Skip to content

Tabernacle గురించి బైబిల్ వచనాలు

465 వచనాలు · 94 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. కాబట్టి రాజు ముఖ్య యాజకుడైన యెహోయాదాను పిలిచి, “నిబంధన గుడారం కొరకై ఇశ్రాయేలీయుల సమాజానికి యెహోవా సేవకుడైన మోషే విధించిన పన్నును యూదా నుండి యెరూషలేము నుండి లేవీయులు వెళ్లి తీసుకురావాలని నీవెందుకు అడగలేదు?” అని అన్నాడు.

  2. దావీదు కీర్తన. యెహోవా, మీ పవిత్ర గుడారంలో ఉండగలవారు ఎవరు? మీ పరిశుద్ధ పర్వతంపై నివసించగలవారు ఎవరు?

  3. యెహోవాను ఒకటి అడిగాను, నేను కోరింది ఇదే; యెహోవా ప్రసన్నతను చూస్తూ ఆయన మందిరంలో ఆయనను వెదకుతూ నా జీవితకాలమంతా నేను యెహోవా మందిరంలో నివసించాలని కోరుతున్నాను.

  4. షిలోహు ప్రత్యక్ష గుడారాన్ని, మనుష్యుల మధ్య ఆయన వేసుకున్న గుడారాన్ని విడిచిపెట్టారు.

  5. అప్పుడు ఆయన యోసేపు గుడారాలను నిరాకరించారు, ఆయన ఎఫ్రాయిం గోత్రాన్ని ఏర్పరచుకోలేదు;

  6. అది పగలు ఎండ వేడి నుండి ఆశ్రయంగా, నీడగా, తుఫాను, వానల నుండి కాపాడే దాగుచోటుగా ఉంటుంది.

  7. మారని ప్రేమలో సింహాసనం స్థాపించబడుతుంది; దావీదు కుటుంబం నుండి సత్యవంతుడైన ఒకడు దానిపై కూర్చుని న్యాయంగా తీర్పు తీర్చుతూ నీతిన్యాయాలను జరిగించడానికి త్వరపడతాడు.

  8. “నీ గుడారపు స్థలాన్ని పెద్దగా చేయి. నీ గుడారపు తెరలను ఆటంకం లేకుండా ముందుకు పొడిగించు నీ త్రాళ్లను పొడవుగా చేయి. నీ మేకుల్ని లోతుగా దిగగొట్టు.

  9. నా జీవం తోడు, నిశ్చయంగా, నీవు నీ నీచమైన ప్రతిమలతోను అసహ్యమైన ఆచారాలతోను నా పరిశుద్ధాలయాన్ని అపవిత్రపరిచావు కాబట్టి, నేనే నీకు క్షౌరం చేస్తాను; నేను నీపై జాలిపడను, నిన్ను కనికరించను” అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.

  10. వారు నాకు కూడా ఇలా చేశారు: అదే సమయంలో వారు నా పరిశుద్ధాలయాన్ని అపవిత్రం చేశారు; నా సబ్బాతులను కూడా అపవిత్రం చేశారు.

  11. ఆ వాక్యం శరీరాన్ని ధరించుకొని మన మధ్య నివసించింది. మనం ఆయన మహిమను చూశాం, కృపాసత్య సంపూర్ణుడై, తండ్రి దగ్గర నుండి వచ్చిన, ఏకైక కుమారుని మహిమను చూశాము.

  12. “దేవుడు మోషేకు చూపించిన నమూనా ప్రకారం, దేవుని సన్నిధి కలిగిన సాక్షి గుడారం అరణ్యంలో మన పితరుల దగ్గర ఉన్నది.

