కంటెంట్‌కు వెళ్లండి

The Second Coming of Christ గురించి బైబిల్ వచనాలు

144 వచనాలు · 65 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. నా విమోచకుడు సజీవుడని, తుదకు ఆయన భూమి మీద నిలబడతారని నాకు తెలుసు.

  2. నా చర్మం నాశనమైపోయిన తర్వాత నా శరీరంతో నేను దేవుని చూస్తాను.

  3. మన దేవుడు వస్తారు మౌనంగా ఉండరు; ఆయన ముందు మ్రింగివేసే అగ్ని ఉంది ఆయన చుట్టూ బలమైన తుఫాను చెలరేగుతుంది.

  4. తన ప్రజలకు తీర్పు ఇవ్వడానికి పైన ఉన్న ఆకాశాలను, క్రింద భూమిని పిలుస్తారు.

  5. చంద్రుడు దిగులు చెందుతాడు సూర్యుడు సిగ్గుపడతాడు; సైన్యాల యెహోవా సీయోను కొండమీద యెరూషలేములో, దాని పెద్దల ఎదుట గొప్ప మహిమతో రాజ్యమేలుతారు.

  6. “రాత్రి దర్శనంలో నేను చూస్తుండగా మనుష్యకుమారునిలా ఉన్న ఒక వ్యక్తి మేఘాల మీద నా ముందుకు వచ్చాడు. అతడు మహా వృద్ధుని సముఖంలోకి వచ్చాడు.

  7. ఆయనకు అధికారం, మహిమ, సర్వ శక్తి ఇవ్వబడ్డాయి; సర్వ దేశాలు, వివిధ భాషల ప్రజలు ఆయనను ఆరాధించారు. ఆయన అధికారం శాశ్వతమైనది అది ఎన్నడు గతించిపోదు. ఆయన రాజ్యం ఎన్నటికి నాశనం కాదు.

  8. అప్పుడు ఆకాశం క్రిందున్న అన్ని రాజ్యాల అధికారం, శక్తి, మహాత్యం, సర్వోన్నతుని పరిశుద్ధులకు ఇవ్వబడుతుంది. ఆయన రాజ్యం శాశ్వతం రాజ్యం, అధికారులందరు ఆయనను ఆరాధిస్తూ, ఆయనకు లోబడతారు.’

  9. ఎందుకంటే మనుష్యకుమారుడు తన తండ్రి మహిమతో తన దూతలతో కూడ రాబోతున్నాడు. అప్పుడు ఆయన ప్రతివానికి వాని పనుల ప్రకారం ప్రతిఫలం ఇస్తాడు.

  10. యేసు ఒలీవల కొండమీద కూర్చుని ఉన్నప్పుడు, తన శిష్యులు ఆయన దగ్గరకు ఒంటరిగా వచ్చారు. వారు, “ఈ సంగతులు ఎప్పుడు జరుగుతాయి, నీ రాకడకు యుగాంతం కావడానికి సూచనలు ఏమైనా కనబడతాయా?” మాకు చెప్పుమని అడిగారు.

  11. యేసు వారితో, “ఎవరు మిమ్మల్ని మోసగించకుండ జాగ్రత్తగా ఉండండి.

  12. ఎందుకంటే అనేకులు నా పేరిట వచ్చి, ‘నేనే క్రీస్తును’ అని చెప్పి చాలామందిని మోసం చేస్తారు.

  13. మీరు యుద్ధాల గురించి, యుద్ధ సమాచారాలను గురించి వింటారు. కాని మీరు కలవరపడకుండ జాగ్రత్తగా ఉండండి. అలాంటివన్ని జరగ వలసి ఉంది, కాని అంతం వెంటనే రాదు.

  14. జనాల మీదికి జనాలు, రాజ్యాల మీదికి రాజ్యాలు లేస్తాయి. అక్కడక్కడ కరువులు, భూకంపాలు వస్తాయి.

  15. ఇవన్నీ ప్రసవ వేదనలకు ప్రారంభం మాత్రమే.

  16. “అప్పుడు హింసించబడడానికి మరణానికి మీరు అప్పగించబడతారు, నన్ను బట్టి మీరు అన్ని రాజ్యాలచేత ద్వేషించబడతారు.

  17. ఆ సమయంలో అనేకులు తమ నమ్మకాన్ని వదులుకొని ఒకరినొకరు ద్వేషించుకొని మోసగించుకుంటారు.

  18. అప్పుడు అనేక అబద్ధ ప్రవక్తలు వచ్చి ఎంతోమందిని మోసపరుస్తారు.

  19. దుష్టత్వం ఎక్కువవుతూ ఉంటే అనేకుల ప్రేమ చల్లారుతుంది.

  20. కాని చివరి వరకు స్థిరంగా నిలబడినవారే రక్షింపబడతారు.

  21. ఈ రాజ్యసువార్త సమస్త దేశ ప్రజలకు సాక్ష్యంగా లోకమంతట ప్రకటింపబడిన తర్వాత, అంతం వస్తుంది.

  22. “కాబట్టి ‘నిర్జనంగా మారడానికి కారణమైన హేయమైనది’ పరిశుద్ధ స్థలంలో నిలబడడం మీరు చూసినప్పుడు, దానియేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన మాట, చదివేవాడు అర్థం చేసుకొనును గాక.

  23. అప్పుడు యూదయలోని వారు కొండల్లోకి పారిపోవాలి.

  24. ఇంటిపైన ఉన్నవారెవరు క్రిందికి దిగకూడదు ఇంట్లోకి వెళ్లి దేన్ని బయటకు తీసుకురాకూడదు.

  25. పొలంలో ఉన్నవారు తమ పైవస్త్రాన్ని తెచ్చుకోడానికి తిరిగి వెనుకకు వెళ్లకూడదు.