Skip to content

The Rich గురించి బైబిల్ వచనాలు

145 వచనాలు · 1 కోణం

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. దుమ్ము పోగుచేసినట్లు వెండిని పోగుచేసినా మట్టివలె బట్టలను కుప్పగా వేసినా

  2. వారు పోగుచేసిన వాటిని నీతిమంతులు ధరిస్తారు, నిర్దోషులు వారి వెండిని పంచుకుంటారు.

  3. వారు కట్టుకునే ఇల్లు పురుగుల గూడులా, కావలివారు వేసుకునే గుడిసెలా ఉంటాయి.

  4. వారు ధనవంతులుగా పడుకుంటారు, కాని వారు మేల్కొన్నప్పుడు వారి సంపద అంతా పోయిందని వారు కనుగొంటారు.

  5. భీభత్సం వారిని వరదలా ముంచెత్తుతుంది; తుఫాను రాత్రివేళ వారిని లాక్కుని పోతుంది.

  6. తూర్పు గాలి వారిని తీసుకెళ్తే, వారిక ఉండరు; అది వారి స్థలం నుండి వారిని తుడిచివేస్తుంది.

  7. వారు దాని శక్తి నుండి తలక్రిందులుగా పారిపోతున్నప్పుడు అది దయ లేకుండా వారికి వ్యతిరేకంగా తిరుగుతుంది.

  8. అది ఎగతాళి చేస్తూ చప్పట్లు కొడుతుంది వారి స్థలం నుండి వారిని ఊదివేస్తుంది.”

  9. “నేను బంగారంపై నా నమ్మకాన్ని ఉంచినా, ‘నీవే నా భద్రత’ అని మేలిమి బంగారంతో చెప్పినా,

  10. ఒకవేళ నా గొప్ప ఆస్తిని బట్టి, నా చేతులు సంపాదించిన ఐశ్వర్యాన్ని బట్టి నేను సంతోషిస్తే,

  11. అప్పుడు అవి కూడా తీర్పుకు తగిన పాపాలు అవుతాయి, ఎందుకంటే పైనున్న దేవునికి నేను నమ్మకద్రోహిని అవుతాను.

  12. కాబట్టి ఇతరులు ధనవంతులుగా ఎదిగినప్పుడు, వారి ఇండ్ల వైభవం అధికమైనప్పుడు భయపడవద్దు.

  13. ఎందుకంటే వారు చనిపోయినప్పుడు వారు తమతో ఏమీ తీసుకెళ్లరు, వారి వైభవం వారి వెంట దిగిపోదు.

  14. వారు బ్రతికి ఉన్నప్పుడు ఆశీర్వదింపబడిన వారిగా తమను తాము పిలుచుకున్నా, వారు అభివృద్ధి చెందినప్పుడు ప్రజలు వారిని పొగిడినా,

  15. సంగీత దర్శకునికి. దావీదు ధ్యానకీర్తన. ఎదోమీయుడైన దోయేగు సౌలు దగ్గరకు వచ్చి–దావీదు అహీమెలెకు ఇంటికి వెళ్లాడని అతనితో చెప్పినప్పుడు దావీదు ఈ కీర్తన రచించాడు. బలాఢ్యుడా, చేసిన కీడు గురించి ఎందుకు గొప్పలు చెప్పుకుంటున్నావు? దేవుని దృష్టిలో అవమానకరమైన నీవు, రోజంతా ఎందుకు ప్రగల్భాలు పలుకుతావు?

  16. మోసం చేసేవాడా, నీ నాలుక పదునైన క్షౌరం చేసే కత్తి; అది నాశనాన్ని చేస్తుంది.

  17. మేలు కంటే కీడు చేయడం, నీతి కంటే అబద్ధం చెప్పడమే నీకు ఇష్టం. సెలా

  18. మోసపూరితమైన నాలుక గలవాడా, నీకు హానికరమైన మాటలే ఇష్టం.

  19. ఖచ్చితంగా దేవుడు నిన్ను నిత్యనాశనానికి గురి చేస్తారు: ఆయన నిన్ను మీ గుడారంలో నుండి పెరికివేస్తారు; సజీవుల దేశంలో నుండి నిన్ను పెరికివేస్తారు. సెలా

  20. నీతిమంతులు ఇదంతా చూసి భయభక్తులతో వారు నవ్వుతూ ఇలా అంటారు,

  21. “ఇతన్ని చూడండి, దేవున్ని తన బలమైన కోటగా చేసుకోకుండ తనకున్న సంపదలను నమ్ముకుని ఇతరులను నాశనం చేస్తూ బలపడ్డాడు!”

  22. దుష్టుల క్షేమం నేను చూసినప్పుడు నేను అహంకారుల మీద అసూయ పడ్డాను.

  23. వారికి ఏ బాధలు లేవు; వారి శరీరాలు ఆరోగ్యంగా బలంగా ఉన్నాయి.

  24. సాధారణంగా మనుష్యులకు ఉండే భారాలు వారికి లేవు; మనుష్యులకు కలిగే అనారోగ్యమనే తెగులు వారికి లేదు.

  25. కాబట్టి గర్వం వారికి కంఠహారంగా ఉంది; హింసను వారు వస్త్రంగా ధరించారు.