  13. యూదేతరులంతా విశ్వాసానికి విధేయులు కావాలని, అనాది కాలం నుండి రహస్యంగా దాచబడి, ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మం, నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారం వ్రాయబడిన ప్రవచనాత్మక లేఖనాల ద్వారా ఇప్పుడు వారికి తెలియపరచబడింది. ఆ మర్మానికి అనుగుణంగా నేను ప్రకటిస్తున్న యేసు క్రీస్తు గురించిన సువార్త ప్రకారం మిమ్మల్ని స్థిరపరచగల సమర్థుడును ఏకైక జ్ఞానవంతుడునైన దేవునికి యేసు క్రీస్తు ద్వారా శాశ్వత మహిమ కలుగును గాక! ఆమేన్.

  14. But now is made manifest, and by the scriptures of the prophets, according to the commandment of the everlasting God, made known to all nations for the obedience of faith:

  15. మనం నివసిస్తున్న భూసంబంధమైన గుడారం నాశనమైనా, మానవ నిర్మితం కాని దేవుడు కట్టిన ఒక శాశ్వతమైన గృహం పరలోకంలో ఉందని మనకు తెలుసు.

  16. మనకు ఉన్న ఈ నిరీక్షణ మన ఆత్మకు లంగరులా స్థిరపరచి భద్రపరుస్తుంది. ఇది తెర వెనుక ఉన్న గర్భాలయంలోకి ప్రవేశింప చేస్తుంది.

  17. అక్కడే యేసు మనకంటే ముందుగా మెల్కీసెదెకు క్రమంలో నిరంతరం ప్రధాన యాజకునిగా మన పక్షాన దానిలోనికి ప్రవేశించారు.

  18. ఆయన మానవుని చేత కాక దేవుని చేత తయారుచేయబడిన నిజమైన ప్రత్యక్షగుడారంలో అతిపరిశుద్ధమైన స్థలంలో ప్రధాన యాజకునిగా పరిచర్య చేస్తున్నాడు.

  19. పరలోకంలో ఉన్న దానికి కేవలం ఒక నమూనాగా ఛాయాచిత్రంగా ఉన్న పరిశుద్ధ స్థలంలో యాజకులుగా వారు సేవ చేస్తారు. ఇందుకే మోషే గుడారాన్ని నిర్మిస్తున్నప్పుడు దాన్ని గురించి ఇలా హెచ్చరిక పొందాడు: “పర్వతం మీద నేను నీకు చూపించిన నమూనా ప్రకారమే ప్రతిదీ చేసేలా చూడాలి.”

  20. మొదటి నిబంధనలో దేవుని ఆరాధించడానికి కొన్ని నియమాలు, భూసంబంధమైన ప్రత్యక్ష గుడారం ఉన్నాయి.

  21. ఆ గుడారం ఇలా ఏర్పరచబడింది. దానిలోని మొదటి గదిలో ఒక దీప దీపస్తంభం, ఒక బల్ల దానిపై అర్పించబడిన రొట్టెలు ఉన్నాయి, ఆ గదికి పరిశుద్ధ స్థలమని పేరు.

  22. రెండవ తెర వెనుక అతి పరిశుద్ధ స్థలం అని పిలువబడే గది ఉంది,

  23. దానిలో ధూపం వేయడానికి బంగారు బలిపీఠం, బంగారంతో కప్పబడిన నిబంధన పెట్టె ఉన్నాయి. ఆ పెట్టెలో మన్నా ఉంచబడిన బంగారు పాత్ర, చిగురించిన అహరోను కర్ర, వ్రాయబడిన నిబంధన రాతిపలకలు ఉన్నాయి.

  24. ఈ పెట్టె పైన మహిమగల కెరూబులు తమ రెక్కలతో ప్రాయశ్చిత్త పీఠంను కాపాడుతూ ఉన్నాయి. అయితే ఈ సంగతుల గురించి వివరంగా ఇప్పుడు మనం చర్చించలేము.

  25. ఇలా అన్ని ఏర్పాటు చేయబడిన తర్వాత, ప్రతిరోజు యాజకులు తమ పరిచర్యను చేయడానికి మొదటి గదిలోకి వెళ్తారు.