కంటెంట్‌కు వెళ్లండి

The Second Coming of Christ గురించి బైబిల్ వచనాలు

144 వచనాలు · 65 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. “ ‘వస్తాను’ అని ఆయన చేసిన వాగ్దానం ఎక్కడ ఉంది? మన పితరులు ఎప్పుడో చనిపోయారు, సృష్టి ఆరంభం నుండి ఎలా ఉందో, మార్పు లేకుండా అంతా అలాగే జరుగుతుంది” అని వారు చెప్తారు.

  2. కాని ప్రభువు దినం దొంగలా వస్తుంది. ఆకాశాలు మహాశబ్దంతో గతించిపోతాయి; మూలకాలు అగ్నిచేత నశించిపోతాయి, భూమి దానిలో చేయబడి ఉన్న సమస్తం లయమైపోతాయి.

  3. దేవుని రాకడ దినం కోసం అపేక్షతో కనిపెట్టండి. ఆ దినాన ఆకాశాలు అగ్నిచేత నశించిపోతాయి, మూలకాలు వేడికి కరిగిపోతాయి.

  4. కాబట్టి, ప్రియ పిల్లలారా, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడలో ఆయన ముందు మనం సిగ్గుపడకుండా ధైర్యం కలిగి ఉండేలా మీరు ఆయనలో కొనసాగండి.

  5. ప్రియ మిత్రులారా, మనం ఇప్పుడు దేవుని పిల్లలమే కాని, ఇక ఏమి కానున్నామో ఇంకా స్పష్టం కాలేదు. క్రీస్తు ప్రత్యక్షమైనపుడు, ఆయన యథార్థ రూపాన్ని మనం చూస్తాము కాబట్టి, ఆయన వలె ఉంటామని తెలుసుకుంటాము.

  6. తీర్పు రోజున మనం ధైర్యంతో ఉండేలా దేవుని ప్రేమ మనలో ఈ విధంగా పరిపూర్ణం చేయబడింది: ఈ లోకంలో మనం యేసు వలె ఉన్నాము.

  7. ఆదాము నుండి ఏడవ తరం వాడైన హనోకు వారి గురించి ఇలా ప్రవచించాడు: “చూడండి, వేవేలకొలది తన పరిశుద్ధ జనంతో ప్రభువు వస్తారు.

  8. అందరికి తీర్పు తీర్చడానికి, వారి భక్తిహీనతలో వారు చేసిన దుష్ట కార్యాలను, భక్తిహీనులైన పాపులు ఆయనకు వ్యతిరేకంగా పలికిన ధిక్కారపు మాటలను వారందరిచేత ఒప్పింపజేస్తారు.”

  9. మీరు తొట్రిల్లకుండ కాపాడడానికి, తన మహిమ ముందు ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టడానికి, శక్తి కలిగిన, మన రక్షకుడైన అద్వితీయ దేవునికి,

  10. “ఇదిగో! ఆయన మేఘాలలో వస్తున్నారు. ప్రతి కన్ను ఆయనను చూస్తుంది, ఆయనను పొడిచిన వారు కూడ ఆయనను చూస్తారు”; భూమి మీద ఉన్న జనులందరు, “ఆయనను చూసి దుఃఖిస్తూ విలపిస్తారు.”

  11. నీవు వారిని దేవుని సేవించే రాజ్యంగా యాజకులుగా చేశావు, భూమిని పరిపాలించడానికి వారిని నియమించావు.”

  12. ఏడవ దేవదూత తన బూరను ఊదినప్పుడు పరలోకంలో గొప్ప స్వరాలు, ఇలా చెప్పడం వినిపించింది, “భూలోక రాజ్యం ప్రభు రాజ్యంగా ఆయన క్రీస్తు రాజ్యంగా మారాయి కాబట్టి ఆయన ఎల్లకాలం పరిపాలిస్తారు.”

  13. “ఇదిగో! నేను దొంగలా వస్తాను! దిగంబరులుగా ఉండి సిగ్గుపడేవారిగా ఉండకుండా, మెలకువగా ఉండి వస్త్రం ధరించుకొని సిద్ధపడి ఉన్నవారు ధన్యులు!”

  14. మొదటి పునరుత్థానంలో పాలుపొందినవారు ధన్యులు పరిశుద్ధులు. రెండవ మరణానికి వారి మీద అధికారం లేదు. అయితే వారు దేవునికి క్రీస్తుకు యాజకులుగా ఉంటూ ఆయనతో పాటు వెయ్యి సంవత్సరాలు పరిపాలిస్తారు.

  15. అప్పుడు నేను ఒక తెల్లని సింహాసనాన్ని దాని మీద కూర్చున్న ఒకరిని చూశాను. భూమి ఆకాశాలు ఆయన సన్నిధి నుండి పారిపోయాయి వాటికి ఎక్కడ స్థలం లేదు.

  16. ఆ తర్వాత దేవుని సింహాసనం ముందు సామాన్యులు గొప్పవారితో సహా చనిపోయిన వారందరూ నిలబడి ఉండడం నేను చూశాను. గ్రంథాలు తెరవబడ్డాయి. వాటిలో జీవగ్రంథం అనబడే మరొక గ్రంథం తెరవబడింది. జీవగ్రంథంలో వ్రాయబడిన ప్రకారం చనిపోయినవారు తాము చేసిన పనులను బట్టి తీర్పు తీర్చబడ్డారు.

  17. సముద్రం దానిలో చనిపోయినవారిని అప్పగించింది. అలాగే మరణం పాతాళం తమలో ఉన్న చనిపోయినవారిని అప్పగించాయి. అప్పుడు ప్రతి ఒక్కరు తాము చేసిన పనుల ప్రకారం తీర్పు తీర్చబడ్డారు.

  18. అక్కడ రాత్రి ఉండదు. ప్రభువైన దేవుడే వారికి కాంతిని ఇస్తారు కాబట్టి వారికి దీపకాంతి గాని సూర్యకాంతి గాని అవసరం లేదు. వారు ఎల్లకాలం పరిపాలిస్తూ ఉంటారు.

  19. ఈ సంగతుల గురించి సాక్ష్యమిచ్చేవాడు, “నిజమే, నేను త్వరగా వస్తున్నాను!” అంటున్నాడు. ఆమేన్! రండి, ప్రభువైన యేసు!