కంటెంట్‌కు వెళ్లండి

Riches గురించి బైబిల్ వచనాలు

225 వచనాలు · 107 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అనేకమంది దుష్టుల ధనం కంటే నీతిమంతుల దగ్గర ఉన్న కొంచెం మేలు.

  2. “నిశ్చయంగా మనుష్యులు కేవలం నీడలా తిరుగుతున్నారు; వారి ధనం ఎవరికి దక్కుతుందో తెలియకుండానే వారు వ్యర్థంగా ధనం సమకూర్చుకుంటారు.

  3. వారు తమ సంపదను నమ్మి, తమ ఐశ్వర్యాన్ని గురించి గొప్పలు చెప్పుకుంటారు.

  4. ఎవరు మరొకరి ప్రాణాన్ని విడిపించలేరు వారి కోసం దేవునికి క్రయధనం చెల్లించలేరు.

  5. వారు కుళ్లు చూడక, నిత్యం బ్రతకాలంటే వారి ప్రాణ విమోచన వెల చాలా ఎక్కువ అది ఎన్నటికి చెల్లించబడలేదు.

  6. That he should still live for ever, and not see corruption.

  7. తమ సంపదను ఇతరులకు వదిలేసి జ్ఞానులు చనిపోవడం, మూర్ఖులు తెలివిలేనివారు నశించడం అందరు చూస్తారు.

  8. “ఇతన్ని చూడండి, దేవున్ని తన బలమైన కోటగా చేసుకోకుండ తనకున్న సంపదలను నమ్ముకుని ఇతరులను నాశనం చేస్తూ బలపడ్డాడు!”

  9. బలాత్కారాన్ని నమ్ముకోకండి దోపిడీలు చేసి ధనవంతులై విర్రవీగకండి. ధనం ఎక్కువైనా సరే, దాని మీద మనస్సు పెట్టకండి.

  10. దుష్టులు ఇలా ఉంటారు. ఎప్పుడూ ఏ జాగ్రత్తలు లేకుండ సంపద కూడబెట్టుకుంటారు.

  11. అన్యాయపు ధనం యొక్క విలువ నిలువదు, అయితే నీతి చావు నుండి విడిపిస్తుంది.

  12. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని తెస్తుంది, బాధ దుఃఖం దానికి జోడించబడవు.

  13. ఉగ్రత దినాన సంపద విలువలేనిది, అయితే నీతి చావు నుండి విడిపిస్తుంది.

  14. సంపదను నమ్ముకునేవారు పాడైపోతారు, నీతిమంతులు చిగురాకువలే అభివృద్ధి పొందుతారు.

  15. కొందరు ఏమి లేకపోయినా ధనవంతులుగా నటిస్తారు; మరికొందరు బాగా ధనము కలిగి ఉండి కూడా, పేదవారిగా నటిస్తారు.

  16. ఒకని ఐశ్వర్యం వారి ప్రాణాన్ని విమోచించవచ్చు, కాని పేదవాడు బెదిరింపు మాటలను వినడు.

  17. నిజాయితీ లేని డబ్బు తగ్గిపోతుంది, కాని కష్టపడి సంపాదించేవారు డబ్బును దానిని ఎక్కువ చేసుకుంటారు.

  18. మంచివారు తన పిల్లల పిల్లలకు ఆస్తులు ఉంచుతారు, పాపుల ఆస్తి నీతిమంతులకు ఉంచబడుతుంది.

  19. జ్ఞానుల ఐశ్వర్యం వారికి కిరీటం, బుద్ధిహీనుల మూర్ఖత్వం మూర్ఖత్వమే.

  20. నీతిమంతుని ఇంట్లో గొప్ప ధననిధి ఉన్నది, కాని దుష్టుని కలుగు వచ్చుబడి కష్టానికి కారణము.

  21. నెమ్మది లేకుండా ఎక్కువ ధనముండడం కంటే, కొంచెమే కలిగి ఉండి యెహోవాయందు భయం ఉంటే మేలు.

  22. ద్వేషం కలిగిన చోట క్రొవ్విన ఎద్దు మాంసం తినడం కంటే, ప్రేమ ఉన్నచోట ఆకుకూరల భోజనం తినడం మేలు.

  23. అత్యాశ తన ఇంటివారి మీదికి పతనాన్ని తెస్తుంది, లంచాన్ని అసహ్యించుకునేవారు బ్రతుకుతారు.

  24. అన్యాయం చేత కలిగిన గొప్ప రాబడి కంటే, నీతితో కూడిన కొంచెము మేలు.

  25. పేదవాడు దయ కోసం విజ్ఞప్తి చేస్తాడు, కాని ధనికుడు కఠినంగా సమాధానం ఇస్తారు.