కంటెంట్‌కు వెళ్లండి

The Mercy of God గురించి బైబిల్ వచనాలు

102 వచనాలు · 36 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. భూమికంటె ఆకాశం ఎంత ఎత్తున ఉందో, తనకు భయపడేవారి పట్ల ఆయన ప్రేమ అంత ఉన్నతం.

  2. ఆయనకు భయపడేవారి పట్ల యెహోవా మారని ప్రేమ వారి పిల్లల పట్ల ఆయన నీతి నిత్యం నిలిచి ఉంటుంది,

  3. యెహోవాను స్తుతించండి. యెహోవా మంచివాడు, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించండి; ఆయన మారని ప్రేమ నిరంతరం నిలుస్తుంది.

  4. యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించండి, ఆయన మంచివారు; ఆయన మారని ప్రేమ నిత్యం ఉంటుంది.

  5. మాకు కాదు, యెహోవా, మాకు కాదు, మీ మారని ప్రేమ, నమ్మకత్వాన్ని బట్టి, మీ నామానికే మహిమ కలగాలి.

  6. యెహోవా మంచివాడు, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించండి; ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.

  7. “ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది” అని ఇశ్రాయేలీయులు చెప్పుదురు గాక.

  8. “ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది” అని అహరోను వంశం చెప్పుదురు గాక.

  9. “ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది” అని యెహోవాకు భయపడేవారు చెప్పుదురు గాక.

  10. యెహోవా మంచివాడు, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించండి; ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.

  11. యెహోవా, ఈ లోకమంతా మీ మారని ప్రేమ చేత నిండి ఉంది; మీ శాసనాలు నాకు బోధించండి.

  12. ఓ ఇశ్రాయేలూ, యెహోవా మీద నీ నిరీక్షణ ఉంచు, ఎందుకంటే యెహోవా దగ్గర మారని ప్రేమ లభిస్తుంది ఆయన దగ్గర పూర్తి విమోచన దొరుకుతుంది.

  13. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన మంచివాడు. ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.

  14. దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.

  15. ప్రభువుల ప్రభువుకు కృతజ్ఞత చెల్లించండి: ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.

  16. మహాద్భుతాలు చేసేది ఆయన ఒక్కడే, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.

  17. ఆయన తన జ్ఞానం చేత ఆకాశాలను కలుగజేశారు, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.

  18. నీటిపై భూమిని పరిచిన దేవునికి స్తుతులు చెల్లించండి. ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.

  19. మహాజ్యోతులను నిర్మించిన దేవునికి స్తుతులు, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.

  20. పగటిని ఏలడానికి సూర్యుని చేసింది ఆయనే, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.

  21. రాత్రిని యేలడానికి చంద్రుని, నక్షత్రాలను చేసిన దేవునికి స్తుతులు, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.

  22. ఈజిప్టు తొలిసంతానాన్ని ఆయన సంహరించారు, ఆయన ప్రేమ నిరంతరం ఉంటుంది.

  23. వారి మధ్య నుండి ఇశ్రాయేలీయులను ఆయన రప్పించారు, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.

  24. చేయి చాచి తన బలమైన హస్తంతో వారిని రప్పించింది ఆయనే, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.

  25. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చిన దేవునికి స్తుతులు చెల్లించండి, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.