కళ్ళం కొనాలని వచ్చాను” అని అన్నాడు.

  5. అందుకు అరౌనా దావీదుతో, “నా ప్రభువైన రాజు తనకు కావల్సింది తీసుకుని బలి అర్పించవచ్చు. దహనబలి కోసం ఇక్కడ ఎద్దులు ఉన్నాయి. కట్టెలకు నూర్చే కర్రలు ఎద్దు కాడెలు ఉన్నాయి.

  6. రాజా, ఇవన్నీ అరౌనా అనే నేను రాజుకు ఇస్తున్నాను” అని చెప్పి, “నీ దేవుడైన యెహోవా నీ ప్రార్థన అంగీకరించును గాక” అని అన్నాడు.

  7. అయితే రాజు అరౌనాతో, “లేదు, నీకు వెల చెల్లించి కొంటాను. ఉచితంగా తీసుకున్న దానిని నేను నా దేవుడైన యెహోవాకు దహనబలి అర్పించను” అన్నాడు. కాబట్టి దావీదు ఆ నూర్పిడి కళ్ళాన్ని ఎడ్లను యాభై షెకెళ్ళ వెండికి కొన్నాడు.

  8. దావీదు అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి దహనబలులు సమాధానబలులు అర్పించాడు. అప్పుడు యెహోవా దేశం కోసం అతడు చేసిన ప్రార్థన అంగీకరించగా ఇశ్రాయేలీయులకు వచ్చిన తెగులు తొలగిపోయింది.

  9. రాజు జవాబిస్తూ, “యెహోవా నీకు సహాయం చేయకపోతే, నేనెక్కడి నుండి సహాయం చేసేది? నూర్పిడి కళ్ళంలో నుంచా? లేదా ద్రాక్ష గానుగ నుంచా?” అన్నాడు.

  10. యెహోయాహాజు సైన్యంలో మిగిలింది యాభై రౌతులు, పది రథాలు, పదివేలమంది కాల్బలం మాత్రమే. ఎందుకంటే అరాము రాజు మిగతా వారిని కళ్ళం దగ్గర దుళ్ళగొట్టిన దుమ్ములా చేశాడు.

  11. అప్పుడు యెహోవా దూత యెబూసీయుడైన ఒర్నాను నూర్పిడి కళ్ళంలో యెహోవాకు బలిపీఠం కట్టించాలని దావీదుకు చెప్పమని గాదుకు ఆజ్ఞాపించాడు.

  12. ఒర్నాను గోధుమలు నూరుస్తున్నప్పుడు, అతడు వెనుకకు తిరిగి ఆ దేవదూతను చూసి అతడు, అతనితో ఉన్న అతని నలుగురు కుమారులు దాక్కున్నారు.

  13. ఆ తర్వాత సొలొమోను యెరూషలేములో ఉన్న మోరీయా కొండమీద యెహోవా మందిరాన్ని కట్టడం ఆరంభించాడు. అక్కడే యెహోవా సొలొమోను తండ్రియైన దావీదుకు ప్రత్యక్షమయ్యాడు. సొలొమోను మందిరం కట్టించిన స్థలం అంతకుముందు యెబూసీయుడైన ఒర్నాను నూర్పిడి కళ్ళం ఉంది. దావీదు దానిని సిద్ధం చేశాడు.

  14. నూర్పిడి కళ్ళాల్లో నలిగిపోతున్న నా ప్రజలారా! సైన్యాల యెహోవా నుండి ఇశ్రాయేలు దేవుని నుండి నేను విన్నది నీకు చెప్తాను.

  15. యెహోవా చేయి ఈ పర్వతంపై నిలిచి ఉంటుంది; అయితే పెంటకుప్పలో గడ్డిని త్రొక్కినట్లు, మోయాబీయులు తమ దేశంలోనే త్రొక్కబడతారు.

  16. సోంపును యంత్రంతో నూర్చరు, జీలకర్ర మీద బండి చక్రం నడిపించరు; కర్రతో సోంపును దుడ్డుకర్రతో జీలకర్రను కొట్టి దులుపుతారు.

  17. రొట్టె చేయడానికి ధాన్యాన్ని దంచాలి; కాబట్టి ఎప్పుడూ దానిని నూర్చుతూనే ఉండరు. నూర్చే బండి చక్రాలు దానిపై నడిపిస్తారు, కాని వాటిని పిండి చేయడానికి గుర్రాలను ఉపయోగించరు.

  18. భూమిని దున్నే ఎడ్లు గాడిదలు చేటతో జల్లెడతో చెరిగిన మేత, కుడితి తింటాయి.

  19. “చూడు, నేను నిన్ను పదునుగా ఉండి, అనేకమైన పళ్ళు కలిగిన క్రొత్త నూర్చే పలకగా చేస్తాను. నీవు పర్వతాలను నూర్చి నలగ్గొడతావు, కొండలను పొట్టులా చేస్తావు.

  20. నీవు వాటిని చెరగగా, గాలికి కొట్టుకుపోతాయి, సుడిగాలి వాటిని చెదరగొడుతుంది. అయితే నీవు యెహోవాలో సంతోషిస్తావు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి అతిశయపడతావు.

  21. ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: “బబులోను కుమార్తె నూర్పిడి కళ్ళంలా ఉంది దాన్ని నూర్పిడి సమయం ఇదే; త్వరలో దాని కోతకాలం వస్తుంది.”

  22. ఇశ్రాయేలూ, ఆనందించకు; ఇతర దేశాల్లా ఉత్సాహపడకు. నీవు నీ దేవుని పట్ల నమ్మకంగా లేవు; ధాన్యం దుల్లగొట్టే నీ నూర్పిడి కళ్ళాలన్నిటిలో నీవు వేశ్యల జీతాన్ని తీసుకోవడానికి ఇష్టపడ్డావు.

  23. నూర్పిడి కళ్ళాలు, ద్రాక్ష గానుక తొట్లు ప్రజలను పోషించవు, క్రొత్త ద్రాక్షరసం వారికి మిగలదు.

  24. ఎఫ్రాయిం శిక్షణ పొందిన పెయ్యలా ఉంది, నూర్పిడి అంటే దానికి ఇష్టం; కాబట్టి దాని నున్నటి మెడ మీద నేను కాడి పెడతాను, నేను ఎఫ్రాయిం మీద స్వారీ చేస్తాను, యూదా భూమిని దున్నాలి, యాకోబు భూమిని చదును చేయాలి.

  25. నూర్పిడి కళ్ళాలు ధాన్యంతో నిండి ఉంటాయి, క్రొత్త ద్రాక్షరసం, నూనెతో గానుగ తొట్లు పొర్లిపారుతాయి.