కంటెంట్‌కు వెళ్లండి

The Mercy of God గురించి బైబిల్ వచనాలు

102 వచనాలు · 36 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. దాని మధ్యలో నుండి ఇశ్రాయేలీయులను దాటించింది ఆయనే, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.

  2. ఫరోను, అతని సైన్యాన్ని ఎర్ర సముద్రంలో ముంచివేసింది ఆయనే, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.

  3. అరణ్యం గుండా తన ప్రజలను నడిపించిన దేవునికి స్తుతులు చెల్లించండి, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.

  4. గొప్పరాజులను పడగొట్టిన దేవునికి స్తుతులు చెల్లించండి, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.

  5. బలాఢ్యులైన రాజులను చంపింది ఆయనే ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.

  6. అమోరీయుల రాజైన సీహోనును చంపింది ఆయనే, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.

  7. బాషాను రాజైన ఓగును చంపింది ఆయనే ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.

  8. వారి దేశాన్ని వారసత్వంగా ఇచ్చింది ఆయనే, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.

  9. తన సేవకుడైన ఇశ్రాయేలుకు దానిని వారసత్వంగా ఇచ్చింది ఆయనే, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.

  10. మనం దీనదశలో ఉన్నప్పుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంది ఆయనే, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.

  11. మన శత్రువుల నుండి మనల్ని విడిపించింది ఆయనే, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.

  12. ప్రతి జీవికి ఆహారం ఇచ్చేది ఆయనే, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.

  13. పరలోక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.

  14. యెహోవా అందరికి మంచివారు; ఆయన చేసిన సృష్టి అంతటి మీద దయ గలవాడు.

  15. ఆయనకు భయపడు వారిని బట్టి, ఆయన మారని ప్రేమ యందు నిరీక్షణ గలవారిని బట్టి యెహోవా ఆనందిస్తారు.

  16. తమ పాపాలను దాచిపెట్టేవారు వర్ధిల్లరు, కాని వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేవారు కనికరం పొందుతారు.

  17. ఆకాశాల్లారా, ఉత్సాహ ధ్వని చేయండి; భూమీ, సంతోషించు; పర్వతాల్లారా, ఆనందంతో పాట పాడండి! ఎందుకంటే, యెహోవా తన ప్రజలను ఓదారుస్తారు, బాధించబడిన తన ప్రజల పట్ల జాలి చూపిస్తారు.

  18. “కొద్ది కాలం నేను నిన్ను విడిచిపెట్టాను, కానీ గొప్ప జాలితో నేను నిన్ను తిరిగి చేర్చుకుంటాను.

  19. తీవ్రమైన కోపంలో కొంతకాలం నీవైపు నేను చూడలేదు కాని నిత్యమైన కృపతో నీపై జాలి చూపిస్తాను” అని నీ విమోచకుడైన యెహోవా అంటున్నారు.

  20. శ్రద్ధగా విని నా దగ్గరకు రండి; మీరు వింటే బ్రతుకుతారు. నేను మీతో నిత్య నిబంధన చేస్తాను, దావీదుకు వాగ్దానం చేసిన నా శాశ్వత ప్రేమను మీకు చూపిస్తాను.

  21. దుష్టులు తమ మార్గాలను అవినీతిపరులు తమ ఆలోచనలు విడిచిపెట్టాలి. వారు యెహోవా వైపు తిరిగితే ఆయన వారిపై జాలి పడతారు. మన దేవుడు వారిని ఉచితంగా క్షమిస్తారు.

  22. నీవు వెళ్లి, ఉత్తరాన ఈ సందేశం ప్రకటించాలి: “ ‘ద్రోహియైన ఇశ్రాయేలూ, తిరిగి రా’ అని యెహోవా ప్రకటిస్తున్నారు, ‘ఇకపై నేను నీవైపు కన్నెత్తి చూడను, ఎందుకంటే నేను నమ్మకస్థుడను’ అని యెహోవా ప్రకటిస్తున్నారు, ‘నేను నిత్యం కోపంగా ఉండను.

  23. సంతోషకరమైన శబ్దాలు, ఆనంద ధ్వనులు, వధూవరుల స్వరాలు మరోసారి వినిపిస్తాయి. వారు యెహోవా ఆలయానికి కృతజ్ఞతార్పణలు తీసుకువస్తూ, “సైన్యాల యెహోవాకు స్తుతులు చెల్లించండి, యెహోవా మంచివాడు; ఆయన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది” అంటారు. ఎందుకంటే నేను వారిని చెర నుండి తిరిగి రప్పిస్తాను’ అని యెహోవా అంటున్నారు.

  24. యెహోవా మహా ప్రేమను బట్టి మనం నాశనం కాలేదు, ఎందుకంటే ఆయన కనికరం ఎన్నటికీ తగ్గదు.

  25. ప్రతి ఉదయం అవి క్రొత్తవిగా ఉంటాయి; మీ నమ్మకత్వం గొప్పది.